Begin typing your search above and press return to search.

తెలుగులోకి మాలీవుడ్ బ్లాక్ బస్టర్.. సాహు గారపాటి సూపర్ ప్లాన్..

టాలీవుడ్ మూవీ లవర్స్ కు మరో ఇంట్రెస్టింగ్ మూవీ ఎక్స్పీరియన్స్ అందించేందుకు ప్రముఖ నిర్మాత సాహు గారపాటి సిద్ధమయ్యారు.

By:  M Prashanth   |   16 April 2026 12:31 AM IST
తెలుగులోకి మాలీవుడ్ బ్లాక్ బస్టర్.. సాహు గారపాటి సూపర్ ప్లాన్..
X

టాలీవుడ్ మూవీ లవర్స్ కు మరో ఇంట్రెస్టింగ్ మూవీ ఎక్స్పీరియన్స్ అందించేందుకు ప్రముఖ నిర్మాత సాహు గారపాటి సిద్ధమయ్యారు. మలయాళంలో సంచలన విజయాన్ని సాధించిన వాజా 2 చిత్రాన్ని ఇప్పుడు ఆయన తెలుగులోకి తీసుకురానున్నారు. వాలా 2 పేరుతో ఆ మూవీని గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. ఏప్రిల్ 24వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున రిలీజ్ చేయనున్నారు.




అయితే మలయాళంలో మాత్రమే విడుదలైన వాజా 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి భారీ బ్లాక్‌ బస్టర్‌ గా నిలిచింది. ముఖ్యంగా యూత్ లో ఆ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ఫన్, కన్ఫ్యూజన్, ఫ్రెండ్ షిప్ వంటి ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఆ చిత్రం అన్ని వర్గాల ఆడియన్స్ ను కూడా ఓ రేంజ్ లో ఆకట్టుకుంది.

వాజా 2 సినిమాకు సావిన్ ఎస్.ఏ దర్శకత్వం వహించారు. సమాజం, కుటుంబం నుంచి యువత ఎదుర్కొనే ఒత్తిళ్లను నేచురల్ గా.. అదే సమయంలో ఎంటర్టైన్ చేసే విధంగా చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. ఆ మూవీతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. పాత్రలు, వారి ఎమోషన్స్ ప్రేక్షకులకు దగ్గరగా అనిపించేలా మలచడం మూవీ సక్సెస్ అవ్వడానికి మెయిన్ రీజన్ గా నిలిచింది.

అయితే సినిమాలో హషీర్, అలన్ బిన్ సిరాజ్, అజిన్ జాయ్, వినాయక్ వి కీలక పాత్రల్లో నటించారు. వీరి నేచురల్ యాక్టింగ్.. కథను మరింత బలంగా నిలబెట్టింది. సినిమాకు ప్లస్ పాయింట్ గా మారింది. యూత్ లైఫ్ స్టైల్ ను నిజ జీవితానికి దగ్గరగా చూపించడం వల్ల ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. అజు వర్గీస్, విజయ్ బాబు, అల్ఫోన్స్ పుత్రెన్ వంటి ప్రముఖ నటులు సినిమాలో నటించడం విశేషం.

ముఖ్యంగా కామెడీ సీన్స్ ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్వించాయి. ఏదేమైనా వాజా 2 చిత్రం కేవలం ఎంటర్టైన్మెంట్ కు మాత్రమే పరిమితం కాకుండా.. యువత ఎదుర్కొనే సమస్యలను హృదయానికి హత్తుకునేలా చూపిస్తూ ఆకట్టుకుంది. దీంతో అందరి దృష్టిలో సినిమా పడింది. థియేటర్స్ కు రప్పించి భారీ వసూళ్లు సాధించింది. ఇప్పుడు అవే ఎమోషన్స్ ను, ఎంటర్టైన్మెంట్ ను తెలుగు ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో సాహు ఆ చిత్రాన్ని తీసుకొస్తున్నారు.

మంచి కథతో రూపొందిన ఆ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుందనే నమ్మకం వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఇప్పటికే పలు మాలీవుడ్ సినిమాలు.. టాలీవుడ్ లో సూపర్ హిట్స్ గా నిలిచిన సందర్భాలు ఉన్నాయి. దీంతో సాహు గారపాటి ఇప్పుడు సూపర్ ప్లాన్ తో వస్తున్నారని అర్థమవుతోంది. మొత్తానికి.. వాలా 2 సినిమా తెలుగులో కూడా భారీ విజయాన్ని సాధిస్తుందా అనే ఆసక్తి నెలకొంది. మరికొద్ది రోజుల్లో రానున్న ఆ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు అలరిస్తుందో వేచి చూడాలి.