ఎర్రచందనం స్మగ్లింగ్.. లేడీ సింగంలా సాయి పల్లవి పవర్ఫుల్ రోల్
ఈ యాక్షన్ డ్రామాలో నిత్యారెడ్డి క్యారెక్టర్ కు ఒక బలమైన ఎమోషనల్ కనెక్షన్ కూడా ఉంది.
By: M Prashanth | 26 Oct 2026 9:53 PM ISTసాయి పల్లవి అనగానే న్యాచురల్ యాక్టింగ్ గుర్తొస్తుంది. కానీ దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి ఆమెలోని సరికొత్త యాంగిల్ ను బయటకు తీశాడు. ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఓం: చాప్టర్ 1 ఉధిరం ది బ్లడ్ వుడ్ చిత్రంలో ఆమె పవర్ ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ గా ఎంట్రీ ఇస్తోంది. లేటెస్ట్ గా విడుదలైన సాయి పల్లవి క్యారెక్టర్ ఇంట్రడక్షన్ గ్లింప్స్ నెట్టింట మంచి బజ్ క్రియేట్ చేస్తోంది.
నిత్యారెడ్డి క్యారెక్టర్ ను మేకర్స్ చాలా స్ట్రాంగ్ గా డిజైన్ చేశారు. ఏపీ క్యాడర్ కు చెందిన ఈ యువ ఆఫీసర్ మొదట అసిస్టెంట్ ఎస్పీగా పనిచేసి ఆ తర్వాత సీబీఐ అడిషనల్ ఎస్పీగా ప్రమోట్ అవుతుంది. ఇంటర్ పోల్ తో కలిసి పనిచేసేంత ట్రాక్ రికార్డ్ ఉన్న సిన్సియర్ పోలీస్ గా సాయి పల్లవి ఇంటెన్స్ లుక్ ఆకట్టుకుంటోంది. ఏపీలోని ఎర్రచందనం స్మగ్లింగ్ ముఠాల ఆటకట్టించే ఇంటెలిజెంట్ ఆఫీసర్ గా ఆమె పాత్ర సాగనుంది.
ఈ యాక్షన్ డ్రామాలో నిత్యారెడ్డి క్యారెక్టర్ కు ఒక బలమైన ఎమోషనల్ కనెక్షన్ కూడా ఉంది. అడవులను కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూతురే ఈ నిత్యారెడ్డి. ఆ పగతోనే స్మగ్లింగ్ నెట్ వర్క్ ను టార్గెట్ చేస్తూ ఆపరేషన్ ఓం కు ఆమె ఇన్సిడెంట్ కమాండర్ గా వ్యవహరిస్తుంది. లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదల ఆమె బాడీ లాంగ్వేజ్ లో స్పష్టంగా కనిపించింది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ధనుష్ ఫస్ట్ స్ట్రైక్, మమ్ముట్టి బర్మా కార్తికేయన్ వీడియోలు అంచనాలు పెంచేశాయి. వీరికి తోడుగా శ్రీలీల, నసీరుద్దీన్ షా లాంటి భారీ తారాగణం ఈ సినిమాలో భాగమయ్యారు. సాయి పల్లవి లాంటి పర్ఫార్మర్ ఇంత సీరియస్ పోలీస్ రోల్ లోకి దిగడంతో ప్రాజెక్ట్ స్కేల్ అమాంతం పెరిగిపోయింది. రొటీన్ కమర్షియల్ హీరోయిన్ పాత్రలకు భిన్నంగా ఆమె చేసిన మేకోవర్ స్క్రీన్ పై మెజిక్ చేసేలా ఉంది.
ఈ పాన్ ఇండియా చిత్రానికి టెక్నికల్ టీమ్ కూడా సాలిడ్ గా సెట్ అయింది. సాయి అభ్యంకర్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు ఇటీవల వచ్చిన వీళా వీరా పాటకు ట్రెమెండస్ రెస్పాన్స్ దక్కింది. ఎళిల్ అరసు సినిమాటోగ్రఫీ, కళైవానన్ ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. యాక్షన్ ఎపిసోడ్స్ కు ప్రాణం పోసేందుకు యానిక్ బెన్, కేచా ఖంపక్డీ లాంటి ఇంటర్నేషనల్ స్టంట్ మాస్టర్స్ పనిచేస్తున్నారు.
ఆర్ టేక్ స్టూడియోస్ బ్యానర్ పై శ్రద్ధా అగర్వాల్, ధనుష్ వండర్‌బార్ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కంటెంట్ తో పాటు కాస్టింగ్ పరంగా ఎక్కడా రాజీ పడకుండా తీస్తున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2026 నవంబర్ 20న థియేటర్లలోకి రాబోతోంది. విభిన్నమైన యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఓం బాక్సాఫీస్ దగ్గర ఏ స్థాయి ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి.
