రుక్కు కోసం స్టార్స్ వెయిటింగ్..?
కన్నడ భామ రుక్మిణి వసంత్ ఇప్పుడు సూపర్ ఫామ్ కొనసాగిస్తుంది. కన్నడలో అమ్మడు చేస్తున్న సినిమాలు సూపర్ హిట్ అవ్వడమే కాదు ఆమెకు సౌత్ లో బీభత్సమైన క్రేజ్ తెచ్చాయి.
By: Ramesh Boddu | 6 Dec 2025 9:00 PM ISTకన్నడ భామ రుక్మిణి వసంత్ ఇప్పుడు సూపర్ ఫామ్ కొనసాగిస్తుంది. కన్నడలో అమ్మడు చేస్తున్న సినిమాలు సూపర్ హిట్ అవ్వడమే కాదు ఆమెకు సౌత్ లో బీభత్సమైన క్రేజ్ తెచ్చాయి. కాంతారా చాప్టర్ 1లో కనకావతి రోల్ లో అమ్మడి పర్ఫార్మెన్స్, గ్లామర్ అన్నీ రుక్మిణికి మరింత పాపులారిటీ తెచ్చాయి. అందుకే అమ్మడికి వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఆల్రెడీ ఈ అమ్మడు ఎన్ టీ ఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ ప్రాజెక్ట్ లో నటిస్తుంది. ఈ సినిమాలో రుక్మిణికి కూడా మంచి రోల్ దక్కినట్టు తెలుస్తుంది.
టాలీవుడ్ లో వరుస స్టార్ హీరోలతో రుక్మిణి వసంత్..
రుక్మిణి వసంత్ ఎన్టీఆర్ తర్వాత టాలీవుడ్ లో వరుస స్టార్ హీరోలతో జత కట్టే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. అమ్మడికి తెలుగులో కూడా సూపర్ క్రేజ్ ఏర్పడింది. రష్మిక, పూజా హెగ్దే లాంటి వాళ్లను వెనక్కి నెట్టి రుక్మిణి ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంటుంది. అందుకే స్టార్స్ కూడా ఆమెకే ఓటేస్తున్నారు. రుక్మిణి వసంత్ ఎన్ టీ ఆర్ సినిమా రిలీజ్ అవ్వడమే ఆలస్యం నెక్స్ట్ లిస్ట్ లో అల్లు అర్జున్, రామ్ చరణ్ కూడా ఉన్నారని తెలుస్తుంది.
సుకుమార్ చరణ్ కాంబినేషన్ సినిమాలో రుక్మిణి వసంత్ నే హీరోయిన్ గా తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక అల్లు అర్జున్, అట్లీ మూవీ తర్వాత నెక్స్ట్ సినిమాకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న రుక్మిణి వసంత్ నే తన సినిమాలో తీసుకోవాలనే ప్లానింగ్ ఉందట. సో రుక్మిణి ఈ కొత్త జోడీలు ఫ్యాన్స్ కి సూపర్ ఎంటర్టైన్మెంట్ అందిస్తాయి. ఐతే రుక్మిణి వసంత్ కేవలం స్టార్ హీరోలతోనే కాదు తెలుగులో మంచి లవ్ స్టోరీస్ చేయాలని ఆడియన్స్ కోరుతున్నారు.
సప్త సాగరాలు దాటి సినిమాలో ప్రియ పాత్రలో..
సప్త సాగరాలు దాటి సినిమాలో ప్రియ పాత్రలో అలరించిన రుక్మిణి తెలుగులో కూడా అలాంటి లవ్ స్టోరీస్ ని చేస్తే బెటర్ అని భావిస్తున్నారు. కమర్షియల్ సినిమాలు చేసినా ఆమె మార్క్ నటనతో ఆకట్టుకుంటే మాత్రం రుక్మిణి నెక్స్ట్ టాలీవుడ్ బిగ్ స్టార్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. తెలుగులో నిఖిల్ తో అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమా చేసింది కానీ అది ఎలా వచ్చిందో అలానే వెళ్లింది. అందుకే ఎన్ టీ ఆర్ సినిమాతో అమ్మడు గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలని ఫిక్స్ అయ్యింది.
కన్నడలో పాపులారిటీ ఉన్న రష్మిక తెలుగులో కాస్త ఫామ్ రాగానే అక్కడ సినిమాలు తగ్గించింది ఐతే రుక్మిణి మాత్రం తెలుగు సినిమాలు చేసినా కూడా కన్నడ ఛాన్స్ లను మాత్రం అసలు వదిలేదని అంటుంది. మరి అమ్మడు అక్కడ ఇక్కడ ఎలా బ్యాలెన్స్ చేస్తుంది అన్నది చూడాలి.
