నేషనల్ క్రష్ పైనే రుక్మిణీ వసంత్ పంచ్!
నేషనల్ క్రష్ రష్మికా మందన్నా పై సొంత పరిశ్రమ నుంచే విమర్శలు ఎదుర్కోన్న సందర్భాలెన్నో. పాన్ ఇండియాలో ఫేమస్ అయిన తర్వాత సొంత పరిశ్రమనే మర్చిపోయిందని కన్నడిగులు విమర్శించారు
By: Srikanth Kontham | 2 Sept 2025 5:00 PM ISTనేషనల్ క్రష్ రష్మికా మందన్నా పై సొంత పరిశ్రమ నుంచే విమర్శలు ఎదుర్కోన్న సందర్భాలెన్నో. పాన్ ఇండియాలో ఫేమస్ అయిన తర్వాత సొంత పరిశ్రమనే మర్చిపోయిందని కన్నడిగులు విమర్శించారు. ఓ చిన్న సినిమాలో నటించే అవకాశం శాండిల్ వుడ్ ఇస్తే? ఇప్పుడా పరిశ్రమ అంటే రష్మిక చిన్న చూపు చూస్తుందని..పరిశ్రమ తరుపున నిర్వహించే వేడులకు హాజరు కాని సందర్భాల్లో ఇవన్నీ తెరపైకి వచ్చా యి. దీంతో రష్మిక చిత్రాలు చూడాలనుకోవడం లేదని , కృతజ్ఞతా భావం లేని నటిగా అక్కడ అభిమానుల నోట విమర్శలకు గురైంది.
సొంత పరిశ్రమపై ప్రేమ:
ఆమెను బ్యాన్ చేసినట్లు కూడా నెట్టింట ప్రచారం జరిగింది. ఆ రకంగా కన్నడ పరిశ్రమలో రష్మికపై తీవ్ర వ్యతిరేకత ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రష్మికకు పూర్తి కాంట్రాస్ట్ గా అదే కన్నడ పరిశ్రమకు చెందిన రకుక్మిణీ వసంత్ సొంత పరిశ్రమను ఆకాశానికి ఎత్తేసింది. తాను కన్నడిగిని అని.. సొంత పరిశ్రమ అవకా శాలు ఇవ్వడంతోనే ఇప్పుడు గొప్ప అవకాశాలు అందుకుంటున్నట్లు పేర్కొంది. సప్తసాగరాలు సినిమా తర్వాత తనకొచ్చిన అవకాశాలన్నింటికి కారణం తొలి సినిమా సహా అక్కడ పరిశ్రమ అందించిన ప్రోత్సా హం కారణంగానే సాధ్యమైందని అభిప్రాయపడింది.
రష్మికకు భిన్నంగా:
భవిష్యత్ లో ఎలాంటి విజయాలు అందుకున్నా? వాటి గురించి మాట్లాడే ముందు తన సొంత పరిశ్రమ ..అక్కడ వచ్చిన అవకాశాలు...విజయాలు గురించి మాట్లాడిన తర్వాతే మిగతా వాటి గురించి మాట్లాడే అర్హత తనకు ఉంటుందని పేర్కొంది. దీంతో ఇప్పుడీ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. రష్మిక కు పూర్త కాంట్రాస్ట్ గా రుక్మిణీ వసంత్ కనిపిస్తుందని సోషల్ మీడియాలో నెటి జనులు పోస్టులు పెడుతు న్నారు. సొంత పరిశ్రమకు రుక్మిణీ ఎంత ప్రాధాన్యత ఇస్తుందన్నది రష్మిక ఇప్పటికైనా తెలుసు కోవాలని సూచించారు.
పాన్ ఇండియా చిత్రాలతో బిజీ:
ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే గుణాన్ని అలవాటు చేసుకోవాలని కన్నడిగులు రష్మిక పేరును ప్రస్తా విస్తూ పోస్టులు పెడుతున్నారు. మరి ఈ కామెంట్లపై రష్మిక అభిప్రాయం ఏంటో. సప్తసాగరాలు తర్వాత రుక్మిణీ వసంత్ వరుసగా పాన్ ఇండియా చిత్రాల్లో అవకాశాలు అందుకుంటోన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ తో డ్రాగన్, కాంతార చాప్టర్ వన్, టాక్సిక్ లాంటి చిత్రాల్లో నటిస్తోంది. ఇవిగాక తెలుగులోనూ కొత్త అవకాశాలు జోరందుకుంటున్నాయి.
