Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ డ్రాగన్ లో రుక్మిణి.. ఆ స్టార్ హీరోలతో కూడా ఛాన్స్.. లైనప్ అదర్స్!

రుక్మిణి వసంత్.. కన్నడ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న ఈమె 'బీర్బల్ ట్రైలాజీ కేస్ 1: ఫైండింగ్ వజ్రముని'అనే సినిమాతో ఇండస్ట్రీకి అరంగేట్రం చేసింది. ఆ తర్వాత 'సప్తసాగరాలుదాటి' సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించింది.

By:  Madhu Reddy   |   1 Sept 2025 10:26 AM IST
ఎన్టీఆర్ డ్రాగన్ లో రుక్మిణి.. ఆ స్టార్ హీరోలతో కూడా ఛాన్స్.. లైనప్ అదర్స్!
X

రుక్మిణి వసంత్.. కన్నడ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న ఈమె 'బీర్బల్ ట్రైలాజీ కేస్ 1: ఫైండింగ్ వజ్రముని'అనే సినిమాతో ఇండస్ట్రీకి అరంగేట్రం చేసింది. ఆ తర్వాత 'సప్తసాగరాలుదాటి' సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించింది. ఇందులో రక్షిత్ శెట్టి హీరోగా నటించారు.. అయితే ఈ సినిమా కన్నడ చిత్రమైనా తెలుగులో అనువదించబడి అలా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇకపోతే 2024లో వచ్చిన 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను నేరుగా పలకరించింది రుక్మిణి వసంత్.

మదరాసి సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు..

గత కొంతకాలంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న 'డ్రాగన్' సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది అంటూ వార్తలు వస్తున్నాయి. కానీ దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ తాజాగా శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న 'మదరాసి' సినిమాలో ఈమె హీరోయిన్ గా నటిస్తోంది. సెప్టెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సినిమా. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించగా.. ఈ ఈవెంట్ లో భాగంగా రుక్మిణి వసంత్ తదుపరి చిత్రాల లైనప్ గురించి నిర్మాత ఎన్ వి ప్రసాద్ ఊహించని కామెంట్లు చేశారు.

రుక్మిణి వసంత్ లైనప్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత..

ఎన్ వి ప్రసాద్ మాట్లాడుతూ.." ప్రస్తుతం రుక్మిణి వసంత్ రిషబ్ శెట్టి హీరోగా నటిస్తున్న 'కాంతారా: చాప్టర్ 1' సినిమాలో నటిస్తోంది. దీంతోపాటు కేజీఎఫ్ హీరో యష్ తాజాగా నటిస్తున్న 'టాక్సిక్' సినిమాలో కూడా ఈమె అవకాశం అందుకుంది. అంతేకాదు ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న 'డ్రాగన్' సినిమాలో కూడా ఈమె నటిస్తోంది" అంటూ రుక్మిణి వసంత్ లైనప్ పై షాకింగ్ కామెంట్లు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు నిర్మాత ఎన్వి ప్రసాద్. మొత్తానికైతే ముగ్గురు బడా హీరోల చిత్రాలలో అందులోనూ.. అన్నీ పాన్ ఇండియా చిత్రాలు కావడంతో ఈ అమ్మడు రేంజ్ మరింత పెరిగిపోతుందని అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు.

మదరాసిపై బోలెడు ఆశలు..

గతంలో నిఖిల్ హీరోగా వచ్చిన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది..కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా డిజాస్టర్ అయ్యింది. అయినా సరే ఫాలోవర్స్ మాత్రం ఈమెకు ఇంస్టాగ్రామ్ లో భారీగా పెరిగిపోయారు. ఇప్పుడు ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ సినిమాతో మంచి విజయం అందుకోవాలని ప్రయత్నం చేస్తోంది.ఈ సినిమా గనుక హిట్ అయితే ఇక తెలుగు సినిమాలలో వరుసగా అవకాశాలు వస్తాయని కూడా భావిస్తోంది రుక్మిణి వసంత్. దీనికి తోడు తమిళ్లో ఈమె చేస్తున్న మదరాసి సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించాలని కూడా కోరుకుంటుంది . ఒకవేళ ఈ సినిమా గనుక హిట్ అయితే తమిళంలో ఈమెకు మరిన్ని ఆఫర్లు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. మొత్తానికి అయితే ఇప్పుడు మదరాసి సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకుంది రుక్మిణి వసంత్. ఈ చిత్రానికి ఏ ఆర్ మురగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.