Begin typing your search above and press return to search.

మహేష్ ఫ్లాప్ మూవీ సీక్వెల్ పై ఆశ పడుతున్న డైరెక్టర్.. ఎవరంటే?

మహేష్ బాబు ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించారు. అందులో కొన్ని హిట్స్ ఉన్నాయి. మరి కొన్ని ఫ్లాప్స్ కూడా ఉన్నాయి.

By:  Madhu Reddy   |   2 Oct 2025 12:00 AM IST
మహేష్ ఫ్లాప్ మూవీ సీక్వెల్ పై ఆశ పడుతున్న డైరెక్టర్.. ఎవరంటే?
X

మహేష్ బాబు ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించారు. అందులో కొన్ని హిట్స్ ఉన్నాయి. మరి కొన్ని ఫ్లాప్స్ కూడా ఉన్నాయి. వాటన్నింటిని దాటుకుంటూ తన సినీ కెరీర్ ని ముందుకు సాగిస్తున్నారు. అయితే అలాంటి మహేష్ బాబు నటించిన ఓ ఫ్లాప్ మూవీకి.. అవకాశం వస్తే రీమేక్ చేస్తాను అంటున్నారు ఓ డైరెక్టర్. ఈ విషయం వినగానే అందరూ ఆశ్చర్యపోతారు. ఎవరైనా హిట్ సినిమాని రీమేక్ చేయాలనుకుంటారు కానీ ఈ డైరెక్టర్ ఏంటి ఫ్లాప్ సినిమాని రీమేక్ చేస్తానంటున్నారు అని.. కానీ ఈ డైరెక్టర్ కి మహేష్ బాబు నటించిన ఆ ఫ్లాప్ మూవీనే చాలా బాగా నచ్చిందట.

మరి ఇంతకీ ఆ సినిమా ఏంటి? ఆ డైరెక్టర్ ఎవరు? అనే వివరాలు చూస్తే..మహేష్ బాబు, మురుగదాస్ కాంబినేషన్ లో వచ్చిన 'స్పైడర్' మూవీ అందరూ చూసే ఉంటారు. అయితే ఈ సినిమా మహేష్ బాబు మురుగదాస్ కాంబో అనగానే.. అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అలా తెలుగు, తమిళ భాషల్లో విడుదలైనప్పటికీ ఈ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యింది. కానీ మొదటి రోజు ఈ సినిమా మీద ఉన్న అంచనాలతో ఏకంగా రూ.51 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. కంటెంట్ లో కథా కథాబలం లేకపోవడం వల్లే.. ఈ సినిమా భారీ అంచనాలతో వచ్చినా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ గానే మిగిలింది.

అలాంటి ఈ సినిమా లిటిల్ హార్ట్స్ డైరెక్టర్ సాయి మార్తాండ్ కి తెగ నచ్చేసిందట. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "నాకు మహేష్ బాబు నటించిన స్పైడర్ మూవీలో విలన్, హీరో క్యారెక్టర్స్ రెండు పిచ్చపిచ్చగా నచ్చేసాయి. అయితే ఈ సినిమాకి నేను ఈ కామెంట్ చెయ్యొచ్చో లేదో తెలియదు.కానీ ఇది అండర్ రేటెడ్ ఫిల్మ్.. ఇందులో హీరో క్యారెక్టర్ ని చాలా బాగా డిజైన్ చేశారు. హీరో ఏదైనా తప్పు జరిగే ముందే స్పందించి, అందులో నుండి కాపాడాలి అనుకుంటారు. కమర్షియల్ సినిమాల్లో ఇది చాలా బాగా వర్క్ అవుట్ అవుతుంది. మహేష్ బాబుది ఇందులో మంచి హీరోయిజాన్ని చూపించే క్యారెక్టర్.

అటు విలన్ విషయానికి వస్తే.. ఎస్జే సూర్య చిన్నప్పటి నుండి చావులను చూసి సంతోషపడే క్యారెక్టర్ లో నటించారు. ఈ సినిమాలో డాక్టర్ ఒక విషయం చెబుతాడు. మనందరి జీవితంలో ఒక సైకోనెస్ అనేది ఏదో ఒక మూలన ఉంటుంది. రోడ్డు మీద మనం అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే అలా చూస్తాం. ఆ టైంలో ఆ వ్యక్తి చనిపోకపోతే అబ్బా చనిపోలేదా అని అనుకుంటాం. అలా ఒక రకమైన సైకోనెస్ ఉంటుంది. అయితే అందరిలో అది కాస్త తక్కువ ఉంటుంది. కానీ వీడికి కాస్త ఎక్కువ ఉందని విలన్ గురించి చెబుతాడు. అది నిజమే.. ఒకవేళ నేను ఏదైనా సినిమా రీమేక్ చేయాలి అనుకుంటే కచ్చితంగా స్పైడర్ మూవీని రీమేక్ చేస్తాను" అంటూ ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు.

ప్రస్తుతం ఈ డైరెక్టర్ మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్లు స్పైడర్ మూవీని ఇప్పటివరకు చాలా సార్లు చూసాం. కానీ ఈ డైరెక్టర్ అంచనా వేసినట్లు మేమైతే ఊహించలేకపోయాం. స్పైడర్ మూవీ చూడడం కన్నా ఈ డైరెక్టర్ తన మాటలతో హీరో, విలన్ పాత్రల గురించి చెప్పడంతో మళ్ళీ సినిమా చూడాలనే ఆసక్తి కలుగుతోంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

సాయి మార్తాండ్ విషయానికి వస్తే.. ఆయన రీసెంట్ గానే లిటిల్ హార్ట్స్ మూవీతో మొదటిసారి దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఈయన గురించి ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకుంటుంది. డైరెక్టర్ సాయి మార్తాండ్ ఎవరో కాదు ఒకప్పటి దిగ్గజ దర్శకుడు బి.వి. ప్రసాద్ మనవడే. అలా ఆయన చనిపోయాక.. వారి ఫ్యామిలీ నుండీ డైరెక్టర్ గా ఇండస్ట్రీకి ఎవరు రాలేదు. కానీ మళ్ళీ తాత అడుగుజాడల్లో నడుస్తూ డైరెక్టర్ గా సాయి మార్తాండ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.