Begin typing your search above and press return to search.

సాయి పల్లవి హెయిర్ కట్ వెనుక అసలు కథ.. అతని కోసమే అలా చేసిందంట..!

ధనుష్, మమ్ముట్టి నటిస్తున్న ‘O.M’ సినిమా కోసం సాయి పల్లవి జుట్టు కత్తిరించుకుని కొత్త లుక్‌లోకి మారారు. ఈ విషయాన్ని వీడియో కాల్‌లో చూసిన ఆమె తల్లి షాక్‌కు గురై కాల్ కట్ చేయగా, తండ్రి కూడా అది విగ్గు అనుకున్నారట. దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామిపై నమ్మకంతోనే పోలీస్ అధికారి పాత్ర కోసం ఈ మార్పుకు అంగీకరించినట్లు సాయి పల్లవి తెలిపారు. ఈ సినిమా నవంబర్ 20న విడుదల కానుంది.

By:  Priya Chowdhary Nuthalapti   |   17 Nov 2026 3:34 PM IST
సాయి పల్లవి హెయిర్ కట్ వెనుక అసలు కథ.. అతని కోసమే అలా చేసిందంట..!
X

సహజమైన నటనతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న.. నటి సాయి పల్లవి మరోసారి వార్తల్లో నిలిచారు. తన పాత్ర కోసం ఆమె తీసుకున్న ఓ కీలక నిర్ణయం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సాధారణంగా తన పొడవాటి జుట్టుతో కనిపించే సాయి పల్లవి.. కొత్త సినిమా కోసం ఏకంగా జుట్టు కత్తిరించుకున్నారు. అయితే ఇది చూసి ఆమె తల్లిదండ్రులు కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారట. ముఖ్యంగా తన తల్లి స్పందన గురించి సాయి పల్లవి చెప్పిన విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ధనుష్, మమ్ముట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'O.M' సినిమాలో సాయి పల్లవి కీలక పాత్ర పోషిస్తున్నారు. దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఆమె ఓ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. ఈ పాత్ర కోసం ఆమె పూర్తిగా కొత్త లుక్‌లోకి మారారు. ఇందులో భాగంగానే తన జుట్టును కత్తిరించుకోవాల్సి వచ్చింది.

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సాయి పల్లవి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టింది. జుట్టు కత్తిరించుకున్న వెంటనే తన తల్లికి వీడియో కాల్ చేశారట. అయితే కొత్త లుక్‌లో కూతురిని చూసిన ఆమె ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఏమీ మాట్లాడకుండా వెంటనే కాల్ కట్ చేశారట. ఆ తర్వాత తండ్రికి వీడియో కాల్ చేయగా, ఆయన కూడా నమ్మలేకపోయారట. 'పల్లవి, అది విగ్గే కదా?' అని అడిగారట. తాను నిజంగానే జుట్టు కత్తిరించుకున్నానని చెప్పడంతో ఆయనకు విషయం అర్థమైంది. చివరకు తండ్రే తల్లికి నచ్చజెప్పారట.

అయితే ఇలాంటి నిర్ణయం ఏ దర్శకుడి కోసం పడితే ఆ దర్శకుడి కోసం తీసుకోనని సాయి పల్లవి తెలిపారు. కేవలం..దర్శకుడు రాజ్‌కుమార్‌పై ఉన్న నమ్మకంతోనే ఈ మార్పుకు అంగీకరించినట్లు తెలిపారు.

ఈ కొత్త లుక్ కోసం దర్శకుడు ఆమెకు ఐపీఎస్ అధికారి మెరిన్ జోసెఫ్ ఫొటోలను చూపించారట. ఆ అధికారిని తన పాత్రకు రిఫరెన్స్‌గా తీసుకున్నట్లు వివరించారు. ఆమె మాదిరిగా కనిపించాలంటే జుట్టు కత్తిరించుకోవాల్సి ఉంటుందని దర్శకుడు చెప్పడంతో సాయి పల్లవి కూడా అంగీకరించారు. దర్శకుడి ఆలోచనపై నమ్మకం ఉంచి ఈ ప్రయోగం చేసినట్లు వెల్లడించారు.

ఈ మధ్య రిలీజ్ అయిన ట్రైలర్ వల్ల నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానున్న 'O.M' చాలా ఆసక్తి పెరిగింది.