అదే జరిగితే అమ్మడి దశ తిరిగినట్టే!
రుక్మిణి వసంత్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. బీర్బల్ అనే కన్నడ సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అమ్మడు.
By: Sravani Lakshmi Srungarapu | 29 Dec 2025 9:00 PM ISTరుక్మిణి వసంత్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. బీర్బల్ అనే కన్నడ సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అమ్మడు. ఆ సినిమా 2019లోనే వచ్చింది కానీ రుక్మిణికి గుర్తింపు తీసుకొచ్చింది మాత్రం సప్త సాగరాలు దాటి మూవీనే. ఆ సినిమాతో కేవలం కన్నడలోనే కాకుండా టాలీవుడ్ లో కూడా రుక్మిణి మంచి క్రేజ్ సంపాదించుకుంది.
అప్పుడో ఇప్పుడో ఎప్పుడో మూవీతో టాలీవుడ్ డెబ్యూ
ఆ మూవీలో తన యాక్టింగ్, స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆడియన్స్ మనసుల్ని గెలుచుకున్న రుక్మిణి తర్వాత తెలుగులో అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అనే మూవీ చేసింది కానీ ఆ సినిమా అసలెప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో కూడా ఎవరికీ తెలియలేదు. అంతేకాదు రుక్మిణి భైరతి రంగల్, బఘీరా, ఏస్ లాంటి సినిమాల్లో నటించినా అవేవీ రుక్మిణిని సక్సెస్ కు దగ్గర చేయలేదు.
కాంతార చాప్టర్1తో మంచి సక్సెస్
కానీ ఆ తర్వాత శివ కార్తికేయన్ మదరాసి లో తన యాక్టింగ్ తో మెప్పించిన రుక్మిణి, కాంతార చాప్టర్1లో నటించి, తన నటనతో ఫ్యాన్స్ ను సంతృప్తి పరిచింది. అయితే రుక్మిణి ఏ ముహుర్తాన సప్త సాగరాలు దాటి మూవీ చేసిందో కానీ అప్పట్నుంచి ఆమెకు అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. తాను నటించిన సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా రుక్మిణికి ఛాన్సులు క్యూ కడుతున్నాయి.
టాక్సిక్ లో కీలక పాత్ర..
ప్రస్తుతం కన్నడ రాక్ స్టార్ యష్ నటిస్తున్న టాక్సిక్ మూవీలో ఓ కీలక పాత్రలో నటిస్తున్న రుక్మిణి, ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్టులో కూడా నటిస్తుందని, ఆల్రెడీ ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ లో రుక్మిణి జాయిన్ అయిందని టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పుడు రుక్మిణికి మరో గోల్డెన్ ఛాన్స్ దక్కినట్టు తెలుస్తోంది.
RC17లో రుక్మిణి
మరో టాలీవుడ్ స్టార్ హీరో సరసన రుక్మిణి నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ స్టార్ హీరో మరెవరో కాదు, రామ్ చరణ్. ప్రస్తుతం బుచ్చిబాబు సాన దర్శకత్వంలో పెద్ది మూవీ చేస్తున్న చరణ్, ఆ తర్వాత సుకుమార్ తో తన 17వ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో రామ్ చరణ్ సరసన రుక్మిణి నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆల్రెడీ సుకుమార్ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశారని, ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని తెలుస్తోంది. మరి రామ్ చరణ్- సుకుమార్ కాంబోలో వచ్చే సినిమాలో రుక్మిణి హీరోయిన్ గా నటిస్తుందని వస్తున్న వార్తల్లో నిజమెంతో తెలియదు కానీ ఒకవేళ నిజమైతే మాత్రం అమ్మడి దశ మారిపోయినట్టే.
