Begin typing your search above and press return to search.

ఒక్క హిట్ తో ఇండియా అంతా మోగిపోయే ఛాన్స్!

సాయి అభ్యంక‌ర్ అనే చెన్నై కంపోజ‌ర్ అలాగే వెలుగులోకి వ‌చ్చాడు. బ‌న్నీ -అట్లీ ప్రాజెక్ట్ కి మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా సాయి అభ్యంక‌ర్ అలాగే ఎంపికయ్యాడు.

By:  Srikanth Kontham   |   4 Dec 2025 11:00 PM IST
ఒక్క హిట్ తో ఇండియా అంతా మోగిపోయే ఛాన్స్!
X

అన్నం ఉడికిందా లేదా? అని తెలుసుకోవ‌డానికి ఒక మెతుకు ప‌ట్టుకుని చూస్తే చాలు సంగ‌తేంట‌న్న‌ది అర్ద‌మవుతుంది. సాయి అభ్యంక‌ర్ అనే చెన్నై కంపోజ‌ర్ అలాగే వెలుగులోకి వ‌చ్చాడు. బ‌న్నీ -అట్లీ ప్రాజెక్ట్ కి మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా సాయి అభ్యంక‌ర్ అలాగే ఎంపికయ్యాడు. అత‌డి యూ ట్యూబ్ కి సాంగ్ కి అట్లీ క‌నెక్ట్ అవ్వ‌డంతో? మ‌రో ఆలోచ‌న లేకుండా ఎంపిక చేసారు. ఒక ప్ర‌యివేట్ సాంగ్ తోనే సాయి ప్ర‌తిభ‌ను గుర్తించి బ‌న్నీ అండ్ కో ముందుకె|ళ్తున్న‌ట్లు తేలింది. ఇండియాస్ మోస్టై అవైటెడ్ ప్రాజెక్ట్ కావ‌డంతో సాయి అభ్యంక‌ర్ పేరు నాటి నుంచి నెట్టింట ట్రెండింగ్ లో నిలించింది.

2025 లో రెండు సినిమాల‌తో:

దీంతో సాయి అభ్యంక‌ర్ కిట్టీలో మ‌రిన్ని ప్రాజెక్ట్ లు చేరాయి. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కథానాయ‌కుడిగా క‌మ‌ల్ హాస‌న్ నిర్మించే సినిమాకు ఈ కుర్రాడే సంగీతం అందిస్తున్నాడ‌నే వార్త‌లొస్తున్నాయి. సూర్య హీరోగా న‌టిస్తోన్న కురుప్పు చిత్రానికి, లోకేష్ క‌న‌గ‌రాజ్ నిర్మిస్తోన్న `బెంజ్` చిత్రానికి, కార్తీ హీరోగా న‌టిస్తోన్న `మార్ష‌ల్` చిత్రాల‌కు కూడా అభ్యంక‌ర్ సంగీత ద‌ర్శ‌కుడిగా ప‌ని చేస్తున్నాడు. అయితే సాయి అభ్యంక‌ర్ ఈ సినిమాల‌ కంటే ముందే మ‌ల‌యాళం `బ‌ల్టీ`, త‌మిళ్ లో `డ్యూడ్` సినిమాల‌కు కూడా సంగీతం అందించాడు. ఇటీవ‌లే రిలీజ్ అయిన డ్యూడ్ మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే.

వాళ్ల స‌ర‌స‌న స్థానం:

ఇలా ఇన్ని ప్రాజెక్ట్ లు స‌హా డ్యూడ్ లాంటి విజ‌యం సాయిని టాలీవుడ్ లో మ‌రింత బిజీ కంపోజర్ గా మార్చే అవకాశం ఉంది. టాలీవుడ్ లో ట్రెండింగ్ లో ఉన్న మ్యూజిక్ డైరెక్ట‌ర్లు ఎవ‌రు అంటే థ‌మ‌న్, దేవి శ్రీ ప్ర‌సాద్ పేర్లు వినిపి స్తుంటాయి. అనిరుద్ కూడా టాలీవుడ్లో బిజీగానే ఉన్నాడు. కోలీవుడ్ సినిమాల్ని బ్యాలెన్స్ చేస్తూ ఇక్క‌డా పని చేస్తు న్నాడు. అజ‌నీష్ లోక్ నాధ్, ర‌వి బ‌స్రూర్ లాంటి వాళ్లు పాన్ ఇండియా సినిమాల‌తో బిజీగా ఉన్నారు. మ్యూజిక్ ప‌రంగా వీళ్లంతా ఓ బ్రాండ్ గా కొన‌సాగుతున్నారు. వీళ్ల స‌ర‌స‌న సాయి అభ్యంక‌ర్ చేర‌డానికి పెద్ద‌గా స‌మ‌యం ప‌ట్ట‌దు.

సూర్య‌, బెంజ్ చిత్రాల‌తో:

ఒక్క హిట్ తోనే అత‌డు పాన్ ఇండియాలో సంచ‌ల‌న‌మ‌వుతున్నాడు. చేతిలో బ‌న్నీ సినిమా రెడీగా ఉంది కాబ‌ట్టి! సాయికి ప‌ని ఈజీ అవుతుంది. అంత‌క‌న్నా ముందే సూర్య సినిమా, `బెంజ్` చిత్రాలు రిలీజ్ అవుతాయి. ఇవి పాన్ ఇండియా ప్రాజెక్ట్ లు కాన‌ప్ప‌టికీ ఇక్క‌డ మోత మెగితే ఇండియా అంత‌టా మారు మ్రోగిపోతుంది. మ‌రి ఈ అవ‌కాశాన్ని ఎలా స‌ద్వినియోగం చేసుకుంటాడో చూడాలి.