Begin typing your search above and press return to search.

సాయి ప‌ల్ల‌వి కొత్త సినిమాపై విమ‌ర్శ‌లు..బ‌ట్‌..!

స్టార్ క‌థానాయిక‌ల్లో ప్ర‌త్యేక గుర్తింపుని సొంతం చేసుకున్న హీరోయిన్ సాయి ప‌ల్ల‌వి.

By:  Tupaki Entertainment Desk   |   16 Jan 2026 11:01 AM IST
సాయి ప‌ల్ల‌వి కొత్త సినిమాపై విమ‌ర్శ‌లు..బ‌ట్‌..!
X

స్టార్ క‌థానాయిక‌ల్లో ప్ర‌త్యేక గుర్తింపుని సొంతం చేసుకున్న హీరోయిన్ సాయి ప‌ల్ల‌వి. మ‌ల‌యాళ‌, త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో త‌న‌దైన మార్కు సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని ఆక‌ట్టుకుని క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సొంతం చేసుకుంది. క‌న్న‌డ‌లో మిన‌హా ద‌క్షిణాది భాష‌ల్లో న‌టించి ప్ర‌త్యేక‌మైన గుర్తింపుని సొంతం చేసుకున్న సాయి ప‌ల్ల‌వి ఇప్పుడు బాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. బాలీవుడ్‌లో త‌ను అంగీక‌రించిన ఫ‌స్ట్ మూవీ `ఏక్ దిన్‌`. బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ ఆమీర్‌ఖాన్ నిర్మాణంలో ఆయ‌న త‌న‌యుడు జునైద్ ఖాన్ హీరోగా దీన్ని తెర‌కెక్కిస్తున్నారు.

సునీల్ పాండే ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ని సంక్రాంతి సంద‌ర్భంగా విడుద‌ల చేశారు. దీనిపై నెట్టింట విమ‌ర్శ‌లు వెళ్లువెత్తుతున్నాయి. సినిమా టైటిల్‌, పోస్ట‌ర్ డిజైన్ 2016లో వ‌చ్చిన థాయ్ మూవీ రొమాంటిక్ డ్రామా `వ‌న్ డే`ని పోలి ఉంద‌ని, ఆ మూవీని కాపీ చేశార‌ని నెటిజన్‌లు ఈ మూవీ టీమ్‌పై నెట్టింట విమ‌ర్శ‌లు చేస్తున్నారు. టైటిల్‌, పోస్ట‌ర్‌తో పాటు సినిమాని కూడా కాపీ చేసిన‌ట్టున్నార‌ని సెటైర్లు వేస్తున్నారు. ఈ విమ‌ర్శ‌ల‌పై మేక‌ర్స్ ఇంత వ‌ర‌కు స్పందించ‌లేదు.

కాగా ఈ మూవీని మే 1న భారీ స్థాయిలో ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లోకి తీసుకురావాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. జునైద్ ఖాన్ ఫ‌స్ట్ మూవీ `మ‌హారాజ్‌` వివాదం కార‌ణంగా థియేట్రిక‌ల్ రిలీజ్‌కు నోచుకోలేదు. ఆ తరువాత త‌మిళ‌, తెలుగు హిట్ ఫిల్మ్‌ `ల‌వ్ టుడే` ఆధారంగా చేసిన `ల‌వ్ పాయా` కూడా ఫ్లాప్ అయింది. దీంతో `ఏక్ దిన్` మూవీని థియేట్రిక‌ల్ రిలీజ్ చేయాల‌ని, ఈ మూవీతో ఎలాగైనా జునైద్‌కు హిట్ ఇవ్వాల‌ని ఆమీర్‌ఖాన్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఈ సినిమాపై నెట్టింట విమ‌ర్శ‌లు వెల్లువెత్త‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఈ నేప‌థ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం బ‌య‌టికి వ‌చ్చింది. `ఏక్ దిన్‌` పేరుతో రూపొందుతున్న ఈ సినిమా థాయ్ మూవీ `వ‌న్ డే`కి కాపీ కాద‌ని, ఆ సినిమాకు అఫీషియ‌ల్ రీమేక్ అని తెలిసింది. 2016లో విడుద‌లై మంచి విజ‌యాన్ని సొంతం చేసుకుంది. బెస్ట్ మూవీతో పాటు బెస్ట్ యాక్ట్రెస్‌, బెస్ట్ యాక్ట‌ర్ విభాగాల్లో అవార్డుల్ని తెచ్చి పెట్టింది. రొమాంటిక్ ల‌వ్ స్టోరీగా తెర‌కెక్కిన ఈ సినిమా థాయ్‌లాండ్‌తో పాటు సింగ‌పూర్‌, వియ‌త్నంల‌లో కూడా విడుదలై బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అనిపించుకుంది.

ఈ స్టోరీ న‌చ్చ‌డం వ‌ల్లే ఆమీర్‌ఖాన్ త‌న త‌న‌యుడు జునైద్ ఖాన్ హీరోగా రీమేక్ చేయాల‌ని ప్లాన్ చేశాడ‌ని, రీమేక్ రైట్స్ తీసుకుని ఈ మూవీని తానే స్వ‌యంగా నిర్మిస్తున్నాడ‌ని బాలీవుడ్ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. అయితే రీమేక్ వ‌ర‌కు ఓకే కానీ టైటిల్‌, ప‌బ్లిసిటీ పోస్ట‌ర్స్‌ని కూడా మ‌క్కీటు మ‌క్కీగా దించేయ‌డం మాత్రం ఏమీ బాగాలేద‌ని, క్రియేటివిటీ విష‌యంలో ఎప్పుడూ ముందుంటే ఆమీర్‌ఖాన్ త‌న త‌న‌యుడి సినిమా విష‌యంలో మాత్రం ఎందుకిలా పోస్ట‌ర్స్‌ని కూడా కాపీ చేయిస్తున్నాడో అర్థం కావ‌డం లేద‌నే కామెంట్‌లు వినిపిస్తున్నాయి.