పెళ్లయ్యాకే మెగా మేనల్లుడి నెక్స్ట్ మూవీ!
మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్ లైఫ్ లో త్వరలోనే కొత్త ఛాప్టర్ మొదలుకానుందా? ప్రస్తుతం టాలీవుడ్ లో వినిపిస్తున్న పెళ్లి వార్తలు చూస్తుంటే అదే నిజమనిపిస్తోంది.
By: M Prashanth | 20 Oct 2026 8:03 PM ISTమెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్ లైఫ్ లో త్వరలోనే కొత్త ఛాప్టర్ మొదలుకానుందా? ప్రస్తుతం టాలీవుడ్ లో వినిపిస్తున్న పెళ్లి వార్తలు చూస్తుంటే అదే నిజమనిపిస్తోంది. మరికొన్ని రోజుల్లో ఆయన పెళ్లి జరగనుందని ప్రచారం సాగుతోంది. అదే సమయంలో ఆయన ఇప్పుడు నటిస్తున్న సంబరాల ఏటిగట్టు సినిమా 2027 సంక్రాంతికి విడుదల కానుంది. దీంతో పెళ్లి తర్వాతే సాయి దుర్గా తేజ్ నెక్స్ట్ మూవీ థియేటర్లలోకి రానుందనే ఇంట్రెస్టింగ్ డిబేట్ మొదలైంది.
నిజానికి సాయి దుర్గా తేజ్ పెళ్లి గురించి కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు నవంబర్ 5న ఎంగేజ్మెంట్ జరగనుందనే టాక్ నడుస్తోంది. పెళ్లి కూడా అదే నెలలో ఉంటుదని కూడా వినికిడి. అయితే దీనిపై మెగా కుటుంబం నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. మ్యారేజ్ డేట్ తోపాటు వధువు వివరాలపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
ఇక కెరీర్ విషయానికి వస్తే.. సాయి దుర్గా తేజ్ నుంచి కొత్త సినిమా వచ్చి చాలా కాలమైంది. 2023లో విరూపాక్ష, బ్రో సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన.. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు మరో చిత్రాన్ని విడుదల చేయలేదు. కొన్ని నెలల క్రితం రోడ్డు ప్రమాదం జరగడం, ఇప్పుడు చేస్తున్న సినిమా కోసం ఎక్కువ సమయం కేటాయించడంతో చాలా గ్యాప్ వచ్చింది. ప్రస్తుతం ఆయన ఆశలన్నీ సంబరాల ఏటిగట్టు సినిమాపైనే ఉన్నాయి.
దర్శకుడు రోహిత్ కేపీ తెరకెక్కిస్తున్న ఆ చిత్రంలో సాయి దుర్గ తేజ్ కొత్త లుక్ లో కనిపించనున్నారు. భారీ యాక్షన్ సీన్స్ తో రూపొందుతున్న ఆ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయడానికి మూవీ టీమ్ రెడీ అవుతోంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ అయింది. ప్రస్తుతం విడుదలకు ముందు చేయాల్సిన పనులు కొనసాగుతున్నాయి. ఆ సినిమాను 2027 జనవరి 12న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు.
సంక్రాంతి బరిలో నిలవనున్న ఆ చిత్రంపై తేజ్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. చాలా కాలం తర్వాత ఆయన నుంచి వస్తున్న సినిమా కావడంతో ఆడియన్స్ లో మంచి హైప్ ఉంది. అయితే సాయి దుర్గ తేజ్ పెళ్లి వార్తలు, సినిమా విడుదల మధ్య ఆసక్తికరమైన విషయం కనిపిస్తోంది. నవంబర్ లో పెళ్లి జరిగితే.. రెండు నెలల వ్యవధిలోనే సంబరాల ఏటి గట్టు మూవీ థియేటర్లలోకి రానుంది.
అంటే పర్సనల్ లైఫ్ లో న్యూ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయనున్నారన్నమాట. అందుకే పెళ్లి తర్వాతే మెగా మేనల్లుడి నెక్స్ట్ మూవీ రాబోతోందనే చర్చ మొదలైంది. అయితే పెళ్లి వార్తలపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉండగా, సినిమా విడుదల తేదీ మాత్రం ఫిక్స్ అయింది. మరి ఇప్పుడు వార్తలే నిజమేతై.. పెళ్లి సందడి తర్వాత సంక్రాంతి బరిలోకి దిగనున్న సాయి దుర్గా తేజ్.. సంబరాల ఏటిగట్టు మూవీతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో అంతా వేచి చూడాలి.
