సాయి పల్లవి దగ్గర నాగవంశీ అడ్వాన్స్ డబ్బులు.. వెనక్కి ఇచ్చిన తీసుకోలేదంటూ కామెంట్స్..!
‘ఓం: చాప్టర్ 1’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సాయి పల్లవి, నిర్మాత నాగవంశీ మధ్య సరదా సంభాషణ జరిగింది. కోవిడ్‌కు ముందే కలిసి సినిమాలు చేయాలని అనుకున్నామని, ఓ ప్రాజెక్ట్ కోసం నాగవంశీ ఇచ్చిన అడ్వాన్స్ ఇంకా తన దగ్గరే ఉందని సాయి పల్లవి వెల్లడించారు. ఆమెను ‘లేడీ పవర్ స్టార్’గా అభివర్ణించిన నాగవంశీ, తన కోసం ఓ తెలుగు సినిమా చేయాలని కోరారు.
By: Priya Chowdhary Nuthalapti | 17 Nov 2026 12:42 AM ISTసినిమా ఇండస్ట్రీలో కొంతమంది మధ్య ఉండే స్నేహం, అనుబంధం అప్పుడప్పుడు ఊహించని సందర్భాల్లో బయటపడుతుంటాయి. తాజాగా సాయి పల్లవి, నిర్మాత నాగవంశీ మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణ కూడా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ధనుష్ నటించిన ఓం: చాప్టర్ 1..ప్రీ రిలీజ్ ఈవెంట్లో వీరిద్దరూ మాట్లాడుకున్న తీరు చూసిన చాలామంది.. అసలు వీరిద్దరి మధ్య ఇంత మంచి స్నేహం ఉందా..అంటూ ఆశ్చర్యపోతున్నారు.
ఈరోజు హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సాయి పల్లవి, శ్రీలీలతో పాటు చిత్రబృందం హాజరైంది. ఈ సందర్భంగా వేదికపై మాట్లాడిన సాయి పల్లవి నిర్మాత నాగవంశీ గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. కోవిడ్‌కు ముందే వీరిద్దరూ కలిసి రెండు మూడు సినిమాలు చేయాలని అనుకున్నట్లు వెల్లడించారు.
"వంశీ గారు.. కోవిడ్‌కు ముందే మనం రెండు మూడు ప్రాజెక్టులు కలిసి చేయాలని అనుకున్నాం. మీకు గుర్తుందో లేదో తెలియదు కానీ, ఒక సినిమా కోసం మీరు నాకు అడ్వాన్స్ ఇచ్చారు. ఆ విషయం మీరు మర్చిపోయినట్లున్నారు. ఆ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తాను.. మనం సినిమా చేసినప్పుడు చూసుకుందాం అని చెప్పాను. కానీ మీరు అసలు తీసుకోలేదు. ఇప్పటికీ ఆ డబ్బులు నా దగ్గరే ఉన్నాయి. మీకు గుర్తుందా?" అంటూ సాయి పల్లవి నవ్వుతూ చెప్పింది.
అంతేకాదు, నాగవంశీ తనను తన సినిమాలో భాగం చేయాలని మాత్రమే కోరుకున్నారని, ఆయన ఎంతో మంచివారని.. అని సాయి పల్లవి ప్రశంసించారు. ఆమె మాటలకు నాగవంశీ కూడా సరదాగా స్పందించారు.
తన ప్రసంగంలో సాయి పల్లవిని 'లేడీ పవర్ స్టార్' అంటూ నాగవంశీ అభినందించారు. అంతేకాదు, సాయి పల్లవి దగ్గరే ఉన్న ఆ అడ్వాన్స్ గురించి ప్రస్తావిస్తూ, ఆమె తన కోసం తప్పకుండా ఒక తెలుగు సినిమా చేయాలని సరదాగా అన్నారు. దీంతో ఈవెంట్లో నవ్వులు పూశాయి.
ఇక స్పీచ్ వినపతి నుంచి.. నాగవంశీ నిర్మాణంలో సాయి పల్లవి తెలుగు సినిమా చేస్తే చూడాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.
ఇక 'ఓం: చాప్టర్ 1' సినిమాలో సాయి పల్లవి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ధనుష్, మమ్ముట్టి, శ్రీలీల కీలక పాత్రలు పోషించారు. నవంబర్ 20, 2026న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
