Begin typing your search above and press return to search.

అన్నే బ్రతికుంటే.. సాయి కుమార్ మాటలకు కిరణ్ ఎమోషనల్!

తాజాగా ఈ సినిమా ఈవెంట్ లో భాగంగా సాయికుమార్ మాట్లాడుతూ.." ఈ సినిమాలో వాళ్ళ అమ్మే బ్రతికుంటే.. వాళ్ళ అమ్మే బ్రతికుంటే అనే నాకు.. వాళ్ళ అన్నే బ్రతికుంటే ఎంతో ఆనందపడేవాడు ఈరోజు.

By:  Madhu Reddy   |   22 Oct 2025 2:00 AM IST
అన్నే బ్రతికుంటే.. సాయి కుమార్ మాటలకు కిరణ్ ఎమోషనల్!
X

ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వతహాగా ఇండస్ట్రీలోకి వచ్చి.. ఇప్పుడు వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. అలాంటి ఈయన చివరిగా గత ఏడాది 'క' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పుడు ' కే ర్యాంప్' అంటూ మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అక్టోబర్ 18న దీపావళి సందర్భంగా విడుదలైన ఈ సినిమా అటు థియేటర్లలో బాగానే నడుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా ఈవెంట్లో హీరో సాయికుమార్ కిరణ్ అబ్బవరం అన్నను తలుచుకుంటూ చేసిన కామెంట్లకు హీరో ఎమోషనల్ అయిపోయారు..మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

తాజాగా ఈ సినిమా ఈవెంట్ లో భాగంగా సాయికుమార్ మాట్లాడుతూ.." ఈ సినిమాలో వాళ్ళ అమ్మే బ్రతికుంటే.. వాళ్ళ అమ్మే బ్రతికుంటే అనే నాకు.. వాళ్ళ అన్నే బ్రతికుంటే ఎంతో ఆనందపడేవాడు ఈరోజు. ఎందుకంటే ఎస్. ఆర్ .కళ్యాణ మండపం సినిమాలో మాకు చాలా క్లోజ్ గా ఉండేవాడు. నాతో ఎన్నోసార్లు తన మనసు విప్పి.. అసలు ఈ సినిమా ఆడుతుందా సార్.. హిట్ అవుతుందా సార్ అని అడిగేవారు. తప్పకుండా ఆడుతుందమ్మా.. తప్పకుండా పెద్ద హిట్ అవుతుందమ్మా అని నేను చెప్పేవాడిని.. అటు వాళ్ళ ఇంటికి వెళ్లినప్పుడు కానీ.. వాళ్ళ అమ్మానాన్నలను కలిసినప్పుడు కూడా.. అందరూ అడిగేవారు. అది భయమో.. భక్తో తెలియదు కానీ.. ప్రతి ఒకరికి కూడా ఈ భయం అనేది ఉంటుంది.. ఇప్పటికీ ఆ భయం మాలో కూడా ఉంది. అలా కిరణ్ వాళ్ళ అన్నయ్య గనుక ఈరోజు ఉండి ఉంటే.. ఈ సక్సెస్ చూసి మరింత ఆనందపడేవాడు.. మీ అన్నయ్య ఆశీస్సులు నీపై ఉన్నాయి అంటూ సాయికిరణ్ తెలిపారు. ప్రస్తుతం సాయికిరణ్ చేసిన కామెంట్లకు తన అన్నను తలుచుకొని కిరణ్ ఎమోషనల్ అయ్యారు.

సాయి కుమార్ అక్కడితో ఆగకుండా.. గత ఏడాది క.. ఇప్పుడు కే ర్యాంప్ .. వచ్చే ఏడాది కూడా కే ఉండేలా చూసుకో.. అందులో నేను, ఆలీ, నరేష్ మేమంతా ఉండాలి అంటూ తెలిపారు సాయి కుమార్. ప్రస్తుతం ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

కిరణ్ అబ్బవరం అన్నయ్య విషయానికి వస్తే.. 2021 డిసెంబర్ 1న కిరణ్ సోదరుడు రామాంజులు రెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించారు. కడప జిల్లా చెన్నూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రామాంజులు రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు..ఈ విషయాన్ని డిసెంబర్ 3న కిరణ్ అబ్బవరం ఎమోషనల్ అవుతూ తెలియజేశారు.