బ్లాక్ అవుట్ ఫిట్ లో ఆకట్టుకుంటున్న కనకావతి..
సాధారణంగా ఇండస్ట్రీలో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి అంటే సినిమాలలో మంచి పాత్రలైనా పడాలి.
By: Madhu Reddy | 16 Nov 2025 5:00 AM ISTసాధారణంగా ఇండస్ట్రీలో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి అంటే సినిమాలలో మంచి పాత్రలైనా పడాలి. లేదా సోషల్ మీడియాలో ఫాలోవర్స్ అయినా ఎక్కువగా ఉండాలి. ఇకపోతే అదృష్టం ఉంటేనే సరైన పాత్రలు లభిస్తాయని ఇప్పటికే ఎంతోమంది నిరూపించారు కూడా. మరి కొంతమంది ఇటు సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్ ను వేదికగా చేసుకొని తమ అందాలతో అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇకపోతే గ్లామర్ తోనే కాదు సాంప్రదాయంగా కూడా ఆకట్టుకుంటున్న హీరోయిన్స్ లేకపోలేదు.. అలాంటి వారిలో ప్రథమంగా వినిపించే పేరు రుక్మిణి వసంత్.
సప్తసాగరాలు దాటి అనే కన్నడ సినిమాతో ఇటు తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించిన రుక్మిణి వసంత్.. 2024లో వచ్చిన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈమె రిషబ్ శెట్టి హీరోగా వచ్చిన కాంతార 2లో కనకావతి పాత్ర పోషించి అబ్బురపరిచింది. ముఖ్యంగా యువరాణి పాత్రలో నటించిన ఈమె నెగటివ్ షేడ్స్ లో కనిపించి.. తన నటనతో ఒక సందర్భంలో హీరోనే డామినేట్ చేసింది అనడంలో సందేహం లేదు. అంతలా తన నటనతో ఆకట్టుకుని పాన్ ఇండియా హీరోయిన్ గా పేరు సొంతం చేసుకున్న రుక్మిణి వసంత్ ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న ఎన్టీఆర్ 31 సినిమాలో నటిస్తోంది.
అలాగే ప్రముఖ కన్నడ హీరో యష్ హీరోగా నటిస్తున్న టాక్సిక్ సినిమాలో కూడా ఈమె హీరోయిన్గా అవకాశం దక్కించుకుంది. ఇక అలా ఇప్పుడు ఏకంగా రెండు పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా మారిన రుక్మిణి వసంత్ మరొకవైపు అభిమానులను అలరించడానికి సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈ చిత్రంలో కనకావతీ పాత్రలో నటించిన ఈమె.. ఆ పాత్ర నుండి కొద్ది రోజులు తేరుకోలేకపోయింది. అందులో భాగంగానే యువరాణిలా తన గెటప్లతో అభిమానులను ఆకట్టుకుంది. రోజుకొక సాంప్రదాయ వేషధారణతో అబ్బురపరిచింది. దీనిని చూసిన అభిమానులు కాంతార నుంచి ఇంకా బయటపడలేకపోతోంది అనే కామెంట్ కూడా చేశారు.
అయితే ఇప్పుడిప్పుడే తన మేకోవర్లో మార్పులు చేసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.. తాజాగా క్రీమ్ కలర్ ప్యాంట్ , బ్లాక్ కలర్ టీ షర్ట్ ధరించి తన అందంతో ఆకట్టుకుంది.. ముఖ్యంగా ఇందులో టీనేజ్ అమ్మాయిలా కనిపిస్తూ.. హొయలు పోయింది. పైగా జుట్టును సరళంగా వదిలేసిన రుక్మిణి వసంత్ తన అందంతో.. చిరునవ్వుతో అభిమానుల హృదయాలలో చెరగని ముద్ర వేసుకుంటుంది. ఇక చేతిలో పుస్తకంతో అందరినీ ఆకట్టుకుంది రుక్మిణి వసంత్ ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఇప్పుడిప్పుడే తన అందంతో నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె.. ఇటు సోషల్ మీడియాలో కూడా ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో పడింది. ఏదేమైనా రుక్మిణి వసంత్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
