Begin typing your search above and press return to search.

రామాయణలో సాయి పల్లవి నటించలేదు!

‘రామాయణ’లో సీత పాత్రపై తన తాతయ్య చేసిన వ్యాఖ్యల వెనుక భావాన్ని సాయి పల్లవి వివరించారు. తాను నటించలేదని, దేవుడే ఆ పాత్ర ద్వారా నటించాడని ఆయన అన్న మాటలు భక్తి, ఆశ్చర్యంతో వచ్చినవని తెలిపారు. ఆ మాటలను అతిశయోక్తిగా కాకుండా ఆశీర్వాదంగా భావిస్తున్నానని చెప్పారు. ప్రస్తుతం ‘ఓం’, ‘ఇంజు వేలం’ చిత్రాలతో పాటు ‘రామాయణ పార్ట్ 2’ షూటింగ్‌లోనూ పాల్గొంటున్నారు.

By:  Srikanth Kontham   |   20 Nov 2026 2:28 AM IST
రామాయణలో సాయి పల్లవి నటించలేదు!
X

ఇటీవ‌లే రిలీజ్ అయిన `రామాయ‌ణ` మొద‌టి భాగం మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే.ఇప్పటికే సినిమా 1400 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించింది. అయితే ఈ సినిమా బ‌డ్జెట్ విష‌యంలో క్లారిటీ లోపించ‌డంతో పెట్టుబ‌డి..వ‌సూళ్ల‌కు మ్యాచ్ అవుతుందా? లేదా? అన్న సందిగ్దం ఉంది. అవ‌న్నీ ప‌క్క‌న బెడితే? సినిమాలో పాత్ర‌లు మాత్రం ఆద్యంతం ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అయ్యాయి. ఈ నేప‌థ్యంలో సీత పాత్ర పోషించిన సాయి ప‌ల్ల‌వి పాత్ర‌ను ఉద్దేశించి ఆమె తాత‌య్య ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు.

సినిమాలో సాయి పల్లవి నటించలేదని.. ఆ పాత్ర ద్వారా దేవుడే నటింప జేశాడన్నారు. దీంతో తాత‌య్య మాటల వెనుక అసలు ఉద్దేశం ఏంటో? సాయి పల్లవి తాజాగా క్లారిటీ ఇచ్చారు. సీత వంటి పవిత్రమైన భావోద్వేగంతో కూడిన పాత్రను తెరపై ఆవిష్కరించినప్పుడు అది నటి కృషి మాత్రమే కాదనే కోణంలోనే తాతయ్య ఆ మాట అన్నారని సాయి పల్లవి వివరించారు. ఆ పాత్రలోని గాంభీర్యం, సహజత్వం చూసిన తర్వాత ఆయన మనసులో కలిగిన భక్తి, ఆశ్చర్యం మాటల రూపంలో బయటపడ్డాయన్నారు.

నటన అనేది నేర్చుకున్న టెక్నిక్‌తో వచ్చేది కాదు. ఆ పాత్రతో మమేకమైనప్పుడు ఏదో దైవశక్తి నడిపిస్తున్నట్లు అనిపిస్తుందనే భావన అందులో ఉందన్నారు. నిజానికి సాయి పల్లవి ఎంచుకునే పాత్రలు రెగ్యుల‌ర్ పాత్ర‌ల‌కు భిన్నంగా ఉంటాయి. ఆ పాత్ర‌లో నిబద్ధత.. అమాయకత్వం కనిపిస్తుంటాయి. గ్లామర్ హంగులకు దూరంగా ఉంటూనే పాత్ర ప్రాధాన్యతకు ప్రాణప్రతిష్ఠ చేసే తీరు వల్ల సాయిప‌ల్ల‌వికి ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన స్థానం ఉంది.

`రామాయణ` వంటి భారీ చిత్రంలో సీత పాత్ర పోషించడం అంటే మాటలు కాదు. ఆ పాత్ర బరువును మోస్తూ ప్రేక్షకుల నమ్మకాన్ని గెలవడం సవాలుతో కూడిన‌ విషయమే. తాతయ్య చెప్పిన ఒక్క మాటలో కుటుంబ గర్వం.. ఆశీర్వాదం కలగలిసి ఉన్నాయి. త‌మ కుటుంబానికి చెందిన‌ అమ్మాయి ఇంత పెద్ద ఇతిహాస కావ్యంలో కీలక పాత్ర పోషించి.. ఆ పాత్రకు న్యాయం చేసిందనే తృప్తి తాత‌య్య మాటల్లో కనిపిస్తోందని అభిమానులు కూడా అభిప్రాయపడుతున్నారు. సాయి పల్లవి కూడా ఆ మాటలను అతిశయోక్తిలా కాకుండా తన ప్రయాణంలో ఆశీర్వాదంగానే స్వీకరించారు.

ఇక సాయి ప‌ల్ల‌వి న‌టించిన ఓం చిత్రం మ‌రికొన్ని గంటల్లో ప్రేక్ష‌కుల మందుకొస్తున్న సంగ‌తి తెలిసిందే. ధ‌నుష్..మ‌మ్ముట్టి ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన చిత్రంలో అమ్మ‌డు ఐపీఎస్ పాత్ర‌లో క‌నిపించ‌నుంది. అలాగే `ఇంజు వేలం` అనే మ‌రో త‌మిళ చిత్రంలోనూ న‌టిస్తోంది. `రామాయ‌ణ పార్ట్ 2` షూటింగ్ లో కూడా పాల్గొంటున్న సంగ‌తి తెఎలిసిందే.