డ్యూడ్ పాట ఓవర్ హైప్.. ఆ భారీ ప్రాజెక్ట్ ల సంగతేంటి?
సౌత్ ఇండియాలో యువ సంగీత దర్శకుడు సాయి అభ్యాంకర్ ప్రస్తుతం ట్రెండిగ్ లో ఉన్నాడు.
By: M Prashanth | 30 Aug 2025 3:00 AM ISTసౌత్ ఇండియాలో యువ సంగీత దర్శకుడు సాయి అభ్యాంకర్ ప్రస్తుతం ట్రెండిగ్ లో ఉన్నాడు. ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ డ్యూడ్, బెంజ్, AA22xA6 (అల్లు అర్జున్ - అట్లీ) సినిమాలకు పనిచేస్తున్నాడు. ఈ సినిమాలకు ఎంపికైనప్పుడు ఇండస్ట్రీ అంతా ఆశ్చర్యపోయింది. అతడిపై అంచనాలు పెరిగిపోయాయి. ఇన్ని అంచనాల నడుమ నిన్న డ్యూడ్ సినిమా నుంచి తొలి పాట విడుదలైంది. అయితే ఈ పాట మిశ్రమ స్పందన పొందింది.
ఈ పాట నుంచి తొలి సింగిల్ నిన్న విడుదలైంది. ఇది క్యాచీ గా ఉంది. ఈ పాట లీడ్ రోల్ లో ప్రదీప్ రంగనాథన్ - మమిత బైజు ఆకర్షణీయంగా కనిపించారు. అయితే, ఈ పాట సాయి అభ్యాంకర్ తన మునుపటి పాటల్లాగా వైరల్ కాలేదు. కానీ అతడి కవర్ పాటలు చాలా వరకు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సాయి అభ్యంకర్ ఫేమస్ అయ్యాడు. ఆసా కూడా, సితిర పుత్తిరి, విజి వీకురా పాటలు ఆదరణ దక్కించుకున్నాయి. ఆసా కూడా అనే పాట YouTubeలో అథ్యధిక వ్యూస్ సాధించింది కూడా.
అయితే డ్యూడ్ సినిమా కోసం సాయి కంపోజింగ్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. ఓవర్ హైప్ అంటూ, అనిరుధ్ ను రీచ్ అవ్వలేదని కామెంట్లు చేస్తున్నారు. సాయి ప్రస్తుతం పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు పనిచేస్తున్నాడు. దీంతో తాజా సాంగ్ కంపోజింగ్ అతడిపై సందేహాలను లేవనెత్తుతోంది. కోలీవుడ్ లో నెక్ట్స్ టాప్ మ్యూజిక్ కంపోజర్ అని అంటుండంగా.. ఇలాంటి ఔట్ పుట్ రావడంతో సందేగాలు నెలకొన్నాయి. అంతటా విమర్శలు వస్తున్నాయి.
సాయి ఓవర్ రేట్ అని, అతడు పెద్ద ప్రాజెక్ట్ లు డీల్ చేయగలడా అని అంటున్నారు. కొంతమంది నెటిజన్లు సాయి అభ్యాంకర్‌ను విమర్శిస్తున్నారు. మొత్తం మీద.. డ్యూడ్ సినమా నుండి వచ్చిన తొలి సింగిల్ చర్చలకు దారితీసింది. కానీ అభిమానులు సాయి అభ్యాంకర్ భవిష్యత్ ప్రాజెక్టులలో హిట్ పాటలను అందిస్తారని ఆశిస్తున్నారు.
20 సంవత్సరాల వయస్సులో సాయి ఈ రంగం ఎంచుకోవడంతో మెచ్చుకోవాలని అంటున్నారు. అతడు ఇప్పటికే కంపోజ్ చేసిన పాటలు బాగున్నాయని.. ఒక్క పాటతో డిసైడ్ అవ్వకూడని మరికొందకు మద్దతు ఇస్తున్నారు. అతడిపై ఓ అంచనాకు రావడానికి ఒక పాట సరిపోదని, ఇంకొన్ని అవకాశఆలు ఇచ్చి చూడాలని అంటున్నారు. మరి అతను కోలీవుడ్‌లో ప్రముఖ సంగీత దర్శకుడిగా ఎదుగుతాడా? లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది.
