Begin typing your search above and press return to search.

సాయి పల్లవి ఫ్యాన్స్ వెయిటింగ్..!

నాగ చైతన్యతో సాయి పల్లవి ఎప్పుడు జత కట్టినా సరే సూపర్ హిట్ అనేలా లవ్ స్టోరీ సక్సెస్ తర్వాత ఈ జోడీ తండేల్ తో సక్సెస్ అందుకుంది.

By:  Ramesh Boddu   |   20 Sept 2025 9:50 AM IST
సాయి పల్లవి ఫ్యాన్స్ వెయిటింగ్..!
X

సౌత్ లో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా కూడా ఒక్కొక్కరికి ఒక్కో స్పెషాలిటీ ఉంటుంది. అందులో స్టార్ క్రేజ్ తెచ్చుకున్న వాళ్లకైతే ఇంకాస్త ఎక్కువ బజ్ ఉంటుంది. వాళ్ల సినిమాల అప్డేట్స్, ప్రతి విషయాన్ని ఫ్యాన్స్ అంజర్వ్ చేస్తుంటారు. ఈ క్రమంలో సౌత్ లో క్రేజీ ఫ్యాన్స్ ఉన్న సాయి పల్లవి కోసం తెలుగు ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

నాగ చైతన్యతో సాయి పల్లవి..

తెలుగులో ఆమె విరాటపర్వం తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకుని తండేల్ సినిమా చేసింది. నాగ చైతన్యతో సాయి పల్లవి ఎప్పుడు జత కట్టినా సరే సూపర్ హిట్ అనేలా లవ్ స్టోరీ సక్సెస్ తర్వాత ఈ జోడీ తండేల్ తో సక్సెస్ అందుకుంది.

తండేల్ తర్వాత మళ్లీ సాయి పల్లవి తెలుగు సినిమాల్లో డిస్కషన్ లో లేదు. అసలు ఆమెను కలిసి కథలు చెబుతున్నారా లేదా అన్న పాయింట్ కూడా ఎక్కడ లీక్ అవ్వట్లేదు. ఐతే సాయి పల్లవి మాత్రం బాలీవుడ్ లో వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది. ఆల్రెడీ రామాయణ్ సినిమా చేస్తున్న సాయి పల్లవి మరో రెండు సినిమాలకు సైన్ చేసింది. ఐతే సౌత్ లో క్లాస్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సాయి పల్లవి బాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ తెచ్చుకుంటుందో చూడాలి.

సాయి పల్లవి తెలుగు సినిమాలు చేయాలని ఆమె ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఐతే ఎలాంటి సినిమా పడితే అలాంటి సినిమా చేసి తనకున్న ఇమేజ్ ని చెడగొట్టుకోవడం ఎందుకని ఆమె ఆలోచిస్తుంది. అందుకే సెలెక్టెడ్ సినిమాలే చేస్తూ వస్తుంది అమ్మడు. తెలుగులో బలగం వేణు చేస్తున్న ఎల్లమ్మ సినిమాకు సాయి పల్లవిని అడిగారని టాక్. ఐతే ఆమె బాలీవుడ్ లో సినిమాల వల్ల డేట్స్ ఇవ్వలేకపోతుందట.

ఎల్లమ్మ సాయి పల్లవి..

ఎల్లమ్మ సాయి పల్లవి ప్లేస్ లో కీర్తి సురేష్ కి ఆ ఛాన్స్ ఇస్తున్నారట. ఇక మరోపక్క సాయి పల్లవి కూడా టాలీవుడ్ లో మరోసారి తన స్టార్ ఇమేజ్ కి తగిన రోల్ అయితేనే చేయాలని చూస్తుందట. సాయి పల్లవి అందరి హీరోయిన్స్ లా వరుస సినిమాలు చేయదు. సినిమాలో సాయి పల్లవి ఉంది అంటే ఆ స్పెషాలిటీ కనిపిస్తుంది. తండేల్ తర్వాత సాయి పల్లవి చేసే తెలుగు సినిమా ఏదవుతుంది అన్నది చూడాలి.

టాలీవుడ్ లో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా కూడా సాయి పల్లవి క్రేజ్ స్పెషల్ అనేలా ఉంది. కచ్చితంగా ఆమె నెక్స్ట్ మరో బిగ్ ప్రాజెక్ట్ తో సర్ ప్రైజ్ చేస్తుందని తెలుగు ఆడియన్స్ నమ్ముతున్నారు.