వెండి తెర సీతమ్మతో బాలీవుడ్ లెజెండ్!
హీరోయిన్లు అందరిలో సాయి పల్లవి ఎంతో ప్రత్యేకం. పాత్రల విషయంలో సెలక్టివ్ గా ఉండటం..
By: Srikanth Kontham | 23 Nov 2025 3:53 PM ISTహీరోయిన్లు అందరిలో సాయి పల్లవి ఎంతో ప్రత్యేకం. పాత్రల విషయంలో సెలక్టివ్ గా ఉండటం..గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండటం వంటివి అమ్మడిని మిగతా భామల నుంచి వేరు చేస్తుందన్నది కాదనలేని నిజం. అంతేకాదు అదనపు ఆదాయం కోసం యాడ్స్ చేయదు. సినిమా అవకాశాల కోసం పోటీ పడదు. తన దగ్గరకు వచ్చిన అవకాశాలే సద్వినియోగం చేసుకుంటుంది కానీ తన కోసం పాత్రలు రాయండని ఎవరినీ రిక్వెస్ట్ లు చేయదు. తాను నమ్మిన సిద్దాంతంపై ఒంటికాలుపై నిలబడుతుంది. అందరూ ఒకవైపు ఉంటే? తానొక్కరే మరోవైపు ఉంటుంది.
ఇలాంటి లక్షణాలన్నీ ఉన్న నటి కాబట్టే? బాలీవుడ్ లో సీతమ్మ పాత్ర అమ్మడిని వెతుక్కుంటూ వచ్చింది. అక్కడ ఎంతో మంది సీనియర్ భామలున్నా? మరెంతో మంది యువ నాయికలు ...తనకన్నా ఫేమస్ అయిన అందాలు ఎన్నో ఉన్నా? రామాయణంలో సీత పాత్ర తాను పోషిస్తేనే అది పరిపూర్ణమయవుతుందని నమ్మి నితీష్ తివారీ పిలిచి మరీ ఎంపిక చేసారు. ఇక సాయిపల్లవి గురించి పబ్లిక్ వేదికలపై ఎవరైనా గొప్పగానే మాట్లాడతారు. తన ఔన్నత్యాన్ని ఎంతో గొప్పగా చెబుతుంటారు.
మెగాస్టార్ చిరంజీవి నుంచి బాలీవుడ్ లెజెండ్ అనుపమ్ ఖేర్ వరకూ. 56వ అంతర్జాతీయ సినిమా ఉత్సవం ఐఎప్ ఎఫ్ ఐ గోవాలో జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఆ ఈవెంట్ లో ఎంతో మంది సెలబ్రిటీలు పాల్గొన్నారు. మరెంతో మంది హీరోయిన్లు హాజరయ్యారు. సినిమాలు..వాటి పోస్టర్లు..ప్రమోషన్లు ఇలా ప్రతీది నెట్టింట వైరల్ అవుతోంది. కానీ ఓ తాజా పిక్ మాత్రం సంథింగ్ స్పెషల్ అని చెప్పాలి. సాయిపల్లవితో అనుపమ్ ఖేర్ దిగిన ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. అక్కడ ఎంతో మంది సెలబ్రిటీలున్నా? అనుపమ్ ఖేర్ మాత్రం పల్లవితోనే సెల్పీ దిగడం ఓ గొప్ప విషయం.
అంతేకాదు ఆమెను కలవడం పట్ల సంతోషం వ్యక్తం చేయడం మరో విశేషం.అందమైన సాయి పల్లవిని కలవడం చాలా సంతోషంగా ఉంది. చిన్న సమావేశంలో? చక్కని నటితో మంచి క్షణాలన్నారు. అలాగే సాయి పల్లవి ప్రతిభను ప్రోత్సహించారు. ఆమె భవిష్యత్ ను దృష్టలో పెట్టుకుని శుభాకాంక్షలు తెలియజేసారు. సాధారణంగా హీరోయిన్ల విషయంలో ఇలాంటి సందర్భాలు పెద్దగా చోటు చేసుకోవు. వారు ఎంత గొప్ప వారు అయినా? నటీమణుల ప్రశంసిస్తూ మట్లాడటం జరగదు. సెల్పీలు దిగడం అన్నది అంతకన్నా సాధ్యం కాదు.
