Begin typing your search above and press return to search.

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

మెగా హీరో సాయి దుర్గ తేజ్, కిరణ్మయి నిశ్చితార్థం నవంబర్ 5న హైదరాబాద్‌లోని హిల్టన్ జీనోమ్ వ్యాలీ రిసార్ట్‌లో జరిగింది. ఈ వేడుకకు చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్‌తో పాటు కొణిదెల, అల్లు కుటుంబ సభ్యులు హాజరై జంటను ఆశీర్వదించారు. సన్నిహితులు, సినీ ప్రముఖులు కూడా వేడుకలో పాల్గొన్నారు. ఈ జంట డిసెంబర్ 10న హైదరాబాద్‌లో వివాహ బంధంలోకి అడుగుపెట్టనుంది.

By:  Priya Chowdhary Nuthalapti   |   5 Nov 2026 9:46 PM IST
అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!
X

మెగా కుటుంబంలో మరో శుభకార్యం జరిగింది. నటుడు సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం గురువారంనవంబర్ 5, 2026.. హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని హిల్టన్ హైదరాబాద్ జీనోమ్ వ్యాలీ రిసార్ట్‌లో ఈ వేడుకను నిర్వహించారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ జంట కొత్త జీవితానికి తొలి అడుగు వేసింది.

సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థ వేడుకకు కొణిదెల, అల్లు కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సాయి దుర్గ తేజ్ తల్లిదండ్రులు డాక్టర్ శివప్రసాద్, విజయదుర్గ, సోదరుడు వైష్ణవ్ తేజ్ ఈ వేడుకలో పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి, సురేఖ కొణిదెల, రామ్ చరణ్ కూడా హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. ఇక ఈ అమ్మాయి గురించి సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తున్నారు. కాగా ఈ అమ్మాయి పూర్తి పేరు కిరణ్మయి అని తెలుస్తోంది. సాయి దుర్గ కేష్ కి ఎన్నో రోజుల నుంచి స్నేహితురాలు అని.. స్నేహమే ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లికి దారి తీసినట్లు తెలుస్తోంది.

ఇక అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డితో కలిసి ఈ వేడుకకు వచ్చారు. అల్లు బాబీ, నీలా షా, వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, వారి కుమారుడు వాయువ తేజ్ కూడా నిశ్చితార్థంలో సందడి చేశారు. నాగబాబు, పద్మజ, నిహారిక కొణిదెల, అల్లు అరవింద్, అల్లు నిర్మల, అల్లు శిరీష్, నయనికా రెడ్డి కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. అకీరా నందన్, ఆద్య కూడా ఈ కుటుంబ వేడుకకు హాజరయ్యారు.

సాయి దుర్గ తేజ్ నిశ్చితార్థానికి కుటుంబ సభ్యులతో పాటు పలువురు స్నేహితులు, సినీ ప్రముఖులు కూడా వచ్చారు. మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డి, నవీన్ విజయకృష్ణ, హర్ష చెముడు, వెంకీ కుడుముల, నవదీప్, హర్షిత్ రెడ్డి ఈ వేడుకలో పాల్గొన్నారు.

ఇక సాయి దుర్గ తేజ్, కిరణ్ వివాహం డిసెంబర్ 10, 2026న హైదరాబాద్‌లో జరగనుంది.