Begin typing your search above and press return to search.

యంగ్ హీరోల కొత్త ట్రెండ్‌లోకి కార్తికేయ!

టాలీవుడ్‌లో హీరోలు కేవలం యాక్టింగ్‌కే రిమితం కాకుండా కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వంటి విభాగాల్లోనూ తమదైన ముద్ర వేయాలని చూస్తున్న ట్రెండ్ క్రమంగా బలపడుతోంది.

By:  Sravani Lakshmi Srungarapu   |   25 Aug 2026 11:00 PM IST
యంగ్ హీరోల కొత్త ట్రెండ్‌లోకి కార్తికేయ!
X

టాలీవుడ్‌లో హీరోలు కేవలం యాక్టింగ్‌కే రిమితం కాకుండా కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వంటి విభాగాల్లోనూ తమదైన ముద్ర వేయాలని చూస్తున్న ట్రెండ్ క్రమంగా బలపడుతోంది. ఒకప్పుడు హీరోగా కెరీర్‌లో సెటిలైన తర్వాతే డైరెక్ష‌న్ వైపు అడుగులు పడేవి. కానీ ఇప్పుడు యంగ్ హీరోలు తమకు నచ్చిన కథలను తామే చెప్పాలనే ఆలోచనతో కెమెరా వెనక్కి వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

ఈ మారుతున్న ట్రెండ్‌లో ఇప్పుడు RX100 ఫేమ్ కార్తికేయ కూడా చేరబోతున్నారనే వార్త ఆసక్తిని పెంచుతోంది. నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయ, ఇకపై కేవలం హీరోగా మాత్రమే కాకుండా సినిమా మేకింగ్‌లోని ఇతర విభాగాలపైనా దృష్టి పెట్టబోతున్నారనే డిస్క‌ష‌న్ మొదలైంది. ముఖ్యంగా కథను సెలెక్ట్ చేసుకోవ‌డం నుంచి దాన్ని తెరపైకి తీసుకురావడం వరకు మొత్తం క్రియేటివ్ రెస్పాన్సిబులిటీ తీసుకోవాలనే ఆలోచన యంగ్ హీరోల్లో పెరుగుతున్న నేపథ్యంలో కార్తికేయ డెసిష‌న్ కూడా అదే దిశలో కనిపిస్తోంది.

ఇప్పటికే టాలీవుడ్‌లో న‌టుల నుంచి డైరెక్ట‌ర్లుగా మారిన ఉదాహరణలు చాలానే ఉన్నాయి. ఎన్టీఆర్, కృష్ణ, విజయ నిర్మల వంటి దిగ్గజాల నుంచి అవసరాల శ్రీనివాస్, విశ్వక్‌సేన్ వంటి సమకాలీన నటుల వరకు పలువురు యాక్టింగ్‌తో పాటు దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టారు. అయితే ప్రస్తుత తరం హీరోలలో ఈ ఆలోచనకు మరో కొత్త కోణం కనిపిస్తోంది. తమ మార్కెట్‌కు తగ్గ కథ కోసం ఎదురు చూడటం కంటే, తమకు నమ్మకం ఉన్న కథను తామే డెవలప్ చేసి ఆడియ‌న్స్ ముందుకు తీసుకురావాలనే ప్రయత్నం పెరుగుతోంది.

దీనికి మ‌రిన్ని ఎగ్జాంపుల్స్ కూడా క‌నిపిస్తున్నాయి. ఆల్రెడీ కిర‌ణ్ అబ్బ‌వ‌రం డైరెక్ట‌ర్ గా మారి సినిమా చేస్తుండ‌గా, ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కూడా ఇదే బాట‌లో వెళ్తూ, త‌న స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్నారు. సుమారు రెండు దశాబ్దాల నటనా ప్రయాణం తర్వాత రామ్ డైరెక్ష‌న్ లోకి అడుగుపెడుతున్నారు. యాక్ట‌ర్ గా సంపాదించిన ఎక్స్‌పీరియెన్స్‌ను ఇప్పుడు డైరెక్ట‌ర్ గా ఉపయోగించుకోవాలనే ప్రయత్నం ఈ మారుతున్న ఆలోచనా విధానానికి అద్దం పడుతోంది.

కార్తికేయ డైరెక్ష‌న్ వైపు అడుగేయ‌డం కేవలం మరో హీరో డైరెక్టర్‌గా మారడం మాత్రమే కాదు. తన కెరీర్‌పై మరింత క్రియేటివ్ కంట్రోల్ ను సాధించాలనే ప్రయత్నంగా కూడా చూడొచ్చు. ముఖ్యంగా హీరో ఇమేజ్‌ను దాటి కథ చెప్పే వ్యక్తిగా తనను తాను కొత్తగా పరిచయం చేసుకునే అవకాశం ఆయనకు దక్కుతుంది. అయితే నటుడిగా, డైరెక్ట‌ర్ గా రెండు బాధ్యతలను ఒకేసారి నిర్వహించడం అంత సులభం కాదు. ఒకవైపు నటుడిగా ప్రేక్షకుల అంచనాలను అందుకోవాలి.. మరోవైపు డైరెక్ట‌ర్ గా మొత్తం సినిమాను నడిపించాలి. పైగా ఈ సినిమాను తానే స్వ‌యంగా నిర్మించ‌డం మ‌రొక పెద్ద విష‌యం. అందుకే కార్తికేయ ఈ కొత్త ప్రయోగంలో ఎంతవరకు సక్సెస్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తంగా చూస్తే.. టాలీవుడ్ యంగ్ హీరోలు క్రమంగా హీరో అనే పరిధిని దాటి ఫిల్మ్‌మేకర్‌గా తమను తాము నిరూపించుకోవాలని చూస్తున్న టైమ్ లో కార్తికేయ అడుగు కూడా ఈ కొత్త ట్రెండ్‌కు మరింత ఊపునిచ్చే అవకాశం కనిపిస్తోంది.