Begin typing your search above and press return to search.

మెగా 'సంబరాల ఏటి గట్టు' పై ఏం జరుగుతోంది

మెగా హీరో సాయి దుర్గ తేజ్‌ ప్రస్తుతం రోహిత్‌ కేపీ దర్శకత్వంలో 'సంబరాల ఏటి గట్టు' సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే.

By:  Ramesh Palla   |   9 Sept 2025 1:53 PM IST
మెగా సంబరాల ఏటి గట్టు పై ఏం జరుగుతోంది
X

మెగా హీరో సాయి దుర్గ తేజ్‌ ప్రస్తుతం రోహిత్‌ కేపీ దర్శకత్వంలో 'సంబరాల ఏటి గట్టు' సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. విరూపాక్ష వంటి సూపర్ హిట్‌ మూవీ తర్వాత మళ్లీ ఆ తరహా సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ముఖ్యంగా సాయి దుర్గ తేజ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో సంబరాల ఏటి గట్టు సినిమా ను తీసుకు వచ్చేందుకు మెగా హీరో రెడీ అవుతున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ ఇప్పటికే పూర్తి కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. ఈ ఏడాదిలోనే సినిమా విడుదల చేయాలని మేకర్స్ చాలా పట్టుదలతో ఉన్నారు. వంద కోట్లకు పైగా ఖర్చు చేసి ఈ సినిమాను రూపొందించబోతున్నట్లు మొదట్లోనే చిత్ర యూనిట్‌ సభ్యులు చెప్పారు. ఇన్ని రోజులు కార్మికుల సమ్మె కారణంగా నిలిచిపోయిన సినిమా ఇప్పుడు మొదలు కాబోతుంది.

సాయి దుర్గ తేజ్‌ కొత్త సినిమా..

ఈ నెలలో సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్‌ సంబరాల ఏటి గట్టు సినిమా కీలక యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణకు రెడీ చేస్తున్నారు. టాకీ పార్ట్‌ మొత్తం పూర్తి అయింది. ప్రస్తుతం కీలక యాక్షన్‌ సన్నివేశాలు మాత్రమే బ్యాలన్స్ ఉన్నాయి. ఆ యాక్షన్‌ సీన్స్‌ను పీటర్‌ హెయిన్స్‌ ను కొరియోగ్రఫీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో చూడని యాక్షన్‌ బ్లాక్‌ లను ఈ సినిమాలో చూపించబోతున్నారు అంటున్నారు. అంతే కాకుండా భారీ యాక్షన్‌ సన్నివేశాలతో మాస్ ఆడియన్స్‌ను సైతం ఆకర్షించే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు. సాయి దుర్గ తేజ్‌ హీరోగా సినిమా వచ్చి చాలా కాలం అయింది. ఈ గ్యాప్‌ను ఫిల్‌ చేసే విధంగా, ఇన్నాళ్లు వెయిట్‌ చేసినందుకు వర్త్‌ అనిపించే విధంగా సంబరాల ఏటి గట్టు సినిమా ఉంటుంది అని మెగా ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.

సంబరాల ఏటి గట్టు క్లైమాక్స్ షూట్‌

ఒకవైపు ఈ సినిమా యాక్షన్‌ పార్ట్‌ షూటింగ్‌కి ఏర్పాట్లు జరుగుతున్నాయి, మరో వైపు ఇప్పటికే పూర్తి అయిన సినిమా వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ను చేస్తున్నారు. మెగా హీరో సాయి దుర్గ తేజ్‌ ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో అన్నింటికి ఇది చాలా విభిన్నంగా ఉంటుంది అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. కె నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను ఇదే ఏడాది చివరి వరకు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారేమో చూడాలి. వీఎఫ్‌ఎక్స్‌ వర్క్ ఎక్కువ ఉన్న కారణంగా ఈ ఏడాదిలో విడుదల చేయడం ఎంత వరకు సాధ్యం అనే అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు. విడుదల విషయంలో ఒకటి రెండు వారాల్లో పూర్తి క్లారిటీ ఇచ్చే విధంగా ప్లాన్‌ జరుగుతున్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.

సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటి గట్టు మూవీ

యాక్షన్‌ సీన్స్‌తో పాటు, క్లైమాక్స్ సీన్‌ చిత్రీకరణ చేయడం ద్వారా సినిమా షూటింగ్‌కి గుమ్మడి కాయ కొట్టే అవకాశాలు ఉన్నాయి. చిత్ర యూనిట్‌ సభ్యుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం నిర్మాతలు ఏకంగా రూ.125 కోట్లు ఖర్చు పెట్టారని తెలుస్తోంది. రూ.100 కోట్లతో పూర్తి చేయాలి అనుకున్న ఈ సినిమా పాతిక కోట్ల బడ్జెట్‌ పెరిగి ఇప్పుడు భారీ బడ్జెట్‌ మూవీగా నిలిచింది. మంచి కంటెంట్‌తో వస్తే సినిమాలకు మంచి వసూళ్లు నమోదు అవుతున్నాయి. చిన్న సినిమాలు వంద కోట్లు, అంతకు మించి వసూళ్లు చేసిన దాఖలాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో బడ్జెట్‌ విషయంలో ఆందోళన అక్కర్లేదు అనేది కొందరి మాట. ఓటీటీ ద్వారా ఈ సినిమా భారీ బిజినెస్ చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.