Begin typing your search above and press return to search.

సీతైనా.. సుమతైనా.. ఆమే ఎందుకు..?

గ్లామర్ షోతో మెప్పించే హీరోయిన్స్ కి ఒక టైం దాటాక ఛాన్స్ లు వస్తాయన్న గ్యారెంటీ లేదు కానీ తమ అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకునే కథానాయికలకు మాత్రం ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది.

By:  Ramesh Boddu   |   5 Feb 2026 2:00 PM IST
సీతైనా.. సుమతైనా.. ఆమే ఎందుకు..?
X

గ్లామర్ షోతో మెప్పించే హీరోయిన్స్ కి ఒక టైం దాటాక ఛాన్స్ లు వస్తాయన్న గ్యారెంటీ లేదు కానీ తమ అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకునే కథానాయికలకు మాత్రం ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. కొంతమంది హీరోయిన్స్ ముందు గ్లామర్ విషయంలో మొహమాట పడినా అవకాశాలు లేని టైం లో స్కిన్ షో చేయక తప్పదని భావిస్తారు కానీ మరికొంతమంది భామలైతే అవకాశాలు లేకపోయినా పర్లేదు కానీ గ్లామర్ షో చేసేది లేదని ఫిక్స్ అవుతారు. అలాంటి వారు తమ ప్రతిభతో ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తారు. అలాంటి హీరోయిన్స్ లిస్ట్ లో సాయి పల్లవి ఉంటుంది.

హిందీలో రామాయణ్ తో..

మళయాళ ప్రేమమ్ సినిమాతో పాపులారిటీ తెచ్చుకున్న సాయి పల్లవి ఫిదాతో తెలుగు తెరకు పరిచయమైంది. అప్పటి నుంచి తెలుగులో సాయి పల్లవి సినిమా అంటే చాలు ఆడియన్స్ సూపర్ ఎగ్జైట్ అవుతారు. కొత్త పాత్రలతో సాయి పల్లవి సినిమా సినిమాకు తన మీద అంచనాలు పెరిగేలా చేసుకుంది. కథల ఎంపికలో ఆమె తీసుకునే నిర్ణయాలే ఆమెకు ఈ పాపులారిటీని తీసుకొచ్చాయి.

సినిమాలు ఎన్ని చేశామన్నది కాదు ఎంతమంది ప్రేక్షకులకు దగ్గరయ్యామన్న ఆలోచనతో సాయి పల్లవి ప్రాజెక్ట్ ల కమిట్మెంట్ ఉంటుంది. సౌత్ లో ఆమె క్రేజ్ ని చూసిన బాలీవుడ్ మేకర్స్ అక్కడ ఆమెకు వరుస అవకాశాలు ఇస్తున్నారు. తెలుగులో తండేల్ తర్వాత సాయి పల్లవి నెక్స్ట్ సినిమాకు సైన్ చేయలేదు. హిందీలో రామాయణ తో పాటు ఏక్ దిన్ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది ఈ అమ్మడు.

సీతమ్మ పాత్రలో సాయి పల్లవి పెర్ఫార్మెన్స్ కోసం..

ఇక లేటెస్ట్ గా మన రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఏడి సీక్వెల్ లో కూడా సాయి పల్లవి సెలెక్ట్ అయ్యిందని తెలుస్తుంది. కల్కి పార్ట్ 1లో దీపిక పదుకొనె చేసిన సుమతి రోల్ కి ఆమె ప్లేస్ లో సాయి పల్లవిని రీప్లేస్ చేస్తున్నారు. ఓ పక్క సీతమ్మ పాత్రలో సాయి పల్లవి పెర్ఫార్మెన్స్ కోసం ఆమె ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ఆ క్రేజీ ప్రాజెక్ట్ తో పాటు కల్కి 2 లో సాయి పల్లవి ఎంట్రీ మరింత ఎగ్జైటింగ్ గా ఉంది.

సినిమాల విషయంలో తనకు వచ్చే ఛాలెంజింగ్ రోల్స్ ని యాక్సెప్ట్ చేస్తూ ప్రేక్షకులు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ మరింత క్రేజ్ సంపాదిస్తుంది సాయి పల్లవి. నెక్స్ట్ రాబోతున్న భారీ సినిమాలతో సాయి పల్లవి పేరు పాన్ ఇండియా లెవెల్ లో మారుమోగిపోతుందని చెప్పడంలో సందేహం లేదు. టాలీవుడ్ లో స్టార్ క్రేజ్ తో ఫాం కొనసాగిస్తున్న సాయి పల్లవి ప్రస్తుతం కమిటైన సినిమాలు చేసిన తర్వాత ఆమె రేంజ్ మరింత పెరిగే అవకాశం ఉంది. రామాయణం, కల్కి 2 సినిమాలు సాయి పల్లవి కెరీర్ లో స్పెషల్ ప్రాజెక్ట్స్ గా మిగిలిపోతాయని చెప్పొచ్చు. దీపిక ప్లేస్ లో సాయి పల్లవి ఆమెను మర్చిపోయేలా చేయగలిగితే మాత్రం అమ్మడు నెక్స్ట్ లెవెల్ రేంజ్ సంపాదించే అవకాశం ఉంది.