సాయి తేజ్ లవ్ స్టోరీలో 'మోసం'? పేరెందుకు వద్దులే!
టాలీవుడ్ సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ సినిమాలతోనే కాకుండా తన రియల్ లైఫ్ సరదా కబుర్లతోనూ ఎప్పుడూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటారు.
By: Sivaji Kontham | 22 Sept 2026 7:46 PM ISTటాలీవుడ్ సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ సినిమాలతోనే కాకుండా తన రియల్ లైఫ్ సరదా కబుర్లతోనూ ఎప్పుడూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటారు. తాజాగా ఒక సినిమా ప్రమోషన్స్ సందర్భంగా అతిథిగా ఈవెంట్ కి హాజరైన అతడు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కాలేజ్ రోజులనాటి లవ్ స్టోరీ గురించి పలు ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ సాయి తేజ్ చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ ఇంటర్వ్యూలో భాగంగా హోస్ట్ అడిగిన ఒక ప్రశ్నకు సాయిధరమ్ తేజ్ ఇచ్చిన సమాధానం అందరినీ ఆశ్చర్యపరిచింది. మీ కాలేజ్ జీవితంలో క్రష్ ఎవరో పేరు చెబుతారా? అని హోస్ట్ అడగ్గా, ``పేరెందుకులేండి`` అంటూ నవ్వుతూ ఆ విషయాన్ని సున్నితంగా దాటవేశారు. అయితే మీ లవ్ స్టోరీకి ఒక టైటిల్ పెట్టాలంటే ఏం పెడతారు? అని ప్రశ్నించినప్పుడు.. సాయి తేజ్ ఏమాత్రం ఆలోచించకుండా `మోసం`అనే టైటిల్ ని చెప్పడం అందరినీ అవాక్కయ్యేలా చేసింది.
అయితే సాయి తేజ్ సరదాగా నవ్వేస్తూ ఈ విషయాలు చెప్పినా ఇది అతడి నిజ జీవిత అనుభవం. సరిగ్గా ఐదారేళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో తాను ప్రేమలో ఎలా మోసపోయాడో చెప్పుకొచ్చారు. నాటి త్రోబ్యాక్ ఇంటర్వ్యూ డీటెయిల్స్ లోకి వెళితే.. అసలు ఆ లవ్ స్టోరీ వెనుక ఉన్న అసలు సంగతి ఏంటో చెబుతూ సాయి ధరమ్ తన కాలేజ్ రోజులను గుర్తుచేసుకున్నారు. అప్పట్లో తన కాలేజ్ జీవితంలో అచ్చం `ప్రేమదేశం` సినిమాను తలపించేలా ఒక సంఘటన జరిగిందని తెలిపారు. తన క్లోజ్ ఫ్రెండ్ ఒక అమ్మాయిని ప్రేమించాడని.. అయితే ఆ తర్వాత ఆ అమ్మాయి తనను కూడా ఇష్టపడుతున్న విషయం తెలిసిందని తెలిపారు. ఆ పరిస్థితుల కారణంగా తాను కూడా ఆ అమ్మాయితో ప్రేమలో పడాల్సి వచ్చిందని.. ఇది చివరికి ఫ్రెండ్స్ మధ్య అలాగే ఇద్దరి వైపు నుంచి ఒక చిన్న మోసానికి దారితీసిందని సరదాగా వివరించారు.
అయితే తనను ఆ విధంగా మోసం చేసిన ఆ గర్ల్ ఫ్రెండ్ లేదా ఆ అమ్మాయి ఎవరు అనే దాని గురించి మాత్రం అతడు ఎలాంటి పేర్లు వెల్లడించలేదు. కేవలం ఆ జ్ఞాపకాన్ని ఒక సరదా అనుభవంగా అందరితో షేర్ చేసుకున్నారు. అపరిపక్వ దశలో ఉండే బాల్యం- కాలేజ్ రోజుల్లో ఇలాంటి సంఘటనలు సహజమేనని.. అప్పట్లో ఇదొక పెద్ద క్లైమాక్స్ లా అనిపించేదని సాయి తేజ్ నవ్వుతూ చెప్పారు. నేటితరం నటీనటులతో రూపొందించిన `తెల్లకాగితం` అనే సినిమా ప్రమోషన్స్ లో సాయిధరమ్ ఈ విధంగా వ్యాఖ్యానించారు.
సాయి ధరమ్ ఇప్పటికీ ఎప్పటికీ తన రిలేషన్‌షిప్స్ పై ఎప్పుడూ ఓపెన్‌గానే ఉంటారు. తన కాలేజ్ నాటి లవ్ స్టోరీకి `మోసం` అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టి ఆనాటి జ్ఞాపకాలను ఆయన రీకాల్ చేసిన తీరు అభిమానులలో ఇప్పుడు మరోసారి చర్చగా మారింది. తమ ఫేవరెట్ హీరోకి ఇలాంటి పరిస్థితి ఎదురైందా? అంటూ ఫ్యాన్స్ ఆవేదన చెందుతున్నారు. సాయి తేజ్ నటించిన `సంబరాల ఏటిగట్టు` చిత్రం విడుదలకు రావాల్సి ఉంది.
