మెగా మేనల్లుడు కోసం రంగంలోకి మారుతి!
మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ `విరూపాక్ష` సక్సస్ అనంతరం సెలక్టివ్ గా వెళ్తోన్న సంగతి తెలిసిందే.
By: Srikanth Kontham | 18 Aug 2025 1:08 PM ISTమెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ `విరూపాక్ష` సక్సస్ అనంతరం సెలక్టివ్ గా వెళ్తోన్న సంగతి తెలిసిందే. కంగారు పడి కథలకు కనెక్ట్ అవ్వకుండా ఆచితూచి ఎంచుకుంటున్నాడు. ఈ ప్రోసస్ లోనే కొత్త సినిమాలు రిలీజ్ ఆలస్యమవుతుంది. ప్రస్తుతం కే.పి రోహిత్ అనే కొత్త కుర్రాడితో `సంబరాల ఏటిగట్టు` లో నటిస్తు న్నాడు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్నచిత్రమిది. ఇప్పటికే చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. వీలైనంత త్వరగా మిగతా పనులు కూడా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని చూస్తున్నారు.
బ్యాకెండ్ అంతా మారుతినే:
ఈ నేపథ్యంలో తదుపరి మెగా మేనల్లుడు ఏ దర్శకుడితో పని చేస్తాడు? అన్నది చర్చగా మారింది. దీంతో సాయితేజ్ అప్పుడే ఓ డైరెక్టర్నిసిద్దం చేసినట్లు తెలుస్తోంది. `టైగర్ నాగేశ్వరరావు` తో డైరెక్టర్ గా పరిచయ మైన వంశీతో ఫిక్సైనట్లు తెలుస్తోంది. ప్లాప్ డైరెక్టర్ తో సినిమా ఏంటి? అనే సందేహం సహజం. కథ పరంగా టైగర్ నాగేశ్వరరావు ఫెయిలైంది తప్ప మేకింగ్ పరంగా కాదు. ఈ నేపథ్యంలో సాయితేజ్ సినిమాకు మారుతి కథ, కథనాలు అందించేలా రెడీ చేసిపెట్టినట్లు తెలిసింది. కథ, కథనాలతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ కూడా మారుతి చూసుకుంటాడుట.
ప్లాప్ తర్వాత అవకాశాలకు దూరంగా:
అలాగే మారుతినే స్వయంగా నిర్మించడానికి సిద్దమవుతన్నాడుట. అలా ముగ్గురు మధ్య ఒప్పందం జరిగినట్లు తెలిసింది. మారుతితో ఇప్పటికే సాయితేజ్ `పండగ చేస్కో` చిత్రం చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా బాగానే ఆడింది. ఆ తర్వాత మళ్లీ ఇద్దరు చేతులు కలపలేదు. మళ్లీ ఈ రకంగా ఆ కాంబో సాధ్య మవుతుంది. వంశీ విషయానికి వస్తే? టైగర్ నాగేశ్వరరావు ప్లాప్ తర్వాత మరో అవకాశం రాలేదు.
త్వరలోనే అధికారికంగా:
రవితేజ హీరోగా నటించిన `టైగర్ నాగేశ్వరరావు` కథ, కథనాలు రోటీన్ గా ఉండటంతో? బాక్సాఫీస్ వద్ద తేలి పోయింది. భారీ అంచనాలు తారుమారయ్యాయి. అవకాశాలు దూరమయ్యాయి. మళ్లీ మారుతి- సాయితేజ్ కారణంగా సెకెండ్ ఛాన్స్ దక్కుతుంది. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అధికారిక వివరాలు త్వరలో ప్రకటించే అవకాశం ఉందని సన్నిహిత వర్గాల నుంచి తెలిసింది.
