Begin typing your search above and press return to search.

నా లవ్ బ్రేకప్.. కట్టప్ప వాడే: సాయి ధరమ్ తేజ్

​సాధారణంగా ఈవెంట్లలో ఒకరినొకరు పొగుడుకుంటారు కానీ, ఇక్కడ మాత్రం సాయి ధరమ్ తేజ్ డైరెక్ట్ గా రామ్ అబ్బరాజుపై కంప్లైంట్స్ మొదలుపెట్టారు.

By:  M Prashanth   |   12 Feb 2026 6:03 PM IST
నా లవ్ బ్రేకప్.. కట్టప్ప వాడే: సాయి ధరమ్ తేజ్
X

టాలీవుడ్ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఎప్పుడూ చాలా సరదాగా ఉంటారు. స్టేజ్ మీద ఉన్నది తన ఫ్రెండ్స్ అయితే చాలు, అస్సలు మొహమాటం లేకుండా పాత విషయాలన్నీ బయట పెట్టేస్తుంటారు. తాజాగా యంగ్ హీరో సుహాస్ నటిస్తున్న ‘హే భగవాన్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు గెస్టులుగా వచ్చిన సాయి ధరమ్ తేజ్, దర్శకుడు రామ్ అబ్బరాజు మధ్య జరిగిన ఒక ఫన్నీ కాన్వర్జేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతాన్ని తవ్వుకుంటూ వీరిద్దరూ చేసిన రచ్చ ఈవెంట్‌కే హైలైట్‌గా నిలిచింది.

​సాధారణంగా ఈవెంట్లలో ఒకరినొకరు పొగుడుకుంటారు కానీ, ఇక్కడ మాత్రం సాయి ధరమ్ తేజ్ డైరెక్ట్ గా రామ్ అబ్బరాజుపై కంప్లైంట్స్ మొదలుపెట్టారు. ‘సామజవరగమన’తో పెద్ద హిట్ కొట్టిన రామ్ అబ్బరాజు, ఒకప్పుడు తేజ్‌తో కలిసి వర్క్ చేశారు. ఆ పాత రోజులను గుర్తు చేసుకుంటూనే ఒక షాకింగ్ విషయాన్ని తేజ్ బయటపెట్టారు. ఆ మాటలు విన్న రామ్ అబ్బరాజు నవ్వాలో, ఏడవాలో తెలియక తల పట్టుకున్నారు.

తన లవ్ స్టోరీ బ్రేకప్ అవ్వడానికి కారణం దర్శకుడు రామ్ అబ్బరాజే అని సాయి ధరమ్ తేజ్ స్టేజ్ మీద అందరి ముందు లీక్ చేసేశారు. “నేను ప్రేమించిన అమ్మాయికి భాష రాదు, నాకు భాష రాదు.. ఈ రామ్ గాడు మధ్యలో దూరి ఏదో చెప్పి మొత్తానికి నా లవ్ స్టోరీని బ్రేకప్ చేయించాడు” అంటూ తేజ్ సరదాగా ఆరోపించారు. వాలెంటైన్స్ డే దగ్గర పడుతున్న టైమ్‌లో మెగా హీరో నోటి నుంచి ఈ బ్రేకప్ సీక్రెట్ రావడంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు.

​ఈ కామెడీ ఇక్కడితో ఆగలేదు. ఆ అమ్మాయికి భాష రాకపోతే, రామ్ అబ్బరాజు వెళ్లి ‘అంతే.. బ్రేకప్’ అని తేల్చేశాడట. “వీడు నా లవ్ స్టోరీకి ప్రత్యక్ష సాక్షి మాత్రమే కాదు, దాన్ని క్లోజ్ చేయించిన కట్టప్ప కూడా వీడే” అని తేజ్ అనడంతో ఈవెంట్‌లో అందరూ నవ్వేశారు. దీనికి రామ్ అబ్బరాజు స్పందిస్తూ.. ఆ గొడవలో తన ప్రమేయం లేదని, కేవలం అసిస్టెంట్ డైరెక్టర్‌గా మాత్రమే అక్కడ ఉన్నానని కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు.

​నిజానికి సాయి ధరమ్ తేజ్, రామ్ అబ్బరాజుల మధ్య ఉన్న బాండింగ్ అలాంటిది. చాలా కాలం నుండి వీరిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్. అందుకే స్టేజ్ మీద ఒకరి పరువు ఒకరి మీద ఒకరు జోక్స్ వేసుకుంటూ అంత ఫ్రీడమ్ తీసుకున్నారు. నిర్మాత బన్నీ వాసు, వంశీ నందిపాటి కూడా ఈ ఫ్రెండ్లీ ఫైట్‌ను బాగా ఎంజాయ్ చేశారు. ఈ ఫన్నీ ఇన్సిడెంట్ ‘హే భగవాన్’ మూవీ ప్రమోషన్స్‌కు ఒక రేంజ్ క్రేజ్ తెచ్చిపెట్టింది. ​సుహాస్ హీరోగా వస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 20న రిలీజ్ కాబోతోంది. ఇలాంటి క్రేజీ గెస్టుల సపోర్ట్ తో సినిమాపై పాజిటివ్ వైబ్స్ మొదలయ్యాయి. ఒకరి బ్రేకప్ స్టోరీని ఇలా సరదాగా పబ్లిక్‌లో చెప్పుకునేంత గొప్ప స్నేహం వీరిది అని ఫ్యాన్స్ కూడా ఫిదా అవుతున్నారు. మరి ఈ లవ్ అండ్ కామెడీ డ్రామా థియేటర్లలో ఏ స్థాయిలో పేలుతుందో చూడాలి.