Begin typing your search above and press return to search.

జుట్టు కట్ చేసుకున్న సాయి పల్లవి.. షాకైన మమ్మీ-డాడీ!

ధనుష్, మమ్ముట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘ఓం’ సినిమా కోసం సాయి పల్లవి తన పొడవాటి జుట్టును కత్తిరించుకున్నారు. ఇందులో ఐపీఎస్ అధికారి నిత్యా రెడ్డి పాత్రలో కనిపించనున్నారు. ఈ విషయం ముందుగా చెప్పకపోవడంతో ఆమె తల్లి షాక్ అయ్యారని, తండ్రి కూడా విగ్గు అనుకున్నారని సాయి పల్లవి వెల్లడించారు. దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామిపై నమ్మకంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

By:  Srikanth Kontham   |   17 Nov 2026 12:34 AM IST
జుట్టు కట్ చేసుకున్న సాయి పల్లవి.. షాకైన మమ్మీ-డాడీ!
X

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి అంటే? సొగ‌సైన‌ ఉంగరాల జుట్టు.. సహజమైన రూపం గుర్తుకొస్తాయి. గ్లామర్ పాత్రలకు దూరంగా కథకు ప్రాధాన్యత ఇచ్చే ప‌ల్ల‌వి పాత్ర కోసం ఎంతటి సాహసానికైనా సిద్ధపడతారు. తాజాగా రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో ధనుష్, మమ్ముట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ `ఓం` సినిమా కోసం సాయి పల్లవి ఏకంగా తన ప్రియమైన జుట్టును కత్తిరించుకున్నారు. ఈ చిత్రంలో నిత్యా రెడ్డి అనే పవర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్న అమ్మ‌డు లుక్ కోసం తీసుకున్న నిర్ణయం ఇంట్లో పెద్ద అలజడినే సృష్టించింద‌ని ఆలస్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

ఈ విష‌యాన్ని సాయి పల్లవి స్వయంగా రివీల్ చేసారు. తాను జుట్టు క‌త్తిరించుకుంటున్నాను అనే విషయాన్ని ముందుగా తన తల్లికి చెప్పలేదని.. సడెన్‌గా కొత్త లుక్ చూసి తట్టుకోలేకపోయారని పల్లవి న‌వ్వేసారు. `నా జుట్టు కత్తిరించుకున్న విషయం తెలియగానే మా అమ్మ షాక్ అయ్యారు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెంటనే ఫోన్ కట్ చేశారు. ఆ తర్వాత మా నాన్న నాకు కాల్ చేసి.. అది విగ్గు కదా పల్లవి? అని అడిగారు. నిజంగానే కట్ చేయించు కున్నానని చెప్పడంతో ఆయనా షాక్ అయ్యారు. ఆ తర్వాత మా నాన్న అమ్మకు నచ్చజెప్పి నాతో మాట్లాడించడానికి చాలా సమయం పట్టింద`న్నారు.

పాత్ర కోసం రాజ్‌కుమార్ పెరియసామి స్క్రిప్ట్ చెప్పినప్పుడే ఈ రోల్‌కు ఎలా సెట్ అవుతానోనని సాయి పల్లవి ఆలోచించారట. అయితే దర్శకుడు ప్రముఖ ఐపీఎస్ ఆఫీసర్ మెరిన్ జోసెఫ్ ఫోటోను చూపించి ఆ తరహా లుక్ కావాలని అడిగారట. ఆమెకు షార్ట్ హెయిర్ ఉందని సాయి పల్లవి అనగానే.. `నువ్వు జుట్టు కత్తిరించుకుంటే ఆ పాత్రకు కావాల్సిన ఆటిట్యూడ్.. లుక్ సహజంగానే వచ్చేస్తాయి` అని దర్శకుడు అన్నారట. రాజ్‌కుమార్ పాత్రలను రాసే విధానం.. ఆయనపై ఉన్న నమ్మకంతో తనకు ఎంతో ఇష్టమైన జుట్టును కత్తిరించుకోవడానికి ఏమాత్రం కష్టమనిపించలేదని సాయి పల్లవి తెలిపారు.

`అమరన్` వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత రాజ్‌కుమార్ పెరియసామి సాయి పల్లవి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో `ఓం`పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో ధనుష్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా.. మమ్ముట్టి కీలక పాత్రలో క‌నిపించ‌నున్నారు. ఈ చిత్రంలో శ్రీలీల మరో హీరోయిన్‌గా మెరవనుంది. గత నెలలోనే విడుదల కావాల్సిన ఈ సినిమా రజనీకాంత్ `జైలర్ 2` కార‌ణంగా వాయిదా పడి ఎట్టకేలకు ఈ నెల 20న థియేటర్లలోకి వస్తోంది.