తాతయ్య పేరు నిలబెట్టే మనవడొచ్చాడు!
ఇటీవల రిలీజ్ అయిన 'లిటిల్ హార్స్ట్' చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోన్న సంగతి తెలిసిందే. ఓ ఫీల్ గుడ్ మూవీ చూసిన అనుభూతికి లోనవుతున్నారు ప్రేక్షకులు.
By: Srikanth Kontham | 8 Sept 2025 5:01 PM ISTఇటీవల రిలీజ్ అయిన 'లిటిల్ హార్స్ట్' చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోన్న సంగతి తెలిసిందే. ఓ ఫీల్ గుడ్ మూవీ చూసిన అనుభూతికి లోనవుతున్నారు ప్రేక్షకులు. స్టార్ హీరోల సినిమా లు..భారీ బడ్జెట్ తో హంగామాతో రిలీజ్ అయిన సినిమాలు ప్లాప్ అయిన తరుణంలో ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు హిట్ అవ్వడం తో నూతన ప్రతిభావంతులకు మంచి గుర్తింపు దక్కుతోంది. ఈ సినిమా ద్వారా సాయి మార్తాండ్ అనే కొత్త కుర్రాడు దర్శకుడిగా పరిచయమయ్యాడు.
తన ట్యాలెంట్ నే నమ్ముకుని కష్టపడి సక్సెస్ అయ్యాడు. `#90 స్` డైరెక్టరే ఈ సినిమాకు నిర్మాత కావడం బాగా కలిసొచ్చింది. సాయి రాసుకున్న కథకు పూర్తి స్వేచ్ఛనివ్వడంతోనే ఇంతటి గుర్తింపు దక్కుతోంది. మరి ఇంతకీ సాయి మార్తాండ్ బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే. అతడు ఇండస్ట్రీ బిడ్డేనని తెలుస్తోంది. సాయి మార్తాండ్ ఎవరో కాదు లెజెండరీ డైరెక్టర్ బి.వి ప్రసాద్ మనవడు అన్న సంగతి వెలుగు లోకి వచ్చింది.
ఈ విషయాన్ని సాయి స్వయంగా రివీల్ చేసాడు. మా తాత సీనియర్ ఎన్టీఆర్ తో `ఆరాధన`,` మేలు కోలుపు`, `కృష్ణతో`, ` చుట్టాలున్నారు జాగ్రత్త` లాంటి సినిమాలు తీసారని ఓపెన్ అవ్వడంతో సర్ ప్రైజ్ అయ్యారంతా. దాదాపు 20 చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారన్నారు. కానీ 90 లో చనిపోయిన తర్వాత మాత్రం తన తరం ఎవరూ పరిశ్రమాలో లేరన్నారు. ఒకరిద్దరు ప్రయత్నించినా వెలుగులోకి రాలేకపోయినట్లు తెలిపారు.
తన తండ్రి గోపీనాధ్ తాతయ్య దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారన్నారు. కానీ కాలక్రమంలో ఆయన కూడా నిర్మాణంలో కొనసాగలేదన్నారు. మళ్లీ కొన్ని సంవత్సరాలు తర్వాత అదే కుటుబం నుంచి తాను దర్శకుడి గా పరిచయమవ్వడం విశేషంగా చెప్పుకున్నారు. తొలి ప్రయత్నంలోనే పెద్ద విజయం తన కుటుంబానికి ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు. తదుపరి సినిమాకు సంబంధించి కొన్ని కథలు కూడా సిద్దం చేసి పెట్టుకున్నట్లు తెలిపాడు. వాస్తవానికి సాయి మార్తాండ్ నటుడు అవ్వాలనుకున్నాడు.
కానీ ఆ రూట్లో కొత్త వారికి అవకాశాలు కష్టమని రైటర్ గా ప్రయాణం మొదలు పెట్టినట్లు తెలిపాడు. అలా 19 ఏళ్లకే ఓప్రేమ కథ రాసినట్లు గుర్తు చేసుకున్నాడు. మొత్తానికి తాతయ్య తర్వాతి వారు రాణించలేకపోయినా? ఆ తాతకు తగ్గ మనవడు ఇండస్ట్రీకి రావడం గొప్ప విషయం. సాయి మార్తాండ్ కూడా తాతయ్య బి.వి ప్రసాద్ లో మంచి విజయాలతో గొప్ప దర్శకుడు అవ్వాలని ప్రేక్షకులు ఆశీస్తున్నారు.
