బడా బ్యానర్ లో లిటిల్ హార్ట్స్ దర్శకుడు
ఈ విజయంతో హీరో హీరోయిన్లు మాత్రమే కాకుండా, డైరెక్టర్ సాయి మార్తాండ్ కూడా స్పెషల్ అటెన్షన్ దక్కించుకున్నారు.
By: M Prashanth | 1 Oct 2025 12:00 AM ISTఇటీవల పెద్దగా అంచనాలు లేకుండా వచ్చి ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న సినిమా లిటిల్ హార్ట్స్. చిన్న సినిమాగా వచ్చినా, పెద్ద విజయం సాధించి బాక్సాఫీస్ దగ్గర బోల్డంత కలెక్షన్లు సాధించింది. ఓవర్సీస్‌లోనూ మంచి రికార్డులు క్రియేట్ చేసింది. వన్ మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరి కొత్త రికార్డ్ ని అందుకుంది.
ఈ విజయంతో హీరో హీరోయిన్లు మాత్రమే కాకుండా, డైరెక్టర్ సాయి మార్తాండ్ కూడా స్పెషల్ అటెన్షన్ దక్కించుకున్నారు. లిటిల్ హార్ట్స్ సినిమాతో వచ్చిన ఈ ఫేమ్ ని ఇప్పుడు మరింత పెద్ద లెవెల్ కి తీసుకెళ్లే అవకాశం వచ్చింది. ఎందుకంటే, సాయి మార్తాండ్ తన తదుపరి సినిమాకు ఏషియన్ సినిమాస్ అనే బడా బ్యానర్ తో చేతులు కలిపారు.
ఈ లీక్ బయటకు రావడంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఈ బ్యానర్ కుబేర వంటి సినిమాను నిర్మించి, మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు లిటిల్ హార్ట్స్ దర్శకుడితో కలిసి సినిమా చేయడం అంటే ఆ ప్రాజెక్ట్ మీద ఎంత నమ్మకం ఉందో అర్థమవుతోంది. సాయి మార్తాండ్ మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకోవడం, యూత్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవడంతో అతనికి ఇండస్ట్రీలో డిమాండ్ ఏర్పడింది.
కంటెంట్ సెంట్రిక్ సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర వర్కౌట్ అవుతాయని సాయి నిరూపించాడు. అలాంటి డైరెక్టర్ కి ఏషియన్ సినిమాస్ లాంటి స్థాయి సంస్థ నుంచి ఆఫర్ రావడం ఇండస్ట్రీలోని కొత్త తరానికి కూడా ఒక పెద్ద ఇన్‌స్పిరేషన్. చిన్న సినిమాతో పెద్ద హిట్ కొట్టి వెంటనే బడా ప్రొడక్షన్ హౌస్ తో డీల్ సైన్ చేయడం చాలా అరుదైన విషయం.
ఏషియన్ సినిమాస్ గురించి చెప్పుకుంటే, మల్టీప్లెక్స్ బిజినెస్ లో వారికే ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రొడక్షన్ లో మాత్రం కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తారు. అప్పుడప్పుడు మాత్రమే సినిమాలు చేస్తారు కానీ చేసేప్పుడు పెద్ద స్థాయిలో చేస్తారు. ఈసారి లిటిల్ హార్ట్స్ ఫేమ్ డైరెక్టర్ సాయిని ఎంచుకోవడం, రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్ట్ మీద పెద్ద ఎక్సపెక్టేషన్స్ పెరగడానికి కారణం అవుతోంది.
ఇక ఈ కొత్త ప్రాజెక్ట్ డీటైల్స్ గురించి త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. హీరోయిన్ ఎవరు, కథ ఎలాంటి జానర్ లో ఉంటుంది, ఎవరెవరు నటించబోతున్నారు అన్నది ఇప్పటివరకు సీక్రెట్ గానే ఉంచారు. కానీ ఏషియన్ సినిమాస్ మార్కెట్ స్థాయి, లిటిల్ హార్ట్స్ ఇచ్చిన కంటెంట్ హిట్ కలిపి ఈ సినిమా కూడా పెద్ద రేంజ్ లో హైప్ తెచ్చుకోవడం ఖాయం.
