Begin typing your search above and press return to search.

తేజ్ 'క'త్తిలాంటి ప్లాన్.. నెక్స్ట్ లెవెల్..!

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సంబరాల యేటిగట్టి సినిమా చేస్తున్నాడు. పీరియాడికల్ యాక్షన్ మూవీగా రాబోతున్న ఆ సినిమా గురించి ఇండస్ట్రీ సర్కిల్స్ లో భారీ బజ్ క్రియేట్ అయ్యింది.

By:  Ramesh Boddu   |   31 Oct 2025 1:15 PM IST
తేజ్ కత్తిలాంటి ప్లాన్.. నెక్స్ట్ లెవెల్..!
X

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సంబరాల యేటిగట్టి సినిమా చేస్తున్నాడు. పీరియాడికల్ యాక్షన్ మూవీగా రాబోతున్న ఆ సినిమా గురించి ఇండస్ట్రీ సర్కిల్స్ లో భారీ బజ్ క్రియేట్ అయ్యింది. నూతన దర్శకుడు రోహిత్ ఈ సినిమాను చాలా పెద్ద ప్లానింగ్ తోనే తెరకెక్కిస్తున్నాడని టాక్. సినిమాలో హీరోయిన్ గా ఐశ్వర్య లక్ష్మి నటిస్తుంది. ఆమెకు కూడా సినిమాలో చాలా బలమైన రోల్ ఉంటుందట. సంబరాల యేటిగట్టి తర్వాత తేజ్ ఒక క్రేజీ కాంబినేషన్ ని సెట్ చేస్కున్నాడని తెలుస్తుంది.

దర్శక ద్వయం సందీప్, సుజిత్ లతో సాయి తేజ్..

క సినిమాతో కిరణ్ అబ్బవరం కి సూపర్ హిట్ ఇచ్చిన దర్శక ద్వయం సందీప్, సుజిత్ లతో సాయి తేజ్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. తేజ్ తో ఇప్పటికే స్టోరీ డిస్కషన్స్ పూర్తయ్యాయట. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతుందని అంటున్నారు. తేజ్ కూడా డిఫరెంట్ కథలతోనే ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయాలని చూస్తున్నాడు. బ్రో తర్వాత తేజ్ కాస్త గ్యాప్ తీసుకుని సంబరాల యేటిగట్టు చేస్తున్నాడు.

ఆ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుండగా ఇప్పుడు క డైరెక్టర్స్ తో సినిమా లాక్ చేసుకుంటున్నాడని తెలుస్తుంది. క తో డైరెక్టర్స్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న సందీప్, సుజిత్ తమ సెకండ్ అటెంప్ట్ కూడా ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. తప్పకుండా తేజ్ తో ఈ ఇద్దరు చేసే ప్రయత్నం నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని అంటున్నారు. క తర్వాత మరో కత్తిలాంటి కథతో సాయి తేజ్ తో సినిమాకు రెడీ అవుతున్నారు సందీప్, సుజిత్.

రాజ్ అండ్ డీకే దర్శక ద్వయం వెబ్ సీరీస్ లతో..

బాలీవుడ్ లో ఎలా అయితే రాజ్ అండ్ డీకే దర్శక ద్వయం వెబ్ సీరీస్ లతో తమ టార్గెట్ ని పెంచుకుంటూ వెళ్తున్నారో క తో సక్సెస్ అందుకున్న సందీప్, సుజిత్ కూడా ఒక కథను అనుకుని ఇద్దరు మంచి కో ఆర్డినేషన్ తో సినిమా చేస్తున్నారు. క తీసిన విధానం చూస్తేనే వాళ్ల ఇద్దరి మధ్య ఎంత సింక్ ఉందో అర్థమైంది. సో ఎస్.వై.జి తర్వాత తేజ్ ఒక మంచి కాంబోని సెట్ చేసుకున్నాడని మెగా ఫ్యాన్స్ కూడా ఖుషిగా ఉన్నారు.

తేజ్ కూడా సినిమాల వేగం పెంచుతున్నాడు. సంబరాల యేటిగట్టు రిలీజ్ కాగానే క డైరెక్టర్స్ తో సినిమా వెంటనే మొదలు పెట్టబోతున్నాడట. నెక్స్ట్ సినిమా గురించి కూడా స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయని తెలుస్తుంది. క డైరెక్టర్స్ తో తేజ్ చేసే సినిమా కూడా అడ్వెంచర్ స్టోరీ అని తెలుస్తుంది. సో ఆడియన్స్ కి మరోసారి ఒక థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చేందుకు సందీప్, సుజిత్ విత్ సాయి ధరం తేజ్ రెడీ అవుతున్నారని చెప్పొచ్చు. ఐతే ఈ ప్రాజెక్ట్ లో మిగతా స్టార్ కాస్ట్ తో పాటు టెక్నికల్ టీం గురించి కూడా త్వరలో ఒక అనౌన్స్ మెంట్ వస్తుందని తెలుస్తుంది.