మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!
మెగా అభిమానులకు మరో గుడ్ న్యూస్ వచ్చేసింది. మెగా కుటుంబంలో మరోసారి పెళ్లి సందడి మొదలుకాబోతోంది.
By: Priya Chowdhary Nuthalapti | 2 Nov 2026 3:19 PM ISTమెగా అభిమానులకు మరో గుడ్ న్యూస్ వచ్చేసింది. మెగా కుటుంబంలో మరోసారి పెళ్లి సందడి మొదలుకాబోతోంది. మెగా కాంపౌండ్ హీరో సాయి ధరమ్ తేజ్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడనే వార్త గత కొద్ది రోజుల నుంచి వినిపిస్తున్న సంగతి తెలిసిందే. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఆయన పెళ్లి విషయంపై తాజాగా కొన్ని కీలక వివరాలు బయటకు రావడం విశేషం.
సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థ వేడుక నవంబర్ 5న జరగనున్నట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుకను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక డిసెంబర్లో హైదరాబాద్లోనే పెళ్లి జరగనుందని తెలుస్తోంది. అయితే ఈ విషయాలపై సాయి ధరమ్ తేజ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
సాధారణంగా మెగా కుటుంబంలో జరిగే పెళ్లిళ్లు ఎంతో సందడిగా ఉంటాయి. మరి ఈ పెళ్లి కూడా అంతే సందడితో జరుగుతుందా అనే విషయం చూడాలి. కానీ ఈ హీరో పెళ్లి చేసుకునే అమ్మాయి ఎవరు? పెళ్లి ఎక్కడ జరగనుంది? వంటి వివరాలను ఇంకా అధికారికంగా చెప్పలేదు.
గతంలో సాయి ధరమ్ తేజ్ తన పెళ్లి 2026లో జరుగుతుందని చెప్పిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా గతంలో ప్రేమ విషయంలో ఎదురైన ఇబ్బందుల కారణంగా తాను కొంతకాలం బాధపడ్డానని కూడా వెల్లడించారు. ఇక ఎన్ని సంవత్సరాలకే ఫైనల్ గా ఆయన పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైపోయారు. ఇక త్వరలోనే ఈ హీరో స్వయంగా పెళ్లి వివరాలను ప్రకటిస్తారని అందరూ ఎదురుచూస్తున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం సంబరాల ఏటి గట్టు సినిమాతో బిజీగా ఉన్నారు. రోహిత్ కె.పి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి 2027 సందర్భంగా విడుదల కానుంది. ఇది ఆయన కెరీర్లోనే భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతోంది. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
అలాగే దర్శకుడు తేజతో మరో సినిమాను కూడా ప్రకటించారు. వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది అని తెలుస్తోంది. మరి పెళ్లయిన వెంటనే ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అవుతారా .. లేకపోతే కొద్ది రోజులే తర్వాత ఈ సినిమా మొదలవుతుందా అనే విషయం కూడా తెలియాల్సి ఉంది.
