Begin typing your search above and press return to search.

అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేయాలంటే..?

అల్లు అర్జున్ సినిమాకు కోలీవుడ్ యువ సంగీత కెరటం సాయి అభ్యంకర్ మ్యూజిక్ ఇస్తున్నాడు.

By:  Ramesh Boddu   |   22 Nov 2025 3:00 PM IST
అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేయాలంటే..?
X

పుష్ప తర్వాత అల్లు అర్జున్ చేసే సినిమాపై పాన్ ఇండియా లెవెల్లో భారీ హైప్ ఏర్పడింది. అందులోనూ అట్లీ లాంటి స్టార్ డైరెక్టర్ ఈ సినిమా చేయడం మరింత హైప్ ఇచ్చింది. అల్లు అర్జున్, అట్లీ ఈ కాంబోలో రాబోతున్న ఈ మూవీపై ఎక్స్ పెక్టేషన్స్ అయితే ఒక రేంజ్ లో ఉన్నాయి. ఐతే ఈ సినిమాలో కాస్టింగ్, ప్రొడక్షన్ విషయంలో భారీ స్థాయిలో ప్లాన్ చేశాడు డైరెక్టర్ అట్లీ. ఐతే మ్యూజిక్ డైరెక్షన్ విషయంలో మాత్రం ఒక యంగ్ సెన్సేషన్ కి ఛాన్స్ ఇచ్చాడు. అల్లు అర్జున్ సినిమాకు కోలీవుడ్ యువ సంగీత కెరటం సాయి అభ్యంకర్ మ్యూజిక్ ఇస్తున్నాడు.

సాయి అభ్యంకర్ డ్యూడ్ తో జస్ట్ ఓకే..

అంతకుముందు మలయాళంలో ఒక సినిమాకు మ్యూజిక్ ఇచ్చిన సాయి అభ్యంకర్ రీసెంట్ గా డ్యూడ్ సినిమాకు సంగీతం అందించాడు. ఐతే ప్రైవేట్ ఆల్బంస్ తో సూపర్ పాపులర్ అయిన సాయి అభ్యంకర్ డ్యూడ్ తో జస్ట్ ఓకే అనిపించాడు. నెక్స్ట్ తమిళ్ లో కరుప్పు, బెంజ్, మార్షల్ సినిమాలకు మ్యూజిక్ ఇస్తున్నాడు సాయి అభ్యంకర్. వీటితో పాటు అల్లు అర్జున్, అట్లీ సినిమా కూడా ఉంది.

అల్లు అర్జున్ సినిమా అంటే స్టోరీ, స్క్రీన్ ప్లే, యాక్షన్ అన్నిటితో పాటు మ్యూజిక్ విషయంలో కూడా ఇంపాక్ట్ ఉండాలి. ఆ విషయంలో సాయి అభ్యంకర్ చాలా ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది. ఐతే ఆల్రెడీ అతని టాలెంట్ టెస్ట్ చేసిన తర్వాతే అట్లీ ఈ ఛాన్స్ ఇచ్చాడని తెలుస్తుంది. అల్లు అర్జున్ సినిమాకు సంబంధించి ట్యూన్స్ ఇప్పటికే సాయి రెడీ చేశాడట. సినిమా స్టోరీకి తగినట్టుగానే కొత్తగా ఈ మ్యూజిక్ ఉంటుందని తెలుస్తుంది.

అల్లు అర్జున్ సినిమాతో అసలు స్టామినా..

సో అల్లు అర్జున్ సినిమాతో సాయి అభ్యంకర్ భారీ క్రేజ్ తెచ్చుకోబోతున్నాడు. తమిళ్ లో ఇప్పటికే 3 సినిమాలు చేసిన సాయి అభ్యంకర్ అల్లు అర్జున్, అట్లీ కాంబో సినిమాతో పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నాడు. సో ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అసలు స్టామినా ఏంటో బన్నీ సినిమా మ్యూజిక్ తో చూపించబోతున్నాడు. అల్లు అర్జున్ కూడా సాయి అభ్యంకర్ కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

మరి ఈ క్రేజీ ఛాన్స్ ని సాయి ఎలా వాడుకుంటాడు అన్నది చూడాలి. సాయి అభ్యంకర్ ఈ సినిమాతో ఇచ్చే మ్యూజిక్ అతని పాన్ ఇండియా కెరీర్ ని సెట్ చేస్తుంది. మరి ఈ సినిమా మ్యూజిక్ ఎలా ఉంటుంది ఎంత సర్ ప్రైజ్ చేస్తుంది అన్నది చూడాలి. సన్ పిక్చర్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ మూవీలో దీపిక పదుకొనె ఒక హీరోయిన్ గా లాక్ అవ్వగా మృణాల్ ఠాకూర్, జాన్వి కపూర్ కూడా నటించే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. పుష్ప రెండు భాగాల తర్వాత అల్లు అర్జున్ నెక్స్ట్ ఏ రేంజ్ ఇంపాక్ట్ చూపిస్తాడన్నది చూడాలి.