లిటిల్ హార్ట్స్ డైరెక్టర్ దర్శకత్వం.. జగపతిబాబు నిర్మాణం..
లిటిల్ హార్ట్స్.. రీసెంట్ గా రిలీజ్ అయిన ఆ సినిమా ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే.
By: M Prashanth | 12 Sept 2025 5:00 AM ISTలిటిల్ హార్ట్స్.. రీసెంట్ గా రిలీజ్ అయిన ఆ సినిమా ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ తో యువతకు చేరువైన మౌళి తనూజ్ మూవీలో హీరోగా నటించగా, ఆ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు ఆదిత్య హసన్ దీనికి నిర్మాతగా వ్యవహరించారు. ఈటీవీ విన్ ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మించారు.
అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ శివానీ నాగరం హీరోయిన్ గా నటించగా.. రాజీవ్ కనకాల, అనిత చౌదరి, ఎస్.ఎస్.కాంచి, సత్య కృష్ణన్ హీరో హీరోయిన్ల తల్లిదండ్రులుగా యాక్ట్ చేశారు. డెబ్యూ డైరెక్టర్ సాయి మార్తాండ్ దర్శకత్వం వహించి.. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నారు. చిన్న సినిమాగా విడుదలైన ఆ మూవీ.. బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్ లో వసూళ్లు కురిపిస్తోంది.
భారీ లాభాలు అందుకుని దూసుకుపోతుండగా.. తాజాగా మేకర్స్ థాంక్యూ మీట్ నిర్వహించారు. ఆ సమయంలో డైరెక్టర్ సాయి మార్తాండ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారాయి. సినిమాలో ఫాదర్ క్యారెక్టర్ కోసం ముందు టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబును అనుకున్నామని ఆయన తెలిపారు.
"నిజానికి.. సినిమాలో ఫాదర్ క్యారెక్టర్ జగపతిబాబు చేయాల్సింది. క్యారెక్టర్స్ అందరిలో ఫస్ట్ నరేషన్ ఇచ్చింది ఆయనకే. స్కిప్ట్ బాగా నచ్చినా కొన్ని కారణాల వల్ల చేయలేపోయారు. ఆయనకు కుదరలేదు. ఆ విషయంలో చాలా ఫీలయ్యారు. మూవీ నుమాయిష్ ఎగ్జిబిషన్ షూటింగ్ సమయంలో కాల్ చేసి నేను శ్రీలంకలో ఉన్నానమ్మా అని చెప్పారు" అని తెలిపారు.
""నాకు నిద్ర పట్టడం లేదు. నీవే గుర్తొస్తున్నావ్.. నీ నెరేషన్ గుర్తొస్తుంది.. ఆ రోలే గుర్తొస్తుంది" అని జగపతిబాబు గారు చెప్పారు. మనం పక్కా ఒక సినిమా చేద్దామని అన్నారు. "నీవు డైరెక్షన్ చెయ్.. నేను ప్రొడ్యూస్ చేస్తా" అని తెలిపారు. అంతే కాదు ఒక చెక్ కూడా ఫిబ్రవరిలో ఇచ్చారు. అప్పటికీ లిటిల్ హార్ట్స్ షూటింగ్ సగమే అయింది" అని పేర్కొన్నారు.
అయితే తన నెక్స్ట్ మూవీ ఆయనతోనేని తెలిపారు సాయి మార్తాండ్. అంటే లిటిల్ హార్ట్స్ డైరెక్టర్ దర్శకత్వం.. జగపతిబాబు నిర్మాణంలో ఓ మూవీ రూపొందనుందన్నమాట. తన నెక్స్ట్ సినిమా ఎవరితో చేయబోతున్నారన్న ప్రశ్నకు సాయి మార్తాండ్ ఇలా స్పందించి స్పష్టం చేశారు. మరి జగపతి బాబు నిర్మాణంలో ఆయన దర్శకత్వం వహించనున్న మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో వేచి చూడాలి.
