Begin typing your search above and press return to search.

రెడ్ గౌన్‌లో రుక్మిణి వసంత్ స్టన్నింగ్ లుక్

తన సహజ సిద్ధమైన నటనతో, క్యూట్ లుక్స్‌తో కుర్రాళ్ల మనసు దోచుకున్న ఈ కన్నడ బ్యూటీ, తాజాగా సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

By:  Madhu Reddy   |   25 April 2026 7:46 PM IST
రెడ్ గౌన్‌లో రుక్మిణి వసంత్ స్టన్నింగ్ లుక్
X

సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా రుక్మిణి వసంత్ పేరే వినిపిస్తోంది. తన సహజ సిద్ధమైన నటనతో, క్యూట్ లుక్స్‌తో కుర్రాళ్ల మనసు దోచుకున్న ఈ కన్నడ బ్యూటీ, తాజాగా సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అదిరిపోయే రెడ్ గౌన్‌లో ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు చూస్తుంటే, దేవకన్య దిగివచ్చిందా అన్నట్లుగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతూ ఫ్యాన్స్‌కు కనువిందు చేస్తున్నాయి. ఆ విశేషాలు చూద్దాం..




జీక్యూ ఇండియా ఈవెంట్‌లో మెరిసిన తార:

తాజాగా ముంబైలో జరిగిన 'జీక్యూ ఇండియా మోస్ట్ ఇన్‌ఫ్లుయెన్షియల్ యంగ్ ఇండియన్స్ 2026' వేడుకలో రుక్మిణి వసంత్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ కోసం ఆమె ప్రముక డిజైనర్లు శాంతను మరియు నిఖిల్ రూపొందించిన కస్టమ్ రెడ్ సీక్విన్డ్ గౌన్‌ను ధరించారు. ఈ డ్రెస్ ఆమె అందాన్ని మరింత రెట్టింపు అయింది. ఇక స్వీట్‌హార్ట్ నెక్ లైన్, క్లాసిక్ కార్సెట్ స్టైల్ బాడీస్ మరియు మెరిసే పూసల పనితనంతో ఉన్న ఈ డ్రెస్ రుక్మిణికి ఒక రాయల్ లుక్‌ను ఇచ్చింది.




ఎమోషనల్ అయిన రుక్మిణి:

ఈ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ రుక్మిణి తన మనసులోని మాటలను పంచుకున్నారు. "ఈ రాత్రికి నేను రెడ్ డ్రెస్ వేసుకున్నాను.. ఎంతో అద్భుతంగా పనిచేస్తున్న వ్యక్తుల మధ్య ఆ గదిలో ఉండటం చాలా ఆనందంగా ఉంది. అక్కడ అందరినీ చూస్తుంటే కాస్త భయం, మరికాస్త ఆశ్చర్యం కలిగాయి.. కానీ వీటన్నిటికంటే ముందు కృతజ్ఞతా భావంతో నా మనసు నిండిపోయింది" అంటూ పోస్ట్ చేశారు. ఇక ఆమె చేసిన ఈ ఎమోషనల్ కామెంట్స్ చూసి నెటిజన్లు ఆమె వినయానికి ఫిదా అవుతున్నారు.




బెంగుళూరు నుంచి లండన్ దాకా ప్రయాణం:

రుక్మిణి వసంత్ కేవలం అందగత్తె మాత్రమే కాదు, నటనలో మంచి శిక్షణ పొందిన నటి. బెంగుళూరుకు చెందిన ఈమె లండన్‌లోని ప్రఖ్యాత 'రాయల్ అకాడమీ ఆఫ్ డ్రమాటిక్ ఆర్ట్స్'లో నటనలో పట్టా పొందారు. 2019లో 'బీర్బల్ ట్రైలాజీ'తో కెరీర్ మొదలుపెట్టి, 2023లో వచ్చిన 'సప్త సాగరదాచే ఎల్లో' చిత్రాలతో భారీ పాపులారిటీ సంపాదించారు. ఆ సినిమాలో ఆమె నటనకు ఫిలింఫేర్ క్రిటిక్స్ అవార్డు కూడా దక్కడం విశేషం.




ప్రస్తుతం రుక్మిణి వసంత్ సౌత్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయారు. కన్నడలో 'కాంతార చాప్టర్ 1' వంటి భారీ ప్రాజెక్టులోనటించి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక తెలుగు మరియు తమిళ భాషల్లో కూడా క్రేజీ ఆఫర్లు అందుకుంటున్నారు. తనదైన స్టైల్ స్టేట్‌మెంట్‌తో ఫ్యాషన్ ఐకాన్‌గా మారుతున్న ఈ బ్యూటీ, రాబోయే రోజుల్లో స్టార్ హీరోయిన్‌గా ఎదగడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

సినిమా అయినా, సోషల్ మీడియా అయినా రుక్మిణి వసంత్ తన మార్క్ చూపిస్తున్నారు. తాజా ఫోటో షూట్‌తో గ్లామర్ పరంగా కూడా తనేమీ తక్కువ కాదని నిరూపించారు. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తూనే, ఇలాంటి స్టన్నింగ్ లుక్స్‌తో అలరిస్తున్న ఈ కుందనపు బొమ్మకు రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు అందాలని కోరుకుందాం.