Begin typing your search above and press return to search.

సెల్ఫ్ డిఫెన్స్ లో పట్టు.. విశాల్ కాబోయే భార్యలో మరో టాలెంట్ కూడా!

సాయి ధన్సిక ప్రధాన పాత్రలో నటించిన చిత్రం యోగి డా. ఫిబ్రవరి 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది.

By:  Madhu Reddy   |   8 Feb 2026 1:22 PM IST
సెల్ఫ్ డిఫెన్స్ లో పట్టు.. విశాల్ కాబోయే భార్యలో మరో టాలెంట్ కూడా!
X

ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విశాల్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూడగా.. ప్రముఖ హీరోయిన్ సాయి ధన్సికతో ఏడడుగులు వేయబోతున్నాను అని గత ఏడాది ప్రకటించారు. వాస్తవానికి 2025 ఆగస్టు 29న వివాహం చేసుకోవాలనుకున్నారు. కానీ నడిగర్ సంఘం భవనం పూర్తయిన తర్వాతనే ఆ భవనంలో జరిగే తొలి పెళ్లి వేడుక తమదేనని చెప్పి పెళ్లిని కాస్త వాయిదా వేశారు. ఇకపోతే పెళ్లి వాయిదా పడడంతో కెరియర్ పై దృష్టిపెట్టారు. అందులో భాగంగానే విశాల్ వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటే.. తనదైన నటనతో అభిమానులను మెప్పించే ప్రయత్నం చేస్తోంది సాయి ధన్సిక.

సాయి ధన్సిక ప్రధాన పాత్రలో నటించిన చిత్రం యోగి డా. ఫిబ్రవరి 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది. శ్రీ మోనిక సినీ ఫిలిమ్స్ బ్యానర్ పై వి.సెంథిల్ కుమార్ నిర్మించగా.. నూతన దర్శకుడు గౌతమ్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మనోబాల, ఎస్తేర్, రాజ్ కపూర్, షాయాజీ షిండే, కబీర్ దుహాన్ సింగ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఇందులో సాయి ధన్సిక పవర్ఫుల్ లేడీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది. ఇకపోతే ఒకవైపు ఆమె సినిమా థియేటర్లలో సందడి చేస్తుంటే.. మరొకవైపు ఆమెకు సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అందులో భాగంగానే ఆమె ఒక గొప్ప ఫుట్ బాల్ ప్లేయర్ అని, అలాగే సెల్ఫ్ డిఫెన్స్ లో పట్టు ఉందని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

విషయంలోకి వెళ్తే.. క్రేజీ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న సాయి ధన్సిక చిన్నతనంలోనే అథ్లెట్ కావాలనుకుందట. అందులో భాగంగానే స్కూలు ఫుట్బాల్ టీమ్ కి కెప్టెన్ గా వ్యవహరించింది. దాదాపు పలు కాంపిటీషన్లో పాల్గొని సుమారుగా 15 పథకాలను కూడా అందుకుంది. అంతేకాదు ఈమెకు సెల్ఫ్ డిఫెన్స్ లో మంచి పట్టు కూడా ఉంది. ఇదే విషయాన్ని ఇటీవల ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూలో చెబుతూ.. యోగి డా సినిమా షూటింగ్స్ సమయంలో ఒక వ్యక్తి నాతో సెల్ఫీ దిగాలని.. మా అంకుల్ని అడిగితే ..ఆ వ్యక్తి తాగి ఉన్నాడని గమనించి.. మా అంకుల్ ఒప్పుకోలేదట. అయితే మా అంకుల్ ని కొట్టి ఆ వ్యక్తి పారిపోయే ప్రయత్నం చేయడంతో.. సుమారు పది నిమిషాల పాటు ఆ తాగుబోతును చితక్కొట్టాను. అటు దర్శకుడు, హీరో నన్ను కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించారు . అయితే నాకు సెల్ఫ్ డిఫెన్స్ కోసం నేను స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాను.. ఆ టాలెంట్ అంతా అప్పుడు ఉపయోగించాను అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈమె మంచి ఫుట్బాల్ ప్లేయర్ మాత్రమే కాదు సెల్ఫ్ డిఫెన్స్ లో ట్రైనర్ కూడా అని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఇక సాయి ధన్సిక విషయానికి వస్తే.. ఈమెకు పెంపుడు జంతువులంటే చాలా ఇష్టమట. అందుకే మేకలు, శునకాలు, చిలకలను పెంచుకుంటూ ఉంటుంది. అందుకు సంబంధించిన వీడియోలను, ఫోటోలను కూడా ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంటూ ఉంటుంది. ఐస్ క్రీమ్ అంటే కూడా చాలా ఇష్టమట. అయితే వారంలో ఒకరోజు మాత్రమే ఐస్ క్రీమ్ తినాలనే కండిషన్ ను కచ్చితంగా పాటిస్తుంటుందట సాయి ధన్సిక. పల్లెటూర్లు, పచ్చటి పొలాలు, నదులు ఇలా ప్రకృతిని ఇష్టపడే ఈమె సమయం దొరికితే ప్రకృతితో గడపడానికే ప్రయత్నం చేస్తుందట. అలా మొత్తానికైతే తన సినిమా విడుదల సమయంలో ఈమెకు సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.