Begin typing your search above and press return to search.

మెగా మేన‌ల్లుడుతో మారుతి సినిమా.. కానీ?

వంశీ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో సాయి తేజ్ హీరోగా ఓ మూవీ రానుంద‌ని, ఆ సినిమాకు డైరెక్ట‌ర్ మారుతి క‌థ‌ను అందించ‌నున్నార‌ని తెలుస్తోంది.

By:  Sravani Lakshmi Srungarapu   |   21 Sept 2025 4:00 AM IST
మెగా మేన‌ల్లుడుతో మారుతి సినిమా.. కానీ?
X

మెగా మేన‌ల్లుడు సాయి దుర్గ‌ తేజ్ న‌టిస్తున్న తాజా సినిమా సంబ‌రాల ఏటి గ‌ట్టు. రోహిత్ కేపీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్ష‌న్ డ్రామాలో ఐశ్వ‌ర్య ల‌క్ష్మి హీరోయిన్ గా న‌టిస్తున్నారు. సంబ‌రాల ఏటి గ‌ట్టు మూవీని సెప్టెంబ‌ర్ 25న రిలీజ్ చేస్తామ‌ని మేక‌ర్స్ ముందు చెప్పినప్ప‌టికీ ఆ త‌ర్వాత ప‌లు కార‌ణాల వ‌ల్ల సినిమాను పోస్ట్‌పోన్ చేస్తున్న‌ట్టు క్లారిటీ ఇచ్చారు.

సాయి దుర్గ తేజ్ సినిమా వ‌చ్చి చాలా కాలమ‌వుతున్న నేప‌థ్యంలో ఈ సినిమా వాయిదా ప‌డ‌టంతో అత‌ని ఫ్యాన్స్ నిరాశ‌కు గుర‌య్యారు. అయితే సంబ‌రాల ఏటి గ‌ట్టు వాయిదా ప‌డినా, ఆ డిజ‌ప్పాయింట్‌మెంట్ ను బ్యాలెన్స్ చేయ‌డానికి ఇప్పుడో క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. సాయి దుర్గ తేజ్ ఓ క్రేజీ సినిమాను లైన్ లో పెట్టార‌ని టాలీవుడ్ స‌ర్కిల్స్ లో టాక్.

క్రేజీ కాంబినేష‌న్ ను సెట్ చేసిన సాయి తేజ్

వంశీ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో సాయి తేజ్ హీరోగా ఓ మూవీ రానుంద‌ని, ఆ సినిమాకు డైరెక్ట‌ర్ మారుతి క‌థ‌ను అందించ‌నున్నార‌ని తెలుస్తోంది. రీసెంట్ గా మిరాయ్ తో సూప‌ర్ హిట్ ను అందుకున్న పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ క్రేజీ ప్రాజెక్టును నిర్మించ‌నుంద‌ని అంటున్నారు. సాయి తేజ్ తో మారుతికి ప్ర‌తీ రోజూ పండ‌గే టైమ్ నుంచే మంచి బాండింగ్ ఏర్ప‌డ‌గా, ఆ అనుబంధంతోనే తేజ్ కు మారుతి ఓ క‌థ చెప్పార‌ని, ఆ క‌థ న‌చ్చ‌డంతో సాయి తేజ్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని తెలుస్తోంది.

గాంజా శంక‌ర్ పై పెరుగుతున్న అనుమానాలు

ఇదిలా ఉంటే సాయి తేజ్ సంబ‌రాల ఏటిగ‌ట్టు తో పాటూ గ‌తంలో సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో గాంజా శంక‌ర్ సినిమాను కూడా అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. కానీ ఆ సినిమా టైటిల్ వివాదాస్ప‌దంగా ఉంద‌ని మరియు ప‌లు కార‌ణాల వ‌ల్ల దాని గురించి త‌ర్వాత ఎలాంటి అప్డేట్స్ రాలేదు. మ‌ధ్య‌లో ఓదెల2 ప్ర‌మోష‌న్స్ లో ఈ సినిమా గురించి అడిగినా సంప‌త్ నంది ఆ మూవీపై ఏ స్ప‌ష్ట‌తా ఇవ్వ‌క‌పోవ‌డంతో అస‌లు గాంజా శంక‌ర్ ఉంటుందా లేదా అని డౌట్ గా మారింది. చూస్తుంటే సంబ‌రాల ఏటిగ‌ట్టు త‌ర్వాత సాయి తేజ్ చేయ‌బోయే మూవీ వంశీ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలోనే అనిపిస్తోంది.