Begin typing your search above and press return to search.

రుక్కు గ్లోబల్ ఛాన్స్.. ఫ్యాన్స్ కి పండగే..!

ఇక రీసెంట్ గా కాంతారా చాప్టర్ 1 తో సూపర్ హిట్ అందుకున్న అమ్మడు నెక్స్ట్ ఎన్టీఆర్ డ్రాగన్ లో ఛాన్స్ పట్టేసింది. తారక్ తో సినిమా పడితే అమ్మడికి స్టార్ స్టేటస్ వచ్చినట్టే లెక్క. ఈ క్రమంలో తెలుగులో రుక్మిణికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది.

By:  Ramesh Boddu   |   27 Dec 2025 2:00 PM IST
రుక్కు గ్లోబల్ ఛాన్స్.. ఫ్యాన్స్ కి పండగే..!
X

కన్నడ భామ రుక్మిణి వసంత్ ఇప్పుడు అన్ని భాషల్లో హాట్ ఫేవరేట్ హీరోయిన్ అయ్యింది. సప్త సాగరాలు దాటి సినిమాతో ఆమె పాపులర్ అవగా తెలుగులో నిఖిల్ తో అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమా చేసింది. ఐతే ఆ సినిమా ఎలా వచ్చిందో అలానే వెళ్లింది. ఇక రీసెంట్ గా కాంతారా చాప్టర్ 1 తో సూపర్ హిట్ అందుకున్న అమ్మడు నెక్స్ట్ ఎన్టీఆర్ డ్రాగన్ లో ఛాన్స్ పట్టేసింది. తారక్ తో సినిమా పడితే అమ్మడికి స్టార్ స్టేటస్ వచ్చినట్టే లెక్క. ఈ క్రమంలో తెలుగులో రుక్మిణికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. రుక్మిణి కూడా తెలుగులో వస్తున్న ఆఫర్లకు సూపర్ హ్యాపీగా ఉంది.

నెక్స్ట్ సినిమాలో చరణ్ తో రుక్మిణి..

ఎన్టీఆర్ సినిమా పూర్తి కాకముందే రుక్మిణికి ఉన్న ఫాలోయింగ్ చూసి స్టార్ ఛాన్స్ లు వస్తున్నాయి. ఈ క్రమంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన నెక్స్ట్ సినిమాలో రుక్మిణితో రొమాన్స్ చేయబోతున్నాడట. పెద్ది తో మార్చి ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యాడు చరణ్. ఈ సినిమా తర్వాత సుకుమార్ తో ఒక సినిమా ప్లానింగ్ ఉంది. రంగస్థలం తో ఈ కాంబో సూపర్ హిట్ సెన్సేషన్ అనిపించుకోగా మరోసారి ఇద్దరు కలిసి సినిమా చేస్తున్నారు.

సుకుమార్, చరణ్ సినిమాలో హీరోయిన్ గా రుక్మిణి వసంత్ ని ఫిక్స్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మొన్నటిదాకా రష్మిక వెంట పడిన టాలీవుడ్ మేకర్స్ ఇప్పుడు రుక్మిణి వసంత్ తో సినిమాకు రెడీ అనేస్తున్నారు. అమ్మడు కూడా తన లుక్స్ తో ఆకట్టుకుంటుంది. కాంతార 1 తో రుక్మిణి సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఆ సినిమా తర్వాత సౌత్ లోనే కాదు నేషనల్ వైడ్ గా ఎక్కువగా సెర్చ్ చేసే హీరోయిన్ గా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది రుక్మిణి.

రుక్మిణికి టాప్ రేంజ్ క్రేజ్..

సో ఆ పాపులారిటీని క్యాష్ చేసుకోవాలనే ప్లానింగ్ తోనే మన మేకర్స్ అమ్మడికి వరుస ఛాన్స్ లు ఇస్తున్నారు. తెలుగులో ఎన్ టీ ఆర్ సినిమా వెంటనే చరణ్ సినిమా పడటంతో రుక్మిణికి నిజంగానే టాప్ రేంజ్ క్రేజ్ వచ్చేలా ఉంది. స్టార్స్ మాత్రమే కాదు రుక్మిణి తెలుగులో యువ హీరోలతో కూడా నటించేందుకు రెడీ అనేస్తుందట. సో అమ్మడి ప్లానింగ్ చూస్తుంటే టాలీవుడ్ లో టాప్ ప్లేస్ నే టార్గెట్ పెట్టినట్టు అనిపిస్తుంది.

రుక్మిణి వసంత్ రాబోయే రెండు మూడేళ్లలో ఈ పేరు బాగా వినిపించేలా ఉంది. కేవలం టాలీవుడ్ లోనే కాదు అటు కోలీవుడ్, శాండల్ వుడ్ లో కూడా రుక్మిణి వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంది. పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న టాలీవుడ్ లో అమ్మడికి మంచి డిమాండ్ ఏర్పడింది.