సాయి పల్లవి బికినీ ఫోటోలపై ట్రోల్స్.. అసలు నిజం ఏంటంటే?
సాయి పల్లవి.. ఎప్పుడూ కూడా సెలెక్టివ్ గా పాత్రలు ఎంచుకుంటూ.. హద్దులు దాటకుండా తన పరిధిలోనే సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.
By: Madhu Reddy | 23 Sept 2025 10:12 AM ISTసాయి పల్లవి.. ఎప్పుడూ కూడా సెలెక్టివ్ గా పాత్రలు ఎంచుకుంటూ.. హద్దులు దాటకుండా తన పరిధిలోనే సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. తన నటనతోనే కాదు డాన్స్ పెర్ఫార్మెన్స్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్న ఈ చిన్నది.." లేడీ పవర్ స్టార్" అనే ట్యాగ్ ను కూడా సొంతం చేసుకుంది. సాంప్రదాయానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన సాయి పల్లవి.. నిన్నటి నుంచి భారీ ట్రోల్స్ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దీనికి కారణం ఆమె బికినీ ఫోటోలు. అసలు విషయంలోకి వెళ్తే .. వెకేషన్స్ లో భాగంగా తన చెల్లెలు పూజా కన్నన్ ఇంటికి వెళ్ళింది సాయి పల్లవి. అక్కడి నుంచే తన చెల్లి పూజా తో కలిసి బీచ్ కి వెళ్లి ఎంజాయ్ చేశారు.
అందుకు సంబంధించిన ఫోటోలను పూజా కన్నన్ తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేయగా.. ఇవి క్షణాల్లో వైరల్ అయ్యాయి.దీనికి తోడు ఆమె బికినీ వేసుకున్నట్లు, స్విమ్ సూట్ వేసుకున్నట్లు కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పెద్ద ఎత్తున సాయి పల్లవి పై ట్రోల్స్ జరిగాయి. పద్ధతిగా ఉన్న సాయి పల్లవి కూడా బాలీవుడ్ కి వెళ్ళిపోయిన తర్వాత ఇలా మారిపోయింది ఏంటి? అంటూ అభిమానులు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇన్ని రోజులు సాయి పల్లవి అంటే ఒక మార్క్ అనుకున్నాము. ఈమె కూడా ఇలా స్కిన్ షో చేస్తోంది అంటూ విమర్శలు గుప్పించారు.
అయితే ఇప్పుడు అసలు విషయం తెలిసి ట్రోలర్స్ కి గట్టి కౌంటర్ ఇస్తున్నారు సాయి పల్లవి అభిమానులు. అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా పూజా కన్నన్ తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసిన ఫోటోలు ఇవి కావు. ఎవరో కావాలనే వీటిని మార్ఫింగ్ చేసి మరీ సోషల్ మీడియాలో వదిలారు. పూజ కన్నన్ షేర్ చేసిన ఫోటోలలో సాయి పల్లవి స్లీవ్ లెస్ డ్రెస్ వేసుకుందే కానీ బికినీ ధరించలేదు. అటు స్విమ్ షూట్ లో కూడా ఆమె కనిపించలేదు. అయితే కావాలనే ఇలా ఫేక్ ఫోటోలు సృష్టించడంతో.. ఇవి తెలియని చాలామంది సాయి పల్లవి పై విమర్శలు గుప్పించారు. ఇప్పుడు అసలు నిజం తెలియడంతో ముక్కున వేలేసుకుంటున్నారు. ముఖ్యంగా సాయి పల్లవి అభిమానులైతే ట్రోలర్స్ పై మండిపడుతూ ఇలాంటి ఫేక్ ఫోటోలు క్రియేట్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కూడా కోరుతూ ఉండడం గమనార్హం. మరి ఈ ఫోటోలు సాయి పల్లవి వరకు వెళ్తే ఆమె ఎలాంటి రిప్లై ఇస్తుందో చూడాలి.
సాయి పల్లవి సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం బాలీవుడ్లో అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరోగా నటిస్తున్న 'ఏక్ దిన్' అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా నవంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరొకవైపు రణబీర్ కపూర్ తో కలిసి 'రామాయణం' అనే సినిమాలో సీత పాత్ర పోషిస్తోంది సాయి పల్లవి.
