సాయిపల్లవి పాదాలకు నమస్కరించిన కోచ్!
‘రామాయణం’ షూటింగ్‌లో సీత పాత్ర పోషిస్తున్న సాయిపల్లవి భావోద్వేగానికి గురయ్యారు. ఆమె నటనకు ముగ్ధురాలైన డైలెక్ట్ కోచ్ ఒక్కసారిగా కాళ్లకు నమస్కరించడంతో సాయిపల్లవి కంటతడి పెట్టుకున్నారు. సీత పాత్రపై తనకున్న గౌరవం, భక్తి భావాలే ఈ అనుభవానికి కారణమని ఆమె తెలిపారు. అయితే తొలి భాగంలో సీత పాత్ర చిత్రణపై వచ్చిన విమర్శల నేపథ్యంలో రెండో భాగంపై ఆసక్తి నెలకొంది.
By: Srikanth Kontham | 13 Nov 2026 3:58 PM ISTబాలీవుడ్ `రామాయణం` మొదటి భాగం ఇటీవలే రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా 100 కోట్ల వసూళ్లకు చేరువలో ఉంది. మొదటి భాగం లో నటించిన పాత్రలకు మంచి గుర్తింపుతో పాటు పేరు ప్రఖ్యాతలు దక్కుతున్నాయి. దీంతో రెండవ భాగం విషయంలో దర్శకుడు నితీష్ తివారీ ధైర్యంగా ముందుకెళ్లొచ్చని గ్రీన్ సిగ్నెల్ దొరికేసింది. ఇప్పటికే రెండవ భాగం చాలా వరకూ షూటింగ్ కూడా పూర్తి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా సెట్ లో చోటుచేసుకున్న ఓ ఎమోషన్ సన్నివేశాన్ని సాయి పల్లవి రివీల్ చేసారు.
ఈ సినిమా షూటింగ్ సమయంలో సాయిపల్లవి డైలెక్ట్ కోచ్ ఒక్కసారిగా కాళ్లకు నమస్కరించడంతో సాయి పల్లవి ఉద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. అంతగా లేడీ కోచ్ ఎందుకలా వ్యవహరించారు? అంటే దీని వెనుక చాలా కథే ఉంది. సీత పాత్రలో సాయి పల్లవిని ఆ లేడీ కోచ్ ఎంతగానో ఓన్ చేసుకున్నట్లు తెలిపారు. ఆ పాత్రపై ఉండే పవిత్రమైన గౌరవం ఎదుటివారిలో ఎంతలా కదిలిస్తుందన్నది అప్పుడే అర్దమైందని సాయి పల్లవి తెలిపారు. దేవుళ్లు..దేవతల పాత్రలు పోషిస్తున్నప్పుడు అపారమైన భక్తులకు నటులు ఇలా కనిపించడం అన్నది పరిపాటే.
గతంలో చిరంజీవి ఓ సినిమాలో శివుడి పాత్ర పోషిస్తున్నప్పుడు సెట్స్ లో ఇలాంటి సన్నివేశం చోటు చేసుకుంది. అలాగే నాగార్జున భక్తి సినిమాలు చేసిన సమయంలోనూ ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కున్నట్లు గతంలో తెలిపారు. తాజాగా సీత పాత్రలో సాయి పల్లవి అద్బుతమైన అభినయంతో సదరు కోచ్ తన్మయానికి గురయ్యారు. ఆ భావో ద్వేగాన్ని ఆపుకోలేక సాయి పల్లవి పాత్రలోనే నిజమైన సీతాదేవిని చూసుకున్నారు. ఇక వ్యక్తిగతంగా ఈ పాత్రకు సాయి పల్లవి ఎంతగానో కనెక్ట్ అయ్యారని ఆమె మాటల్ని బట్టే అర్దమవుతోంది.
ఈ చిత్రంలో సాయి ప్లలవి నటన తో నటిగా కాకుండా ఆ పాత్రకు ఎంత వరకు న్యాయం చేయగలననే కోణంలోనే ఆలోచించానని పలు సందర్బాల్లో రివీల్ చేసారు. అయితే మొదటి భాగం రిలీజ్ అనంతరం సాయిపల్లవి సీత పాత్ర విషయంలో కొన్ని విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి. ఆ పాత్రను మరీ ఓవర్ గా డ్రెమటైజ్ చేసినట్లు కథనాలొచ్చాయి. సీత ఆహార్యంలోనూ కొన్ని విమర్శలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో రెండవ భాగం విషయంలో నితీష్ తివారీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అన్నది చూడాలి.
