Begin typing your search above and press return to search.

రుక్మిణితో 'తార'.. క్రేజీ క్రేజీగా..

కథ కోసం స్వయంగా హీరోయిన్ అపాయింట్‌మెంట్ కోసం డైరెక్టర్ టీమ్ పడిగాపులు కాయడం, తీరా ఆమె రాగానే ఎగ్జైట్‌మెంట్‌తో చేతులు కలపడం అనే సరికొత్త కాన్సెప్ట్‌తో ఒక ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ వచ్చింది

By:  M Prashanth   |   23 Oct 2026 10:53 AM IST
రుక్మిణితో తార.. క్రేజీ క్రేజీగా..
X

కథ డిమాండ్ చేస్తే డైరెక్టర్లే హీరోల దగ్గరకు వెళ్లడం కామన్, కానీ ఇక్కడ సీన్ రివర్స్. కథ కోసం స్వయంగా హీరోయిన్ అపాయింట్‌మెంట్ కోసం డైరెక్టర్ టీమ్ పడిగాపులు కాయడం, తీరా ఆమె రాగానే ఎగ్జైట్‌మెంట్‌తో చేతులు కలపడం అనే సరికొత్త కాన్సెప్ట్‌తో ఒక ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. 'ఒకే ఒక జీవితం' సినిమాతో క్లాసిక్ హిట్ అందుకున్న దర్శకుడు శ్రీ కార్తీక్ తన తర్వాతి ప్రాజెక్ట్ కోసం కన్నడ సెన్సేషన్ రుక్మిణి వసంత్‌ను రంగంలోకి దించారు. 'తార' అనే పాత్రలో ఆమెను పరిచయం చేస్తూ మేకర్స్ రిలీజ్ చేసిన స్పెషల్ గ్లింప్స్ ఇప్పుడు నెట్టింట మంచి పాజిటివ్ బజ్ తెచ్చుకుంది.

ఈ వీడియో ఫన్ అండ్ లైవ్లీ మూడ్‌లో సాగింది. ప్రొడ్యూసర్ కాల్స్ వస్తుంటే భయపడుతూ, దేవతార్చన గదిలో కెమెరా ముందు నిలబడి "మా తారను మా కళ్ల ముందు చూపించు స్వామి" అంటూ డైరెక్టర్, అతని టీమ్ పూజలు చేయడం మంచి నవ్వులు పూయించింది. ఇందులో 'నిక్కీ' అనే కెమెరానే ఒక క్యారెక్టర్‌గా మాట్లాడటం, దానికి ప్రాణం ఉన్నట్లు డిజైన్ చేసిన విధానం చాలా కొత్తగా అనిపించింది. చివరకు ఆఫీస్‌కు వెళ్లి రెడ్ డ్రెస్సులో ఉన్న రుక్మిణి వసంత్‌ను కలవడం, ఆమె కథ వినగానే ఒకే చెప్పేయడం వీడియోలో చకచకా జరిగిపోయాయి.

సప్త సాగరదాచే ఎల్లో సినిమాతో సౌత్ అంతటా క్రేజ్ సంపాదించుకున్న రుక్మిణి వసంత్ స్క్రీన్ ప్రెజెన్స్ ఈ వీడియోకి మెయిన్ ఎట్రాక్షన్. కేవలం గ్లామర్ కోసమే కాకుండా పెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలను ఎంచుకునే ఈ బ్యూటీ, ఇందులో 'తార'గా కనిపించబోతోంది. "మ్యానిఫెస్టేషన్ వర్క్స్" అంటూ చివర్లో ఆమె ఇచ్చిన నవ్వుతో పాటు, పక్కన ఉన్న టీమ్ ఎనర్జీ సినిమాపై మంచి వైబ్‌ను క్రియేట్ చేసింది.

ఆ తర్వాత రెడ్ కలర్ వింటేజ్ కారులో 'రుక్మిణి వసంత్ యాజ్ తార' అంటూ వదిలిన రోడ్ ట్రిప్ విజువల్స్ చూస్తుంటే, ఇదొక క్రేజీ అండ్ ఫన్ రోడ్ జర్నీ మూవీలా కనిపిస్తోంది. శ్రీ కార్తీక్ మొదటి సినిమాలో సైన్స్ ఫిక్షన్ ఎమోషన్‌ను ఎంత సున్నితంగా డీల్ చేశాడు. ఇప్పుడు దానికి భిన్నంగా పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ బడ్డీ కామెడీ జానర్‌లోకి అడుగుపెడుతున్నట్లు అర్థమవుతోంది. దేవ్ రామ్‌నాథ్, వినాయక్ వైద్యనాథన్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తూనే రచన, నిర్మాణ భాగస్వామ్యంలోనూ ఉన్నారు.

సిరూని సినీ కార్పొరేషన్, మ్యాడ్‌బాయ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై జస్వంత్ నడిపల్లి, దేవ్ రామ్‌నాథ్, ఎస్.ఎస్. శ్రీ కార్తీక్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయికృష్ణ గద్వాల కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే అధికారిక టైటిల్‌ను కూడా రివీల్ చేయబోతున్నట్లు చివర్లో వెల్లడించారు. రొటీన్ పోస్టర్లు, ప్రెస్ నోట్లకు భిన్నంగా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ వీడియోతో ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసిన విధానం ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. రుక్మిణి వసంత్ లైనప్‌లో ఇప్పటికే భారీ ప్రాజెక్టులు ఉండగా, ఇలాంటి క్రేజీ జర్నీ కథ ఆమెకు ఎలాంటి గుర్తింపు తెస్తుందో చూడాలి.