Begin typing your search above and press return to search.

డైరెక్ట‌ర్ ఒకే ...హీరో మాత్రం నాట్ ఒకే!

ఈ నేప‌థ్యంలో శింబు 49వ చిత్రం కూడా లాక్ అయింది. స్టార్ డైరెక్ట‌ర్ వెట్రీమార‌న్ ఆ బాధ్య‌త‌లు తీసుకున్నాడు.

By:  Srikanth Kontham   |   13 Sept 2025 11:00 PM IST
డైరెక్ట‌ర్ ఒకే ...హీరో మాత్రం నాట్ ఒకే!
X

కోలీవుడ్ స్టార్ శింబు కెరీర్ మ‌ళ్లీ ప‌ట్టాలెక్కిన సంగ‌తి తెలిసిందే. వరుస వివాదాల నేప‌థ్యంలో ముగిసింది అనుకున కెరీర్ అనూహ్యంగా మ‌ళ్లీ ట్రాక్ లోకి రావ‌డంతో? కొత్త ఛాన్సులు బాగానే అందుకుంటున్నాడు. ఎలాంటి పాత్ర‌లు వ‌చ్చినా? కాద‌న‌కుండా ప‌ని చేస్తున్నాడు. హీరో పాత్ర‌ల‌తో పాటు, స్టార్ హీరోల చిత్రాల్లో కీల‌క పాత్ర‌లు పోషిస్తూ ప్రేక్షకుల్ని అల‌రిస్తున్నాడు. ఈ నేప‌థ్యంలో శింబు 49వ చిత్రం కూడా లాక్ అయింది. స్టార్ డైరెక్ట‌ర్ వెట్రీమార‌న్ ఆ బాధ్య‌త‌లు తీసుకున్నాడు. ఉత్త‌ర చెన్నై నేప‌థ్యంలో సాగే గ్యాంగ్ స్ట‌ర్ స్టోరీ ఇది. ప్ర‌స్తుతం ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి.

ఇందులో హీరోయిన్ గా తొలుత పూజాహెగ్డేని అనుకున్నారు. కానీ ఎందుక‌నో ఆలోచ‌న విర‌మించుకుని తాజాగా సాయి ప‌ల్ల‌విని అప్రోచ్ అయ్యారట‌. ఆమె కూడా క‌థ విని పాజిటివ్ గానే స్పందించించారట‌. హీరో శింబు అని కూడా కానీ స్టోరీ నేరేష‌న్ కు ముందే చెప్పారట‌. కానీ మ‌రుస‌టి రోజు అమ్మ‌డు నో చెప్పిన‌ట్లు ఓ వార్త కోలీవుడ్ లో మీడియాలో వైర‌ల్ అవుతోంది. అందుకు కార‌ణం హీరో శింబు అని ప్ర‌చారం జ‌రుగుతోంది. శింబుతో క‌లిసి ప‌ని చేయ‌డం ఇష్టం లేక నో చెప్పినట్లు వార్త‌లొస్తున్నాయి. వెట్రీమార‌న్ తో సినిమా చేయాల‌ని ప్ర‌తీ నటి కోరుకుంటుంది.

అందులో సాయి ప‌ల్ల‌వి కూడా ఉన్న‌ట్లు గ‌తంలో వెల్ల‌డించింది. ఆయ‌న సినిమాలంటే త‌న‌కెంతో ఇష్ట‌మ‌ని తెలిపింది. కానీ అమ్మ‌డిప్పుడు హీరో కార‌ణంగా ప్రాజెక్ట్ వ‌దులుకుంటున్నట్లు క‌నిపిస్తుంది. మ‌రి ఈ ప్ర‌చారంలో నిజ‌మెంతో తేలాలి. సాయి ప‌ల్ల‌విని క‌న్విన్స్ చేయ‌డం అంత వీజీ కాదు. క‌థ‌, అందులో త‌న పాత్ర గురించి చాలా విష‌యాలు ఆలోచిస్తుంది. అన్ని ఆలోచించిన త‌ర్వాత ఒకే అనుకుంటేనే ముందుకెళ్తుంది. ఈ మ‌ధ్య‌లో బోలెడంత ప్రోస‌స్ కూడా ఉంటుంది. అలాంటి సాయి ప‌ల్ల‌విని వెట్రీమార‌న్ సింగిల్ సిట్టింగ్ లోనే ఒకే చేయించాడు. అది అత‌డి ప్ర‌తిభ‌తో సాధ్య‌మైంది.

కానీ హీరో కార‌ణంగా స్కిప్ కొట్ట‌డం విచారక‌రం. ఇలాంటి అవ‌కాశాలు వ‌దుల‌కోవ‌డం సాయి ప‌ల్ల‌వికి కొత్తేం కాదు. టాలీవుడ్ లో కూడా వ‌చ్చిన చాలా అవ‌కాశాలు వ‌దులుకుంటుంద‌ని ప్ర‌చారం చాలా కాలంగా ఉంది. ఇలా వ‌చ్చిన అవ‌కాశాలు వ‌దుల‌కోవ‌డంతో అమ్మ‌డిపై కొంత వ్య‌తిరేక‌త కూడా వ్య‌క్త‌మ‌వుతోంది. స‌రైన కార‌ణాలు లేకుండా తాను ఏదో ఊహించుకుని స్కిప్ కొట్ట‌డం భావ్యం కాద‌నే చ‌ర్చ గ‌తంలోనే ఇండ‌స్ట్రీలో జ‌రిగింది. ప్ర‌స్తుతం సాయి ప‌ల్ల‌వి బాలీవుడ్ `రామాయ‌ణం`లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.