సాయి పల్లవి కెరీర్ లో తొలి 1000 కోట్లు!
‘రామాయణం: పార్ట్ 1’ ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్ల వసూళ్లు సాధించడంతో సాయి పల్లవి కెరీర్‌లో తొలి వెయ్యి కోట్ల సినిమాగా నిలిచింది. సీతాదేవి పాత్రలో సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమెకు జాతీయ స్థాయిలో గుర్తింపు పెరిగింది. గ్లామర్ కంటే నటనకు ప్రాధాన్యత ఇచ్చే సాయి పల్లవిపై ప్రశంసలు కురుస్తున్నాయి.
By: Srikanth Kontham | 17 Nov 2026 6:16 PM ISTదక్షిణాది సినిమాల్లో సహజ సిద్ధమైన నటనతో ఎలాంటి గ్లామర్ షో లేకుండానే కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న నేచురల్ బ్యూటీ సాయి పల్లవి కెరీర్‌లో అరుదైన మైలురాయిని చేరుకున్నారు. నితీష్ తివారీ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన `రామాయణం: పార్ట్ 1` బాక్సాఫీస్ వద్ద రికార్డుల సృష్టిస్తుంది. ఇప్పటికేఉ ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ ఘనతతో సాయి పల్లవి ఖాతాలో తొలి వెయ్యి కోట్ల రూపాయల సినిమాగా నమోదైంది. ఇప్పటి వరకు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్లు అందుకున్నా? సాయి పల్లవి కెరీర్‌లో ఇంతటి భారీ పాన్-ఇండియా స్థాయి బాక్సాఫీస్ విజయం ఇదే మొదటిసారి.
ఈ మైథలాజికల్ చిత్రంలో సాయి పల్లవి సీతాదేవి పాత్రలో జీవించారు. సీతమ్మ తల్లిగా హుందాతనం, భావోద్వేగభరితమైన నటన ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తోంది. అద్భుతమైన విజయంతో సాయి పల్లవి రేంజ్ ఒక్కసారిగా జాతీయ స్థాయికి చేరింది. దక్షిణాదిలో లేడీ పవర్ స్టార్‌గా పేరుగాంచిన సాయి పల్లవి తొలి బాలీవుడ్ ఎంట్రీతోనే ఇలాంటి ఆల్-టైమ్ బ్లాక్‌బస్టర్ అందుకోవడం విశేషం. ముఖ్యంగా `పుష్ప 2`, `ధురంధర్ 2` తర్వాత అత్యంత వేగంగా వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరిన భారతీయ చిత్రంగా `రామాయణం` నిలవడంతో కీలక పాత్ర పోషించిన సాయి పల్లవిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
పాత్రలో ఆహార్యం పరంగా కొన్ని విమర్శలు వ్యక్తమైనా? అవేవి సాయి పల్లవి ఇమేజ్ ముందు నిలబడలేదు. మరోసారి సహజ నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తంది. ఎలాంటి పాత్ర అయినా? పల్లవి ముందు ఎంత అనిపించింది. దీంతో నటిగా సాయి పల్లవి బాధ్యత మరింత పెరిగింది. ఇకపై అమ్మడు ఎంచుకునే పాత్రలు మరింత హుందాగా ఉండాలి. సాధారణంగా గ్లామర్ పాత్రలకు అమ్మడు దూరంగా ఉంటుంది. నటనకు ఆస్కారం పాత్రలు.. వైవిథ్యమైన కథలు అయితేనే కమిట్ అవుతుంది. ఆ విషయంలో ఎంత మాత్రం రాజీ పడదు.
దర్శక, నిర్మాతలు ఎన్ని కోట్లు ఆఫర్ చేసినా? ప్రాధాన్యతలేని పాత్రల జోలికి అమ్మడు వెళ్లదన్నది అంతే నిజం. ప్రస్తుతం సాయి పల్లవి ఖాతాలో వరుస సినిమాలున్నాయి. అవి పాన్ ఇండియా రిలీజ్ లే. హిట్ టాక్ తెచ్చుకుంటే పల్లవి రేంజ్ తారా స్థాయికి చేరుతుందనడంలో సందేహం లేదు.
