Begin typing your search above and press return to search.

ఫ్లైట్ ఎక్కిన ప్ర‌తీ సారీ ప‌క్క సీట్ వారి నెంబ‌ర్ తీసుకుంటా

ఇలాంటి టైమ్ లోనే ఆది నుంచి తాజాగా శంబాల అనే సినిమా వ‌చ్చి మంచి మౌత్ టాక్ తో బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచింది. క్రిస్మ‌స్ కానుక‌గా రిలీజైన ఈ సినిమా ఆదికి మంచి స‌క్సెస్‌ను అందించింది.

By:  Sravani Lakshmi Srungarapu   |   7 Jan 2026 1:10 PM IST
ఫ్లైట్ ఎక్కిన ప్ర‌తీ సారీ ప‌క్క సీట్ వారి నెంబ‌ర్ తీసుకుంటా
X

సాయి కుమార్ కొడుకుగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆది, ఆ త‌ర్వాత త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆది సినిమాలైతే చేస్తున్నారు కానీ రీసెంట్ టైమ్స్ లో ఆది నుంచి స‌క్సెస్ మాత్రం రాలేదు. ఇలాంటి టైమ్ లోనే ఆది నుంచి తాజాగా శంబాల అనే సినిమా వ‌చ్చి మంచి మౌత్ టాక్ తో బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచింది. క్రిస్మ‌స్ కానుక‌గా రిలీజైన ఈ సినిమా ఆదికి మంచి స‌క్సెస్‌ను అందించింది.

2026 గొప్ప‌గా స్టార్ట్ అయింది

శంబాల సినిమా స‌క్సెస్ అయిన నేప‌థ్యంలో హైద‌రాబాద్ లో చిత్ర యూనిట్ థ్యాంక్స్ మీట్ ను నిర్వ‌హించ‌గా, అందులో ప‌లువురు ప్ర‌ముఖులు పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో పాల్గొన్న‌ సాయి కుమార్ కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. శంబాల సినిమా స‌క్సెస్ ఇప్పుడే మొద‌లైంద‌ని, అది ఇక్క‌డితో ఆగ‌ద‌ని, 2026 చాలా గొప్ప‌గా స్టార్ట్ అయిందని అన్నారు.

శంబాల స‌క్సెస్ మొత్తం ఇండ‌స్ట్రీది

శంబాల స‌క్సెస్ ను ఇండ‌స్ట్రీ మొత్తం సెలబ్రేట్ చేసుకుంటుంద‌ని ఆయన చెప్పారు. తానెప్పుడూ అంద‌రూ బావుండాలి, అందులో మ‌న‌ముండాలి అనుకునే వ్య‌క్తిన‌ని, అందుకే ఇప్పుడు శంబాల స‌క్సెస్ ను కూడా అంద‌రూ సెల‌బ్రేట్ చేసుకుంటున్నార‌ని, ఈ సినిమా స‌క్సెస్ అయినందుకు ఎంతోమంది ప్ర‌ముఖులు విషెస్ తెలియ‌చేశార‌ని, మంచి కంటెంట్ ఎప్పుడూ గెలుస్తుంద‌ని ఈ సినిమాతో తెలుగు ఆడియ‌న్స్ మ‌రోసారి ప్రూవ్ చేశార‌ని అన్నారు.

అలా ఎంతోమందికి ఉద్యోగాలిప్పించా

ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఓ ఇంట్రెస్టింగ్ విష‌యాన్ని వెల్ల‌డించారు. తాను ఫ్లైట్ లో వెళ్లేట‌ప్పుడు త‌న ప‌క్క సీట్ లో ఉన్న వారి నెంబ‌ర్ తీసుకుంటాన‌ని, త‌ర్వాత రోజు ఉద‌యం నుంచే వారితో ట‌చ్ లోకి వెళ్లి మాట్లాడి, కాంటాక్ట్ లో ఉంటాన‌ని చెప్పారు. అలా ఎంతోమంది ప్ర‌ముఖుల‌ను తాను ఫ్లైట్ లోనే ప‌రిచ‌యమ‌య్యార‌ని, ప్ర‌తీ ప‌రిచ‌యం వెనుక ఓ ప‌రమార్థం ఉంటుంద‌ని, అలా ప‌రిచ‌య‌మైన ఓ వ్య‌క్తి ద్వారా తాను ఇండ‌స్ట్రీలోని ఎంతోమంది వ్య‌క్తుల‌కు ఉద్యోగాలిప్పించాన‌ని, ఆ మంచిత‌న‌మే ఇప్పుడిలా శంబాల హిట్ రూపంలో త‌మ‌కు వెన‌క్కి వ‌చ్చింద‌ని చెప్పారు. ఆది సాయి కుమార్, అర్చ‌న అయ్య‌ర్ హీరోహీరోయిన్లుగా న‌టించిన ఈ సినిమాకు యుగంధ‌ర్ ముని ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా మ‌హిధ‌ర్ రెడ్డి, రాజ‌శేఖ‌ర్ నిర్మించారు.