సాయి పల్లవి బాలీవుడ్ మూవీ టైటిల్ ఫిక్స్
సౌత్ ఇండియన్ సినిమాలో టాలెంటెడ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సాయి పల్లవి చేతిలో ప్రస్తుతం రెండు బాలీవుడ్ సినిమాలున్నాయి.
By: Sravani Lakshmi Srungarapu | 13 Sept 2025 7:00 PM ISTసౌత్ ఇండియన్ సినిమాలో టాలెంటెడ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సాయి పల్లవి చేతిలో ప్రస్తుతం రెండు బాలీవుడ్ సినిమాలున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ముందుగా ఏక్ దిన్ అనే టైటిల్ ను అనుకున్నారని వార్తలు వచ్చాయి.
సాయి పల్లవి బాలీవుడ్ సినిమా టైటిల్ రివీల్
అయితే సాయి పల్లవి, జునైద్ ఖాన్ జంటగా తెరకెక్కిన సినిమాకు ఏక్ దిన్ అనే టైటిల్ కేవలం ప్రచారం మాత్రమే, అందులో ఏ మాత్రం నిజం లేదని తాజాగా వచ్చిన అప్డేట్ కన్ఫర్మ్ చేసింది. ఈ సినిమాకు మేరే రహో అనే కొత్త టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు అనౌన్స్ చేస్తూ మేకర్స్ ఓ కొత్త అప్డేట్ ను ఇచ్చారు. మేరే రహో సినిమాకు సునీల్ పాండే దర్శకత్వం వహిస్తున్నారు.
డిసెంబర్ 12న మేరే రహో
రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా నవంబర్ 7న రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకున్నారన్నారు కానీ ఇప్పుడు చిత్ర యూనిట్ మేరే రహోను డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు ప్రకటించారు. ఈ సినిమా నిర్మాణంలో ఆమిర్ ఖాన్ కూడా భాగస్వామ్యం వహించారు.
17 ఏళ్ల తర్వాత ఆమిర్ ఖాన్- మన్సూర్ ఖాన్ కాంబినేషన్ లో మూవీ
ఒకరితో ఒకరికి పరిచయం లేని ఓ అబ్బాయి, అమ్మాయి ఓ రోజు విచిత్రకర సిట్యుయేషన్స్ లో కలుసుకోగా, ఆ పరిచయం వారి జీవితాలను ఎలా మార్చేసిందనే యాంగిల్ ఈ సినిమా ఉండనుందని బాలీవుడ్ వర్గాల నుంచి టాక్ వినిపిస్తుంది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత మన్సూర్ ఖాన్ తో కలిసి ఆమిర్ ఖాన్ ఈ మూవీని నిర్మిస్తుండగా, వీరిద్దరి కాంబినేషన్ కు బాలీవుడ్ లో మంచి పేరుంది. 2008లో వీరిద్దరి కలయికలో వచ్చిన జానే తూ.. యా జానే నా సినిమా భారీ సక్సెస్ అవగా ఇప్పుడు 17 ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి మేరే రహోని నిర్మిస్తుండటంతో దీనిపై అంచనాలు భారీగా పెరిగాయి.
