సాయి పల్లవి బాలీవుడ్ డెబ్యూ మరింత లేట్ కానుందా?
ఏది ఎప్పుడు జరగాలో ముందే నిర్ణయించి ఉంటుందని, కాకపోతే మనం దాన్ని గుర్తించకపోవడంతో పలు కారణాలు కనిపిస్తుంటాయని పెద్దలు ఊరికే అనలేదు.
By: Sravani Lakshmi Srungarapu | 4 Jan 2026 12:53 PM ISTఏది ఎప్పుడు జరగాలో ముందే నిర్ణయించి ఉంటుందని, కాకపోతే మనం దాన్ని గుర్తించకపోవడంతో పలు కారణాలు కనిపిస్తుంటాయని పెద్దలు ఊరికే అనలేదు. ఇప్పుడు సాయి పల్లవి హిందీ డెబ్యూ సినిమా పరిస్థితి కూడా అలానే అయింది. ఆమిర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా తెరకెక్కుతున్న సినిమా మేరే రహో.
కొరియన్ మూవీ వన్ డే కు రీమేక్ గా మేరే రహో
ఆమిర్ ఖాన్ బ్యానర్ నుంచి వస్తున్న ఈ సినిమా 2011లో వచ్చిన కొరియన్ సినిమా వన్ డే కు రీమేక్ గా వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. జపాన్ లోని సపోరో టౌన్ లో జరిగే స్నో ఫెస్టివల్ టైమ్ లో ఈ లవ్ స్టోరీని తెరకెక్కించడంతో, ఆడియన్స్ ను మేరే రహో కచ్ఛితంగా మెప్పిస్తుందని అందరూ అనుకుంటున్నారు. అయితే సాయి పల్లవి నుంచి సినిమా వచ్చి చాలా రోజులవుతుంది.
2025లో పల్లవి నుంచి ఒకే సినిమా
2025లో సాయి పల్లవి నుంచి ఒకే ఒక సినిమా వచ్చింది. నాగచైతన్యతో నటించిన తండేల్ తర్వాత సాయి పల్లవి నుంచి మరో సినిమా రాలేదు. అయితే ఈ ఇయర్ సాయి పల్లవి నుంచి రెండు సినిమాలు రానున్నాయి. అంతేకాదు, 2026 సాయి పల్లవికి మరింత స్పెషల్ కానుంది. దానికి కారణం అమ్మడు ఈ ఏడాదే తన బాలీవుడ్ డెబ్యూని చేయనుంది. కొన్ని నెలల గ్యాప్ లోనే సాయి పల్లవి నుంచి ఈ ఇయర్ రెండు సినిమాలు రానున్నాయి అది కూడా బాలీవుడ్ లో.
రామయణ కంటే ముందే మరో సినిమా
సాయి పల్లవి ఈ ఏడాది బాలీవుడ్ లో మేరే రహో తో పాటూ రణ్‌బీర్ కపూర్ తో కలిసి పౌరాణిక సినిమా రామాయణలో సీతా దేవిగా కనిపించనుంది. వీటిలో రామాయణ కంటే ముందుగా మేరే రహో రిలీజవనుంది. ఈ సినిమాతోనే సాయి పల్లవి బాలీవుడ్ లోకి పరిచయం కానుంది. ఈ సినిమాను సమ్మర్ కానుకగా ఏప్రిల్ 24న రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు.
జులై కు వాయిదా అని వార్తలు
కానీ ఇప్పుడు ఈ సినిమా ఈ ఏడాది జులైకి పోస్ట్ పోన్ చేస్తున్నట్టు బాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై మేకర్స్ నుంచి ఎలాంటి అఫీషియల్ లేకపోయినప్పటికీ, ఏప్రిల్ 17న సల్మాన్ ఖాన్ బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ రిలీజవుతుండటంతో ఆ సినిమాతో పోటీ ఎందుకులే అని మేకర్స్ ఈ డెసిషన్ తీసుకున్నారని తెలుస్తోంది. అది కాకుండా ఏప్రిల్, మే నెలల్లోని మిగిలిన డేట్స్ ఇప్పటికే వేరే సినిమాలతో షెడ్యూలై ఉండటం వల్ల మేరే రహో సినిమాను సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ఆప్షన్స్ చాలా తక్కువగా ఉన్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే మేకర్స్ జులై రిలీజ్ అయితే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.
కాగా మేరే రహో మూవీ సాయి పల్లవి బాలీవుడ్ కెరీర్ కు చాలా కీలకం కానుంది. రామాయణం కంటే ముందే ఈ సినిమా రిలీజవుతుండటం వల్ల ఈ సినిమాతో సాయి పల్లవి ఏ మేరకు ఆడియన్స్ ను మెప్పిస్తుందో చూడాలి. ఏదేమైనా సాయి పల్లవి హిందీ డెబ్యూ మాత్రం అనుకున్న దాని కంటే ఆలస్యమవడం ఆమె ఫ్యాన్స్ ను డిజప్పాయింట్ చేస్తోంది.
