Begin typing your search above and press return to search.

అసుర ఆగమనం.. గ్లింప్స్ తోనే కిక్కిచ్చిన సాయి ధరమ్ తేజ్!

మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ బ్రో సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకున్న విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   15 Oct 2025 1:17 PM IST
అసుర ఆగమనం.. గ్లింప్స్ తోనే కిక్కిచ్చిన సాయి ధరమ్ తేజ్!
X

మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ బ్రో సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకున్న విషయం తెలిసిందే. నటుడిగా ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించే ప్రయత్నంలో ఉన్నట్లు అర్ధమవుతుంది. విరుపాక్ష మొదటిసారి అతని మార్కెట్ ను వంద కోట్లకు చేర్చింది. ఇక నెక్స్ట్ రాబోయే సంబరాల ఏటి గట్టు మరింత కొత్తగా ఉండనున్నట్లు తెలుస్తోంది. పుట్టినరోజు సందర్భంగా పాన్ ఇండియా లాంగ్వేజెస్ లో రిలీజ్ అయిన 'సంబరాల ఏటి గట్టు' గ్లింప్స్ ఇప్పుడు టాలీవుడ్‌లో కొత్త చర్చకు దారి తీసింది.

ఈ గ్లింప్స్ చూస్తుంటే, సాయి ధరమ్ తేజ్ నెవ్వర్ బిఫోర్ అనేలా ఒక రా అండ్ ఇంటెన్స్ పాత్రలో కనిపించబోతున్నాడని స్పష్టమవుతోంది. 'అసుర ఆగమనం' పేరుతో వచ్చిన ఈ గ్లింప్స్, సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. ​సాయి ధరమ్ తేజ్ కెరీర్‌లో ఈ సినిమా ఒక కీలకమైన ప్రాజెక్ట్ కాబోతోంది. "ఒక మనిషి, ఒక భూమి, వాటిని బలంగా బంధించే రక్తం అలాగే బంధం." అనే కోట్‌తో విడుదలైన ఈ గ్లింప్స్, హీరో పాత్రకు, ఆ భూమికి, రక్త సంబంధానికి ఉన్న బలమైన బంధాన్ని సూచిస్తోంది.

ఈ విజువల్స్ టెక్నికల్‌గా చాలా రిచ్‌గా కనిపిస్తున్నాయి. దర్శకుడు రోహిత్ కె.పి. ఈ సినిమాను ఒక విలేజ్ యాక్షన్ డ్రామాగా డిజైన్ చేస్తున్నప్పటికీ, అంతకుమించి అనేలా చూపించే ప్రయత్నం చేశారని అర్థమవుతోంది. ​'సంబరాల ఏటి గట్టు' గ్లింప్స్ చూస్తుంటే, సాయి ధరమ్ తేజ్ ఒక అసురుడి తరహాలో, భయంకరమైన లుక్‌లో కనిపిస్తున్నాడు. అతని కళ్లు, బాడీ లాంగ్వేజ్ చాలా ఇంటెన్స్‌గా ఉన్నాయి.

అసుర ఆగమనం అంటూ ఒకే ఒక్క డైలాగ్ తో కిక్కిచ్చాడు. ఈ సినిమాలో హీరో పాత్రకు యాంగ్రీ ఎమోషన్ చాలా బలంగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. సినిమాలోని కొన్ని విజువల్స్ చాలా కొత్తగా, హై క్వాలిటీతో ఉన్నాయి. ముఖ్యంగా, భారీ యాక్షన్ సన్నివేశాలు, భయంకరమైన బ్యాక్‌డ్రాప్ చూస్తుంటే, ఇది కేవలం యాక్షన్ ఫిల్మ్ మాత్రమే కాదు, బలమైన ఎమోషన్ కూడా ఉన్న కథ అని అనిపిస్తోంది.

​ఈ సినిమాకు ఉన్న యాక్షన్ డ్రామాతో పాటు, ఎమోషన్ గనుక బలంగా క్లిక్ అయితే, 'సంబరాల ఏటి గట్టు' లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి రిజల్ట్స్ అందుకునే అవకాశం ఉంటుంది. దర్శకుడు రోహిత్, ఒక డిఫరెంట్ కథాంశాన్ని ఎంచుకున్నారని, దానికి తగ్గట్టుగా సాయి ధరమ్ తేజ్‌ను ఒక రస్టిక్ మాస్ పాత్రలో చూపించబోతున్నారని స్పష్టమవుతోంది. ఈ గ్లింప్స్ చూసిన తర్వాత, సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

​ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుండటంతో, ప్రొడక్షన్ వాల్యూస్‌కు ఎక్కడా రాజీ పడలేదని అర్థమవుతోంది. ఐశ్వర్య లక్ష్మి వంటి నటి ఇందులో భాగం కావడం కూడా సినిమాపై అదనపు బలం. గ్లింప్స్ విడుదలైన తర్వాత, సాయి ధరమ్ తేజ్ ఫ్యాన్స్ నుంచి, అలాగే సాధారణ ప్రేక్షకుల నుంచి మంచి రియాక్షన్స్ అందుతున్నాయి. మొత్తానికి, 'సంబరాల ఏటి గట్టు' ఒక మామూలు సినిమా కాదని, సాయి ధరమ్ తేజ్ కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ అయ్యే అవకాశం ఉందని చెప్పవచ్చు.