Begin typing your search above and press return to search.

రిలేష‌న్‌షిప్స్.. ఎమోష‌న్స్ పీక్స్..'టాక్సిక్‌'పై రుక్మిణి హింట్!

ఈ చిత్రం భారీ కాన్వాస్‌పై రూపొందినా ఇందులో ఎంతో హృద్యమైన సంబంధాలు.. ఆకట్టుకునే మానవ సంఘర్షణలు అంతర్లీనంగా ఉన్నాయని రుక్మిణి వివరించారు.

By:  Sivaji Kontham   |   23 Aug 2026 5:08 PM IST
రిలేష‌న్‌షిప్స్.. ఎమోష‌న్స్ పీక్స్..టాక్సిక్‌పై రుక్మిణి హింట్!
X

దక్షిణాది చిత్ర పరిశ్రమతో పాటు పాన్-ఇండియా స్థాయిలో కథానాయకిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంటున్న నటి రుక్మిణి వసంత్.. హైద‌రాబాద్ ప్రీరిలీజ్ వేడుక‌లో యాంక‌ర్ సుమతో జరిపిన సంభాషణలో `టాక్సిక్` గురించి ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను షేర్ చేసారు. ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ ప్రాజెక్ట్ సహా వరుస భారీ చిత్రాల్లో అవకాశాలు సాధిస్తూ ఆడియన్స్‌కు ఎంతగానో చేరువవుతున్న రుక్మిణి `టాక్సిక్` సినిమా ప్రపంచం అత్యంత విశాలమైనదని వ్యాఖ్యానించారు. ఇప్పటికే విడుదలైన టీజర్లు, ట్రైలర్లు ప్రేక్షకుల్లో అంచనాలను పెంచినా కేవలం భారీ విజువల్స్ మాత్రమే కాకుండా ఈ కథలో ప్రతి ఒక్కరినీ.. ముఖ్యంగా ఆడవాళ్లను కట్టిపడేసే అద్భుతమైన భావోద్వేగాలు ఉన్నాయని వెల్లడించారు.

ఈ చిత్రం భారీ కాన్వాస్‌పై రూపొందినా ఇందులో ఎంతో హృద్యమైన సంబంధాలు.. ఆకట్టుకునే మానవ సంఘర్షణలు అంతర్లీనంగా ఉన్నాయని రుక్మిణి వివరించారు. దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ అత్యంత సున్నితమైన మానవ భావోద్వేగాలను, అనుబంధాలను ఈ విశాలమైన సినిమా ప్రపంచంలో ఎంతో ఆకట్టుకునేలా ఆవిష్కరించారని చెప్పారు. పైన కనిపిస్తున్న యాక్షన్ అండ్ మాస్ అంశాల వెనుక ఎంతో లోతైన కథాంశం దాగి ఉందని... అది క‌చ్చితంగా ప్రేక్షకుల హృదయాలను తాకుతుందని ధీమా వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. జీవితంలో ఎలాంటి అలజడులు లేదా సమస్యలు ఎదురైనా అందరిలాగే తాను కూడా ముందుగా ఆశ్రయించేది తన `అమ్మ`నేనని సరదాగా వ్యాఖ్యానించారు. మానసిక ప్రశాంతత కోసం .. సమస్యలను పంచుకోవడానికి అమ్మే అత్యుత్తమ వేదిక అని రుక్మిణి నవ్వుతూ సమాధానమిచ్చారు. విజువల్ గ్రాండియారిటీతో పాటు బలమైన భావోద్వేగ మూలాలు ఉన్న `టాక్సిక్` సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పుడు క‌చ్చితంగా ఒక గొప్ప అనుభూతిని అందిస్తుందని రుక్మిణి వసంత్ తెలిపారు.

సినిమా ముచ్చట్లతో పాటు రుక్మిణి వసంత్ ఫ్యాషన్ - అలంకరణ శైలి కూడా సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రీరిలీజ్ కోసం ధరించిన బ్లాక్ డిజైన‌ర్ ఫ్రాక్.. స్టైలింగ్ వేదిక‌పై ప్రత్యేకమైన గ్రేస్‌ను తెచ్చిపెట్టింది. చేతికి ఈ చిన్న వంకీ ఆభరణం మొత్తం రూపానికి ఒక వినూత్నమైన మేకోవర్‌ను అందించి, అందరి దృష్టినీ తనవైపు తిప్పుకునేలా చేసింది. అటు నటనలోనూ, ఇటు ఫ్యాషన్ విషయంలోనూ తనదైన ముద్ర వేస్తున్న రుక్మిణి వసంత్ `టాక్సిక్` చిత్రంతో వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ చేయబోతోందోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.