Begin typing your search above and press return to search.

ప్రేమమ్.. రామాయణం.. ఎంత తేడా?

దక్షిణాది సినిమాల్లో చాలా తక్కువ సమయంలో గొప్ప పెర్ఫామర్‌గా పేరు సంపాదించి కల్ట్ ఫాలోయింగ్ తెచ్చుకున్న కథానాయిక.. సాయిపల్లవి. తొలి సినిమా ‘ప్రేమమ్’తోనే ఆమె ఎలాంటి ముద్ర వేసిందో తెలిసిందే.

By:  Garuda Media   |   1 Aug 2026 5:00 AM IST
ప్రేమమ్.. రామాయణం.. ఎంత తేడా?
X

దక్షిణాది సినిమాల్లో చాలా తక్కువ సమయంలో గొప్ప పెర్ఫామర్‌గా పేరు సంపాదించి కల్ట్ ఫాలోయింగ్ తెచ్చుకున్న కథానాయిక.. సాయిపల్లవి. తొలి సినిమా ‘ప్రేమమ్’తోనే ఆమె ఎలాంటి ముద్ర వేసిందో తెలిసిందే. అందులో నటించిన అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్ తనకంటే అందంగా ఉంటారు. కానీ ఆ సినిమాలో వాళ్లను మించి హైలైట్ అయింది, అందరి దృష్టినీ తన వైపు తిప్పుకుంది సాయిపల్లవినే. ఆమె ఆ సినిమాతో ఏ స్థాయిలో ఫాలోయింగ్ సంపాదించిందంటే.. తెలుగులో తన పాత్రను శ్రుతి హాసన్‌కు ఎంపికైనపుడు తీవ్ర వ్యతిరేకత వచ్చింది.

అప్పటికే పెద్ద స్టార్ అయిన శ్రుతిని ఈ పాత్ర కోసం తీసుకుంటే.. ఒరిజినల్ చూసిన వాళ్లకు అది రుచించలేదు. తెలుగులో కూడా సాయిపల్లవినే ఆ పాత్ర చేయాలని డిమాండ్ చేశారు. ఐతే రీమేక్‌లో నటించడం ఇష్టం లేక ఆ సినిమా చేయని సాయిపల్లవి.. ఆ తర్వాత నేరుగా ‘ఫిదా’ సినిమా చేసి ఎంత మంచి గుర్తింపు సంపాదించిందో.. తెలుగుతో పాటు తమిళంలోనూ ఎలా ఎదిగిందో తెలిసిందే.

తాను చేసే ఏ పాత్రకైనా ఒక ప్రత్యేకతను తీసుకొస్తుందని.. ఆ పాత్ర బలం పెంచుతుందని సాయిపల్లవికి ఒక పేరుంది. అలాంటిది కెరీర్లో తొలిసారిగా ఒక పాత్రకు ఆమె సూట్ కాలేదంటూ విమర్శలు రావడం ఆశ్చర్యం కలిగించే విషయం. ‘రామాయణ’లో సీత పాత్ర విషయంలో ఇలాంటి వ్యతిరేకతనే ఎదుర్కొంటోంది సాయిపల్లవి. ఈ పాత్రకు సాయిపల్లవిని ఎంపిక చేసినపుడు అందరూ సైలెంటుగానే ఉన్నారు కానీ.. తర్వాత నెమ్మదిగా అభిప్రాయం మారుతూ వస్తోంది. ఇప్పుడు ట్రైలర్ లాంచ్ అయ్యాక విపరీతమైన వ్యతిరేకతను ఎదుర్కొంటోంది సాయిపల్లవి. నార్త్ ఇండియన్ ఆడియన్స్ అయితే సీతగా సాయిపల్లవిని అస్సలు అంగీకరించడం లేదు. సౌత్ వాళ్లలో కూడా భిన్నాభిప్రాయాలు కనిపిస్తున్నాయి. సాయిపల్లవి గొప్ప నటి అయినా.. సీత పాత్రకు అవసరమైన డివైనిటీ తనలో కనిపించడం లేదని.. ట్రైలర్లో తన హావభావాలు, డైలాగ్ డెలివరీ కూడా బాగా లేవని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఐతే గతంలో ఒక ఇంటర్వ్యూలో భాగంగా మనకు మన సైన్యం గొప్ప అన్నట్లే, పాకిస్థాన్ వాళ్లకు వాళ్ల సైన్యం గొప్ప కదా అంటూ సాయిపల్లవి చేసిన ఒక కామెంట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అప్పుడు ఆమె మీద యాంటీ నేషనల్ ముద్ర వేసి అప్పటి నుంచి ఒక వర్గం ఆమెను టార్గెట్ చేస్తోందని, ఇప్పుడు కూడా ఆ వర్గమే ఆమె మీద నెగెటివిటీని స్ప్రెడ్ చేస్తోందని.. సినిమా రిలీజయ్యాక తన మీద నెలకొన్న సందేహాలన్నింటికీ సాయిపల్లవి సమాధానం చెబుతుందని ఆమె మద్దతుదారులు అభిప్రాయపడుతున్నారు.