అలాంటి సీన్లు చూస్తే మా అమ్మ నన్ను కొడుతుంది
ఇండస్ట్రీలో ఎలాంటి అనుభవం లేకపోయినా సాయి మార్తాండ్ తీసిన మొదటి సినిమా లిటిల్ హార్ట్స్ అతనికి మంచి సక్సెస్ ను అందించింది.
By: Sravani Lakshmi Srungarapu | 17 Sept 2025 3:00 AM ISTఇండస్ట్రీలో ఎలాంటి అనుభవం లేకపోయినా సాయి మార్తాండ్ తీసిన మొదటి సినిమా లిటిల్ హార్ట్స్ అతనికి మంచి సక్సెస్ ను అందించింది. ఈ సినిమాకు పని చేసిన వాళ్లంతా కొత్త వాళ్లే. ఇప్పటికే ఈ సినిమా పెట్టిన బడ్జెట్ కంటే పదింతలు వసూళ్లను అందుకుంది. ఇన్వెస్ట్‌మెంట్, రిటర్న్స్ యాంగిల్ లో చూసుకుంటే టాలీవుడ్ ఇండస్ట్రీలోని బిగ్గెస్ట్ హిట్లలో లిటిల్ హార్ట్స్ కూడా ఒకటిగా నిలిచిందంటే అతిశయోక్తి లేదు.
లిటిల్ హార్ట్స్ తో డైరెక్టర్ గా మారిన మీమర్
ఏదైనా సినిమాలో తప్పు దొర్లి అది ఫ్లాపవ్వాలంటే ఒక్క చిన్న అంశం చాలు. అదే సినిమా హిట్టవ్వాలంటే ఎన్నో కలిసి రావాలి. ఎక్స్‌పీరియెన్స్ లేకపోయినా ఇదే విషయాన్ని చెప్తున్నారు లిటిల్ హార్ట్స్ డైరెక్టర్ సాయి మార్తాండ్. సినిమాల్లోకి రాకముందు సాయి మార్తాండ్ మీమర్. రెండెళ్ల ముందు వరకు కూడా అతను మీమ్స్ చేస్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడు లిటిల్ హార్ట్స్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు.
లిటిల్ హార్ట్స్ లో అతను మెయిన్ క్యారెక్టర్స్ ను డిజైన్ చేసిన విధానం, సీన్స్ ను పండించిన తీరు, మరీ ముఖ్యంగా ఆ కామెడీ ఆడియన్స్ ను బాగా ఇంప్రెస్ చేశాయి. నార్మల్ గా ఏదైనా లవ్ స్టోరీ చేసేటప్పుడు ఒకరి పేరెంట్స్ ను రిచ్ గా మరొకరి పేరెంట్స్ ను పూర్ గా చూపిస్తూ వారి మధ్య లవ్ ను ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటారు. కానీ లిటిల్ హార్ట్స్ లో ఇద్దరి పేరెంట్స్ ను రిచ్ గానే చూపించారు సాయి మార్తాండ్.
ఒకవేళ తాను హీరో లేదా హీరోయిన్ ఫ్యామిలీని పూర్ గా చూపించి ఉంటే లిటిల్ హార్ట్స్ ఫ్లాపయ్యేదని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు సాయి మార్తాండ్. ఒకవేళ వాళ్లు పేదవాళ్లు అయితే ఇంట్లోని పేరెంట్స్ కష్టపడుతుంటే పిల్లలుగా వీళ్లు చేసే పనులేంటని ఆడియన్స్ కు అనిపించేదని, అలాంటి సీన్స్ చూస్తే మా అమ్మ నన్ను కొట్టడంతో పాటూ అమ్మానాన్న కష్టపడుతుంటే పిల్లలు చేసే పనులేంటని అడుగుతుందని, తన తల్లి మాత్రమే కాదు, ఆడియన్స్ కూడా అలానే ఫీలయ్యేవారని, అలాంటప్పుడు సినిమా ఫ్లాపయ్యేదని, అందుకే పేరెంట్స్ ను రిచ్ గా చూపించానని, వాళ్లు రిచ్ కాబట్టే ఆడియన్స్ కూడా ఆ విషయాన్ని సరదాగానే తీసుకున్నారని సాయి మార్తాండ్ వివరణ ఇచ్చారు.
