సాయి పల్లవి ఇమేజ్ మారాల్సిన సమయం వచ్చిందా?
సున్నితమైన పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి ఇప్పుడు యాక్షన్ రోల్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ధనుష్ హీరోగా నటిస్తున్న 'ఓం – చాప్టర్ 1: ఉధిరం'లో ఐపీఎస్ నిత్యారెడ్డి పాత్ర పోషిస్తున్నారు. పవర్ఫుల్ పోలీస్ అధికారిణిగా ఆమె నటన ఎలా ఉంటుందో, ఈ సినిమా ఆమెకు కొత్త గుర్తింపు తెస్తుందో చూడాలి.
By: Priya Chowdhary Nuthalapti | 16 Nov 2026 10:00 AM ISTసహజమైన అందం, అభినయం, అద్భుతమైన డ్యాన్స్‌తో సౌత్ ఇండియాలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సాయి పల్లవి. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ.. తన నటనతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ నటి కెరీర్లో ఎన్నో విజయవంతమైన సినిమాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు సాయి పల్లవి ముందు ఒక కొత్త ఛాలెంజ్.. కనిపిస్తోంది. ఇప్పటివరకు ఆమె సంపాదించుకున్న ఇమేజ్ను దాటి.. డిఫరెంట్ పాత్రలతో తనను తాను నిరూపించుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు కనిపిస్తుంది తోంది.
సాధారణంగా హీరోలు తమ కెరీర్లో వివిధ రకాల రోల్స్ చెయ్యగలిగితేనే.. స్టార్స్ గా ఎదుగుతారు. హీరోయిన్లు కూడా అన్ని రకాల పాత్రలు చేయగలరని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో సాయి పల్లవికి మంచి నటిగా గుర్తింపు ఉన్నప్పటికీ, ఆమె ఎక్కువగా పక్కింటి అమ్మాయి తరహా పాత్రల్లోనే కనిపిస్తూ వచ్చారు. ఫిదా, లవ్ స్టోరీ, గార్గి, ప్రేమమ్ వంటి సినిమాల్లో ఆమె నటనకు మంచి ప్రశంసలు లభించాయి. ముఖ్యంగా డ్యాన్స్‌లో ఆమెకు మంచి క్రేజ్ ఉంది. అయితే యాక్షన్, పోలీస్ ఆఫీసర్, పవర్ఫుల్ పాత్రల్లో ఆమెను చూడాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.
మరోవైపు సీత పాత్రలో కనిపించిన రామాయణం సినిమా విషయంలో కూడా సాయి పల్లవిపై విమర్శలు వచ్చాయి. గతంలో అనుష్క అరుంధతి, భాగమతి వంటి సినిమాలు, కీర్తి సురేష్ కూడా మహానటి వంటి బయోపిక్ చేసిన తర్వాతే వాళ్ళు వేరే లెవెల్ హీరోయిన్ స్టేటస్ అందుకున్నారు. ఇలాంటి సినిమాలే వారిని విభిన్న పాత్రలు చేయగల హీరోయిన్లుగా నిలబెట్టాయి. ఇప్పుడు సాయి పల్లవి కూడా అలాంటి పేరు తెచ్చుకునే అవసరం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న ఓం – చాప్టర్ 1: ఉధిరం సినిమాపై ఆసక్తి పెరుగుతోంది. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో సాయి పల్లవి ఐపీఎస్ నిత్యారెడ్డి పాత్రలో కనిపించనున్నారు. సీబీఐలో అదనపు ఎస్పీగా పనిచేసే పవర్ఫుల్ పోలీస్ అధికారిణి పాత్రలో ఆమె కనిపించనుండటం విశేషం.
ఇప్పటివరకు ఎక్కువగా సున్నితమైన పాత్రల్లో మెప్పించిన సాయి పల్లవి ఈసారి యాక్షన్.. పోలీస్ పాత్రలో ఎలా నటిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ పాత్రలోనూ ప్రేక్షకులను మెప్పిస్తే ఆమె కెరీర్‌కు మరో కొత్త గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఉంది. మరి సాయి పల్లవి కూడా అనుష్క, కీర్తి సురేష్ లాగా అంతటి పేరు తెచ్చుకుంటుందేమో చూడాలి.
