Begin typing your search above and press return to search.

తేజ్ సినిమా ఇంత సీక్రెట్ ఏంటో..?

మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ ప్రస్తుతం చేస్తున్న సినిమా సంబరాల యేటిగట్టు. రోహిత్ డైరెక్షన్ లో పీరియాడికల్ మూవీగా ఈ సినిమా వస్తుంది.

By:  Ramesh Boddu   |   24 Aug 2025 2:00 PM IST
తేజ్ సినిమా ఇంత సీక్రెట్ ఏంటో..?
X

మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ ప్రస్తుతం చేస్తున్న సినిమా సంబరాల యేటిగట్టు. రోహిత్ డైరెక్షన్ లో పీరియాడికల్ మూవీగా ఈ సినిమా వస్తుంది. సినిమా అనౌన్స్ మెంట్ గ్లింప్స్ తోనే సినిమాపై అంచనాలు పెంచారు మేకర్స్. ఈ మూవీని ప్రైం షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. తేజ్ ఈ సినిమాతో మాస్ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. సాయి ధరం తేజ్ సంబరాల యేటిగట్టు సినిమాలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తుంది.

సంబరాల యేటిగట్టు సినిమా..

ఐతే ఈ సినిమా షూటింగ్ ఎక్కడ వరకు వచ్చిందో ఇప్పటివరకు రివీల్ చేయలేదు. తేజ్ అడపాదడపా ఏదో ఒక సినిమా ఈవెంట్ లో కనిపిస్తున్నాడు కానీ సినిమా గురించి నోరు విప్పలేదు. అసలు సంబరాల యేటిగట్టు సినిమా అప్డేట్స్ లేవేంటి.. సినిమా ఎంతవరకు వచ్చింది అంటూ మెగా ఫ్యాన్స్ అడుగుతున్నారు. ఐతే తేజ్ సినిమా సైలెంట్ కి రీజన్ వెనక పెద్ద ప్లాన్ ఉందని టాక్.

సినిమా పీరియాడికల్ మూవీగా రోహిత్ మంచి కంటెంట్ తో చేస్తున్నారట. సినిమాలో తేజ్ లుక్స్ ఇంకా యాక్షన్ కూడా సంథింగ్ స్పెషల్ గా ఉంటుందని తెలుస్తుంది. సంబరాల యేటి గట్టు సినిమా లాస్ట్ ఇయర్ అనౌన్స్ మెంట్ టైం లో ఈ ఇయర్ దసరా రిలీజ్ అని చెప్పారు. కానీ సినిమా ఇప్పుడు ఆ డేట్ కి రావట్లేదు. అసలు సినిమా ఎంతవరకు వచ్చింది అన్నది కూడా తెలియలేదు.

సాయి తేజ్ అంచనాలను అందుకుంటేనే..

తేజ్ ఈసారి తన మాస్ స్ట్రెంగ్త్ చూపించాలని చూస్తున్నాడు. బ్రో తర్వాత తేజ్ సంబరాల యేటిగట్టు సినిమా చేస్తుంది. తప్పకుండా ఈ మూవీ అంచనాలను అందుకుంటేనే సాయి తేజ్ కి మంచి పుష్ ఇస్తుంది. ఈ సినిమా తర్వాత తేజ్ తో మారుతి సినిమా ఉంటుందని టాక్. ఐతే అది మారుతి డైరెక్షన్ లో కాదు మారుతి కథ అందిస్తే కొత్త దర్శకుడు ఆ సినిమా డైరెక్ట్ చేస్తాడని అంటున్నారు.

మెగా హీరోల్లో చిరు, పవన్, రామ్ చరణ్, అల్లు అర్జున్ తర్వాత అత్యంత ప్రేక్షకాదరణ, అభిమానుల మనసులు గెలిచిన హీరో తేజ్. అతని కెరీర్ లో మంచి స్పీడ్ మీద ఉన్నప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగింది. దాని వల్ల రెండేళ్లు తేజ్ వెనక్కి వెళ్లాడు. బ్రో తర్వాత సినిమా కథల ఎంపికల్లో కూడా తేజ్ ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. సాయి తేజ్ సంబరాల యేటిగట్టు సినిమా అతని కెరీర్ కి మంచి బూస్టింగ్ ఇస్తుందని అంటున్నారు. మరి అది జరుగుతుందా లేదా అన్నది సినిమా వస్తేనే తెలుస్తుంది.